Sep2008
కుట్ర
సోక్రటీసు ను సోక్రటీసు గా చేయడం కోసం
ప్రపంచమంతా కుట్ర పన్నుతుంది
లోడొల్ల నిశ్చల నిశ్చితాల మధ్య
అతడికొక గయ్యాళి పెళ్ళాన్ని ఇస్తుంది
ఒక కవితో మంచి కవిత్వం రాయించడానికి
ప్రపంచమంతా కలిసి కుట్ర పన్నుతుంది
తిడుతుంది కొడుతుంది జైల్లో వేస్తుంది
ఎవరూ ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూయిస్తుంది
నన్ను నన్నుగా చేయడానికి
ప్రపంచమంతా కలిసి కుట్ర పన్నుతుంది
అన్ని మధుర స్వప్నాలను పీడకలలుగా మార్చేస్తుంది
పూర్తిగా నాదయిన కథను నాతో రాయిస్తుంది
October 2nd, 2008 at 6:04 am
[...] కుట్ర : హెచ్చార్కె [...]
October 2nd, 2008 at 6:06 am
[...] మహారాజు ‘రజాకార్‘, హెచ్చార్కె ‘కుట్ర‘ కవితలనీ, జి.వెంకటకృష్ణ ‘దారి కాచిన [...]