రజాకార్‌

- డాక్టర్‌ దేవరాజు మహారాజు

razakar.jpg

ఎవరదీ చరిత్ర చెట్టును ఊడబెరికి
తిప్పిపెట్టిందీ ?
వ్రేళ్ళను గాల్లోకి వదిలేసి
మొగ్గల్ని,పూలను,ఫలాలను
నిలువునా పాతి పెట్టింది?
తరతరాల బూజుల్ని వెయ్యిసార్లు కీర్తించి
దాశరధి,ముఖ్దుం,ఆళ్వారు స్వామిని
అపహాస్యం చేసింది?
ఒక ముష్కరుడి సమాధి దర్శించి
వాడి క్రూరత్వానికి బలైన
బతుకమ్మల నగ్నత్వానికి చొళ్ళు కార్చుకుంది?
ఆత్మను చంపుకుని, తన్నుతాను అంగట్లో పెట్టుకుని
ఈ నేల ఔన్నత్వాన్ని ఎవడైనా జెండాలా ఎగరేయగలడా?
నన్ను, నా ఉనికిని, నాభాషను, నా సాహిత్యాన్ని
ఏళ్ళ కేళ్ళు చీకట్లో బంధించిన వాడికి
వత్తాసు పలికేవాడు నాయకుడెలా అవుతాడు?
పగటిని రాత్రిగా రాత్రిని పగటిగా
ప్రకటించేవాడు ఆత్మవిమర్శ చేసుకోవాల!
చేతులతో నడుస్తూ
కాళ్ళతో నమస్కారాలు చేసే కుసంస్కారిని
ఈ జాతి ముమ్మాటికీ క్షమించదని తెలుసుకోవాలి!!

మారువేషాలలో రజాకార్లు తిరుగుతున్నారు
జాగ్రత్త!

6 అభిప్రాయాలు »కవితలు

6 Responses to “రజాకార్‌”

  1. 1
    prof..venkat rao Says:

    ఈ క్ వీ త చాలా చాలా బాగుంది. తెలంగాన ఎవడి అబ్బ సొమ్ము.ఆ పేరు తొ చిల్లర రాజ కీయాలు చెఎస్తున్నారు.వీల్లంతా రజాకారులె.

  2. 2
    gurram seetaramulu Says:

    కవిత చాల బాగుంది
    తెలంగాణా ఈ రొజు అంగట్లొ సరుకయింది
    ఆంద్ర కాముకుల విలాస కీలికి అపహాస్యమయింది
    ఆద్ర బొజనాలకు అంగటఇంది
    ఈ విద్ర్హొహ దినమ్ నాడయనా ఎవరికి వారె
    సొంత్ రాస్త్రము గా ప్రకటీచుకుందామ్
    JAI TELAGAANAA

  3. 3
    rajender reddy Says:

    తెలంగాన పెరుతొ రజకీయము చెసెవారు అంతా రజకారులె.కవిత కల్లు తెరిపెంచెదిగా ఊంది,భావస్పొరకంగా ఊంది.

  4. 4
    ramulu Says:

    ఎన్నాళ్ళీకవిత్వాలు రాసుకుందాం,
    ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళం తిట్టుకుందాం !
    తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఇంకా లెక్కపెట్టలేక పోతున్నాం,
    తెలుగు వాళ్ళమనే పేరుతో ఇంకా మోసం చెయ్యనిస్తూనే ఉన్నాం !
    తెలంగాణ ఉద్యమాన్ని అణచలేని పాలకులకు తెలంగాణనే మట్టుబెట్టనిస్తున్నాం,
    అందుకే జలంపేరిట కాల్వలు తొవ్వుడు ,ఈగ్రేటర్ హైదరాబాద్ లు పెట్తనిస్తున్నాం !
    బైపాస్ రోడ్లకు,బైపాస్ కాల్వలకు ఎస్ఇజెడ్లకు పనికొచ్చి తెలంగాణనే అమ్ముకుంటున్నాం
    మన భూములకు విలువలొచ్చినవని మురిస్పోతున్నాం,
    విలువతెచ్చినందుకు ప్రభుత్వాన్ని నెత్తినెట్టుకుంటున్నాం,
    మనకంట్లో మనవేలుతోనే పొడుచుకుంటున్నాం
    ఎన్నాళ్దింకా చెప్పింది వింటూ తలలూపుదాం

  5. 5
    ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సూచిక Says:

    [...] రజాకార్‌ : డాక్టర్‌ దేవరాజు మహారాజు [...]

  6. 6
    ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సంపాదకీయం Says:

    [...] , డా||దేవరాజు మహారాజు ‘రజాకార్‌‘, హెచ్చార్కె ‘కుట్ర‘ కవితలనీ, [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో