వేసవి కాలిఫోర్నియా కబుర్లు

ఏం చెప్పను కాలిఫోర్నియా కబుర్లు-

నును వేడిమి చలిగా ముడుచుక్కూర్చుని….
ఇదేం వేసవో అర్థం కాని చలి-

గాలి సాయం లేకపోతే వీపు పగిలే సూటి ఎండ
ఏదీ- కానిస్తేనా?!

అంతలోనే బెంగెట్టుకున్నట్టు ఎండని తరుముకుంటూ మబ్బు-
మబ్బు తెరల సిగ్గు బంగారం గానూ- మురిపెపు గాలి ముసుగులేసుకుని మరీ వస్తుంది-

పేలగొట్టే భారత వేసవి-
అర్థరాత్రికీ చల్లబడని ఉక్కపోత-
కరెంటు పోగానే దోమల మోత-…ఏవిక్కడ?
చెవులకి తడి తువ్వాళ్లు చుట్టుకుని నేల మీద ఆదమరిచి నిద్రించే వేసవి మధ్యాహ్నాలేవీ ఇక్కడ…?

ఏ కాలమో తెలీని వేసం కాలం!- గమ్మత్తు గమ్మత్తుగా-

సబ్జాగింజల షర్బత్ లు- మామిడి పళ్ల ఘుమఘుమలు
రాత్రుళ్ళు ఐసుప్రూటు బండి గలగలలు-
ఆరుబయట మినుకులాడే చుక్కల లెక్కింపులు ఏవిక్కడ?

ఏవిక్కడ?

అసలు సముద్రానికి ఇంత వణుకు కెరటాలుంటాయా?
పాపం గజగజలాడ్తూ పడ్తూ లేస్తుందిక్కడ-
నీటి బాతుకున్న తెగువ మనిషికీ వున్నట్లు గజఈతగాళ్ల విసుర్లు-
ఎటు చూసినా ఆధునికత తాండవించే
రోడ్ల వెంబడి నడిచేందుకు కాస్త వేడిముంటేగా-

వేసవి ప్రవేశించే మిట్టమధ్యాహ్నం సూటి ఎండని
మఫ్లర చెవులు
జేబుల్లో దాక్కునే చేతులు ఏం చెబుతాయి?

కాలిఫోర్నియా నించి ఏం కబుర్లు చెప్పనూ…?!
తేడా లేని షాపింగ్ మాల్ లు—
ఎటు చూసినా ఒకేలా అగుపించే టౌన్ షిప్ లు…
రయ్యి రయ్యిన దూసుకెళ్ళే కార్లు…

మనిషి కరువైన చోట కబుర్లు లేని కాలిఫోర్నియా నించి ఏం చెప్పను?!

9 అభిప్రాయాలు »కవితలు

9 Responses to “వేసవి కాలిఫోర్నియా కబుర్లు”

  1. 1
    అబ్రకదబ్ర Says:

    మీరు క్యాలిఫోర్నియాలో ఎక్కడున్నారో తెలీదు కానీ, బే ఏరియాలో (సిలికాన్ వ్యాలీ) లో ఉన్నట్లయితే ఒకసారి Monterey, Carmel, Big Sur వైపు వెళ్లి రండి. బీచ్‌లు ఇంత అద్భుతంగా కూడా ఉంటాయా అనిపిస్తుంది. మాంటెరీ నుండి హైవే 1 మీద దక్షిణంగా వందమైళ్లపాటు ఉన్న సీనిక్ రూట్ అమెరికాలోనే అత్యంత సుందరమైన రహదారి. ఆధునికత నుండి దూరంగా వెళ్లాలనుకుంటే Yosemite valley, కానీ, Eureka వైపు కానీ వెళ్లి రండి. లాస్ ఏంజెలెస్ దగ్గర్లో ఉన్న Death Valley చూస్తే ఎడారి కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అనినిపిస్తుంది. నిజానికి క్యాలిఫోర్నియాలో ఉన్నంత ప్రకృతి రమణీయత వేరే రాష్ట్రాల్లో దొరకటం కష్టం. సంవత్సరం పొడుగూతా outing కి అనుకూలించే వాతావరణం ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

  2. 2
    తిరునగరి సత్యనారాయణ Says:

    అబ్రకదబ్ర పొరబడ్డట్టున్నారు. గీత గారు తన కవితలో కాలిఫోర్నియా లో ఔటింగ్ కు అనుకూలమయిన వాతావరణం లేదని వాపోవడం లేదు. ఇప్పుడే ఇండియా నుండి వచ్చిన వాళ్ళకు – ఒక గొప్ప జన సందోహం లోంచి, ఒక కోలాహలం నుండి, ఒక నిరంతర శబ్ద ప్రవాహం నుండి అమెరికా లాంటి దేశాల్లోకి వచ్చిపడ్డ వాళ్ళకు – ఇక్కడి మనుషులులేని తనం , నడవడానికి వీలు లేని రోడ్లు, పలకరించడానికి టివీ తప్ప మనిషి తోడు లేని అత్యాధునిక సామాజిక సంరంభం – ఇవీ బహుశా గీత గారిని ఈ కవిత రాయించాయనుకుంటా! కవిత చివరి వాక్యాలు కవితకు ప్రాణం.

    ఏమయినప్పటికీ కాలిఫోర్నియా లోని ఔటింగ్ ప్రదేశాలను వివరంగా చెప్పిన అబ్రకదబ్ర గారికి కృతజ్ఞతలు. ఈ సారి కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది.

  3. 3
    shanthi Says:

    మనిషి కరువైన చోట అని బరువైన వాఖ్యం తొ అమెరికాలో లైఫ్ ని చక్కగ చెప్పారు. వెరి గుడ్ .

  4. 4
    independent Says:

    నిఝ్ఝంగా మనిషి కరువా అమెరికాలో?

  5. 5
    George Bush Says:

    ఇందులో కవిత్వం తక్కువా, వచనం ఎక్కువ.

    కవయిత్రి గారు అమెరికా కొత్తగా వచ్చినట్లున్నారు.

    ఇండియానుండి తెచ్చుకున్న ఊరగాయ జాడీ లోంచి తీసినట్లున్నారు ఈ పాత చింతకాయ పచ్చడి కవిత.

    అమెరికా అంటే మాల్సూ, మందూ, బీచ్ లే కావు. ప్రజా జీవితం చాలా ఉంది. నాలుగ్గోడల మధ్యలోంచి భూతద్దల్లో చూడ్డం మానేసి మనుషులతో మాట్లాడితే అమెరికన్లూ తెలుస్తారు.
    వారి జీవితాలూ తెలుస్తాయి.

    “మనిషి కరువైన చోట ” అని రాసారు. మనింట్లో కూర్చుంటే మన దగ్గరకెవరూ రారు. తెలీని వాళ్ళతో మనం మాట్లాడుతామా? మీకు కరువైంది మీ స్నేహితులు. మనుషులు కారు.
    మనుషులున్నారు. చూడ్డం తెలియాలి. మనసు విప్పి మాట్లాడ్డం రావాలి.

  6. 6
    Venu Says:

    కాలిఫోర్నియా లో దేశీలకు కొరత ఏంటి అసలు. అందులోనూ మనవాళ్ళు కుప్పలు కుప్పలుగా అంతటా ఉన్నారు. కొంచెమ్ ఈ జీవితమ్ అలవాటు అయ్యేవరకు ఇలాగే ఉంటుంది లెండి. పరిసరాలు, మనుషులు పరిచయమ్ అయ్యాక ఇదే బాగుందంటారు.
    :) Just hang on !

  7. 7
    ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సూచిక Says:

    [...] వేసవి కాలిఫోర్నియా కబుర్లు : డా. కె. గీత [...]

  8. 8
    ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సంపాదకీయం Says:

    [...] కోసూరి‘ కానుగ పూల వాన’,డా. కె. గీత ‘ వేసవి కాలిఫోర్నియా కబుర్లు’, అన్వర్ ‘ అక్షరం’, పాపినేని శివశంకర్ [...]

  9. 9
    వేసవి కాలిఫోర్నియా కబుర్లు | అఆలు (అనుభూతులు-ఆలోచనలు) Says:

    [...] http://www.pranahita.org/2008/09/vesavi_california_kaburlu/ This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink. ← ఇంటూ నలభై ఐడెంటిటీ → LikeBe the first to like this post. [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో