సెప్టెంబర్ 2008 సంపాదకీయం

Mahmoud Darwish
Mahmoud Darwish

ప్రాణహిత సెప్టెంబర్ సంచికకు స్వాగతం. గత చాలా సంచికలుగా మీకు ప్రాణహితను ప్రతినెలా మొదటి వారానికల్లా అందించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. అయినప్పటికీ తెలుగునేల నుండి మాకు సరైన సమయానికి, సరైన లిపి (ఫాంట్) లో సాహిత్యం అందడం, దాన్ని మేము అచ్చుతప్పులు సరిదిద్ది, క్రమపద్దతిలోనుంచి మీకందించడం – ఇవన్నీ అనుకున్న కాలానికి సక్రమంగా జరగడం అన్ని వేళలా వీలుపడలేదు. అందుకే చాలా సంచికలు తీవ్రమైన జాప్యంతో – ఏమిటీ ప్రాణహిత ఆగిపోతుందా అనే ప్రశ్న పాఠకులలో ఉదయించేంతగా – వెలువడినయి. అనేక అవాంతరాలెదురైనప్పటికీ ప్రతినెలా ప్రాణహిత నందించాలనే తపన తో, స్థిర లక్ష్యంతో పనిచేసాం. జాప్యమైనా అందించగలిగాం. అయితే ఈ క్రమాన్ని ఒక నిర్ణీత సమయానికి అనుకూలంగా మార్చడానికి, అనుకున్న పద్ధతిలో ప్రాణహితను మీకు ప్రతి నెలా మొదటి వారానికల్లా అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మా పరిస్థితినీ, మేమెదుర్కుంటున్న ఇబ్బందులనూ అర్థం చేసికొని, ప్రతినెలా ప్రాణహితను ఆదరిస్తున్న పాఠకులకు మేము సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇకముందు కూడా ఇట్లాగే ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇటీవలి కాలంలో తెలుగు సాహితీ అభిమానులు ఒక గొప్ప సాహితీవేత్తను, మిత్రున్నీ కోల్పోయారు. దాదాపు 40 ఏండ్లుగా తెలుగు సాహితీ ప్రపంచంతో అవినాభావ సంబంధాన్ని కలిగి, ఒక కదిలే విజ్ఞాన సర్వస్వంగా అబ్బురపరిచే జ్ఞాపక శక్తితో, తాను చదివిన పుస్తకాలన్నీ స్మృతిపథంలోంచి అలవోకగా ఆవిష్కరించే సాహితీ విమర్శకుడు, మేధావి హరి పురుషోత్తమ రావు అల్జైమర్స్ తో హోమ్ ఫర్ ద ఏజ్‌డ్‌లో చేరారని విన్నప్పుడే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. తాను గేలి చేసిన కాంచనమాల తన కథలోనే కథానాయకురాలిగా వేషం వేసినప్పుడు చలం వ్యాఖ్యల గురించీ, శ్రీ శ్రీ తో , రావి శాస్త్త్రితో , విరసంతో తనకున్న అనుబంధం గురించీ, విప్లవోద్యమం పట్ల తనకున్న అవ్యాజ్యమైన ప్రేమ గురించీ, అతి తక్కువ సంస్కృత పదాలతో, అలతి అలతి తెలుగు మాటలతో అద్భుతమైన పాటలు రాసిన ఆత్రేయ అసమాన ప్రతిభ గురించీ, తెలుగు సినిమాలలో సామాజిక సంబంధాల గురించీ, తెలుగు సినిమా హీరో కాలక్రమేణా ఎట్లా సాహిత్యానికి దూరమై, గూండాయిజానికీ, లంపెన్ రాజకీయాలకు దగ్గరైన వైనం గురించీ హరి అలవోకగా, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే వినడం ఒక గొప్ప అనుభవం. హరితో గడిపిన ప్రతి నిమిషమూ అపురూపమైనవి. ‘నాతో మాట్లాడ్డమే ఒక ఎడుకేషన్’ అన్న గిరీశం దగ్గర వెంకటేశం ఏం నేర్చుకున్నాడో మనకు తెల్సు గానీ. గురజాడ కన్యాశుల్కం గురించి హరి మాట్లాడుతుంటే మాత్రం బహుశా ఏ విశ్వవిద్యాలయం తరగతి గదిలోనూ ఇంత ఎడుకేషన్ దొరకదేమో అనిపించేది. అటువంటి హరి మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితినుండి, మనుషుల లోకానికే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు. హరి మరణం కనీసం మూడు తరాల తెలుగు సాహితీ అభిమానులని కలవరపరిచిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ప్రజాస్వామిక విలువలకూ, అభిప్రాయాలకూ నిలువెత్తు రూపమై, తనకన్నా రెండు తరాలు చిన్నవారి తో కూడా ఎంతో కలుపుగోలుగా స్నేహంగా మెసుల్తూ, ‘గారు’ అనిపించుకోవడం ఎంత మాత్రం ఇష్టపడని గొప్ప ప్రజాస్వామిక వాది, స్నేహశీలి హరికి ప్రాణహిత నివాళి అర్పిస్తున్నది. హరి రాసిన రాతలు ‘విభిన్న’ పేరుతో ఒక పుస్తకంగా పర్స్పెక్టివ్ ప్రచురణగా వెలువడింది.

గత నెల వార్త పాలస్తీనా కవి మహ్మూద్ దార్వీష్ మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులకు అశనిపాతంలా తగిలింది. దార్వీష్ ఆగస్టు 10న టెక్సాస్ హూస్టన్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 20 భాషల్లో వెలువడ్డ దార్వీష్ కవిత్వం గత 60 ఏండ్లుగా తమ స్వంత దేశంలోనే కాందిశీకులై, తమ నేల కోసం నిరంతరం నిర్విరామంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజల వూపిరినీ, ప్రతిఘటననూ, ఆకాంక్షలనూ ప్రతిధ్వనించింది. ఇజ్రాయిల్ దురాక్రమణను తీవ్రంగా అధిక్షేపించిన దార్వీష్ , పాలస్తీనా నాయకత్వాన్ని కూడా విమర్శించారు. తమకంటూ ఒక దేశంకోసం పాలస్తీనా ప్రజల కలలకు కవిత్వ వ్యక్తీకరణనిచ్చారు. వారి స్వాతంత్ర్య ప్రకటనను రచించారు. పాలస్తీనా ప్రజల జాతి అస్తిత్వానికి అత్యంత శక్తివంతమైన గొంతు నిచ్చారు. అతని అనేక కవితలు కొన్ని తరాల అరబ్బులకు పాలస్తీనియన్లకు జాతీయ గీతాలైనవి. ప్రతిఘటన కవిగా ప్రారంభమైన దార్వీష్ పాలస్తీనా జాతీయ చైతన్యానికి ప్రతిరూపమయ్యారు. మారుపేరయ్యారు. వాళ్ళ భాషయ్యారు. న్యాయం కోరుకునే ప్రపంచ ప్రజల హృదయమయ్యారు. అన్యాయాన్ని ప్రతిఘటించే ప్రజల సామూహిక ప్రజాస్వామిక నినాదమయ్యారు. దార్వీష్ మరణం పాలస్తీనా ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సాహితీ అభిమానులందరికీ తీరని లోటు. దార్వీష్‌కు ప్రాణహిత నివాళి అర్పిస్తున్నది.

ప్రాణహిత సెప్టెంబర్ సంచికలో కోసూరి‘ కానుగ పూల వాన’,డా. కె. గీత ‘ వేసవి కాలిఫోర్నియా కబుర్లు’, అన్వర్ ‘ అక్షరం’, పాపినేని శివశంకర్ ‘ చదువుతూ…చదువుతూ…’ , డా||దేవరాజు మహారాజు ‘రజాకార్‌‘, హెచ్చార్కె ‘కుట్ర‘ కవితలనీ, జి.వెంకటకృష్ణ ‘దారి కాచిన దృశ్యం’, రేణుక అయోల ‘శిక్ష ఎవరికి’ కథలనీ. కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ‘ కవితా ప్రక్రియకు కవిత్వానికి సంబంధం ఎంతవరకు’, బెల్లంకొండ సంపత్కుమార్ ‘ మట్టిపాట (పల్లె జీవన శతకం)లో మట్టి విలువలు’, వేలూరి వెంకటేశ్వర రావు ‘ ఇది కల కాదు’ వ్యాసాలనీ. ఆర్కే, కోసూరి ‘పినాకిని ఒక సతత కవితారణ్యం’ పుస్తక సమీక్షనూ, హరి పురుషోత్తమ రావు సంస్మరణ సభ గురించిన వార్తనూ చదవండి.

ఎప్పటిలాగే ప్రాణహిత ను ఆదరించి ప్రజాస్వామిక సాహితీ చర్చను కొనసాగిస్తారని మా విజ్ఞప్తి.

Share/Save/Bookmark

సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో