అక్టోబర్2008
ప్రాణహిత
ప్రాణహిత అక్టోబర్ సంచికకు స్వాగతం !
Bathukamma by Aelay Laxman
అక్టోబర్ నెల రాగానే మనకంతా గొప్ప సంబరం. తెలుగు వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు బతుకమ్మ, దసరా సాధారణంగా ఈ నెలలోనే వస్తాయి. వర్షాలు పడితే, చెరువులన్నీ నిండి కళ కళ లాడుతూ, చేన్లలో చెలుకల్లో గునుక పూలు, తంగెడి పూలు ఇంకా తీరున్నొక్క పూలతో తెలంగాణ నేలంతా రంగు రంగులుగా విరగబూస్తుంది. ఈ కాలం ప్రకృతి సంబరాన్ని, విరగ బూసిన పూలల్లో, వాడ వాడలా సాయంత్రాలు మార్మోగే పాటలతో, తళ తళ లాడే చెరువుల నీటి మిలమిలల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. మొత్తం చదవండి »
సంపాదకీయం
అక్టోబర్2008
అమర్
పులి మేకల అను(ణు)బంధం
అను(ణు) బందీల పేర
అంకుల్ శాం బరువు మోస్తూ
పార్లమెంటుదాకా కావడి దించని పరీక్ష
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
ప్రాణహిత
- రాంకి
మట్టి లేని
మట్టి మనుషులకు
చోటులేని
గచ్చుల తారురోడ్డుల ఉచ్చులో
ఊపిరాడని మట్టిలా….
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
కొప్పర్తి
వంద కరెన్సీ నోట్లను ఏకబికిన లెక్కపెట్టడమా
నా వల్ల కాదు
వంద పువ్వుల్ని
వంద నక్షత్రాల్ని
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
శివారెడ్డి
- జో మేరియా హెరిదియా (అనువాదం - కె. శివారెడ్డి)
“క్యూబన్ ప్రజల హృదయాల్లో
సతత జ్వలిత స్వేచ్ఛాగ్ని”
ప్రశాంతంగా ప్రవహిస్తావు
నీ కెరటాలు ఎత్తయిన రాళ్ళ మధ్య ముక్కలయ్యేదాకా
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
కృపాకర్ మాదిగ
- కృపాకర్ మాదిగ పొనుగోటి
గూట్లో పిల్లలున్న పక్షికీ
మాయమ్మకీ తేడా యాడుంది?
గెట్లు చెట్లు కుంటలు కానలు
యేరకరావడానికి యెతకబోయేది
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
గండికోట వారిజ
రహస్యం
అమ్మ పేగుల్లోనే మొదలైందేమో
మొగ్గ విచ్చుకోవటంలో మొదలైందేమో
కానీ
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
ప్రాణహిత
- చైతన్య ప్రకాశ్
వెనుకడుగు ముందడుగు
జరుగు జరుగు పరుగు పరుగు
పొడిచేదో కన్ను తుడిచేదో కన్ను
నక్కి నక్కి దాక్కుంటూ
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
కొండేపూడి నిర్మల
సాయంత్రం ఆరు గంటలు;
బ్రెయిలీ క్లాసుకి ఆటవిడుపు గంట మోగింది
చైతన్య పురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు
దూసుకొచ్చే వాహనాల మధ్య నుంచి
మొత్తం చదవండి »
కవితలు
అక్టోబర్2008
వేముగంటి మురళి
అమ్మంగి వేణుగోపాల్ ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ సభ
- వేముగంటి మురళీకృష్ణ
జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక వారి ఆధ్వర్యంలో తేదీ 13-09-2008 రోజున అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ సభ జరిగింది. ‘భరోసా’ కవితా సంకలనాన్ని ప్రొ|| జయధీర్ తిరుమల రావు, నాటికల్ని డా|| అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు.
మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
అక్టోబర్2008
ప్రాణహిత
‘కవిత్వానికి చిరునామా’ గుంటూరు శేషేంద్ర శర్మతో ఇంటర్వూ
- సబ్బని లక్ష్మీనారాయణ
తన కవిత్వాన్నంతా ‘ఆధునిక మహా భారతం‘ అని ప్రకటించుకొన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారితో ఆగస్టు 28, 2004 నాటి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంభాషణ సారాంశమే ఈ ఇంటర్వ్యూ. ప్రశాంతంగా, నిర్మలంగా శేషేంద్ర నుండి వచ్చిన జవాబుల రూపం ఇది.
ప్ర: మీ సాహిత్య నేపథ్యమేమిటి?
శేషేంద్ర: నాకు ఇప్పుడు 78 ఏళ్ళు. నేను 4,5 సంవత్సరాల వయస్సున్నపుడు ఈ దేశ పరిస్థితులను ఊహించుకోవచ్చు. మొత్తం చదవండి »
ఇంటర్‌వ్యూలు
అక్టోబర్2008
మధురాంతకం నరేంద్ర
నడిరాత్రి నీరవ నిశ్శబ్ద్ధాన్ని కాలింగ్‌బెల్ నిలువునా చీల్చింది. తలుపులు తెరుస్తూనే ముందుగా సుడిగాలి, ఆ వెనకే అతనూ లోపలికి దూసుకొచ్చారు. రంగురంగుల జుబ్బా కింద నీలి రంగు పాంటు తొడుక్కున్నాతను. అతడి తలవెంట్రుకలతో బాటూ, పొడవాటి గడ్డం కూడా గాలిలో పాయలు పాయలై యెగురుతోంది. మొత్తం చదవండి »
కథలు
అక్టోబర్2008
గోగు శ్యామల
సూర్యుడు నడీనెత్తిమీదుండి ఎండ దండిగా కొడుతున్నది. పెండ్లి కొచ్చిన మంది ఎండదెబ్బకి తాపుడం తాపుడం అయితున్నరు.పెండ్లి పందిట్ల ఎక్కువ మంది అయేటాల్లకు ఉబ్బరం ఎక్కువయింది. పెండ్లికొచ్చిన వాల్లలో నలుగురు పంతుల్లు పట్నంకేంచి ఒచ్చిండ్రు. వాల్లు పంకగాడ్పులేక ఆగమాగం అయితున్నరు. మొత్తం చదవండి »
కథలు
అక్టోబర్2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
వూండెడ్ నీ ని స్వాధీనం చేసుకున్న డెభ్బై ఒక్క రోజుల్లో సేక్రెడ్ హార్ట్ చర్చి, గిల్డర్ స్లీవ్ ట్రేడింగ్ పోస్ట్ , మ్యూజియమ్ లు మూడు ప్రధాన కేంద్రబిందువులయ్యాయి. మాకు ట్రేడింగ్ పోస్టు ముఖ్యమనిపించింది. దానికదే చిన్నిపాటి సామ్రాజ్యంలా వుండింది. దాంట్లో ఇండియన్ చేతి కళలు, చిత్రకళలు వున్న అంగడి, ఒక సూపర్ మార్కెట్ , మరెక్కడా దొరకని అధ్వాన్నమైన పిజ్జా అమ్మే కాఫెటేరియా, ఫిల్లింగ్ స్టేషన్ , మేనేజరు కుంటుంబం వుండే ఇల్లు - ఇలా ఎన్నో అంగళ్లు , రూములు వున్నాయి ఆ ట్రేడింగ్ పోస్టులో. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
అక్టోబర్2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
మారియోకు అందిన కొత్త పుస్తకంలో పుటలు ఎంత సుతి మెత్తగా ఉన్నాయో. ఎట్లా తెల్లగా మెరిసిపోతున్నాయో. మారియోకు తన కవితల లాంటి కవితలతో ఆ కాగితాలను చెడగొట్టడానికి మనసొప్పలేదు. అప్పటివరకూ రాస్తున్న పొడుపుకథల లాంటి కవితలతో తన నోటు పుస్తకాలన్నీ నిండిపోయినతర్వాత, మాంచి ఖరీదయిన ఫ్లారెస్ ద ప్రవియా సబ్బుతో చేతులు శుభ్రంగా తోముకుని అప్పుడు మాత్రమే ఈ కొత్త పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవాలనీ, ఆ తెల్లని కాగితాల మీద తాను రాసిన వాటిలోంచి అత్యుత్తమమైన అలంకారాలకు ఆకుపచ్చని సిరాతో సాఫు ప్రతి రాస్తాడు. సరిగ్గా నెరూడా లాగనే.
మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
అక్టోబర్2008
ప్రాణహిత
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనుషులవంటి ప్రాణులన్నీ నాడుల పుట్టలవంటివే. మనుషులు అనుక్షణమూ ప్రేరణలూ, స్పందనలకు లోనవుతూ, శారీరక సుఖాలనూ, కష్టాలనూ రకరకాలుగా అనుభవిస్తూ, వర్ణిస్తూ జీవితాలు గడుపుతారు. మన ఆలోచనాస్రవంతిలో భాగాలైన మనస్తత్వ విశ్లేషణలూ, తత్వధోరణీ, ఊహపోహలూ అన్నీ ఈ భావనలమీదనే ఆధారపడతాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు
అక్టోబర్2008
గుర్రం సీతారాములు
“మహా కవుల మరణ యుద్ధ కవిత” పేరుతో మార్చి 2 వార్త ఆదివారం అనుబంధంలో
“దళిత కవులు ఇంకా బ్రతికే ఉన్నా దళిత కవిత్వం మాత్రం మరణించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని ‘కందిలి’ లాంటి కవితా సంకలనాలు రుజువు పరుస్తాయి” అన్న తీవ్రమైన వ్యాఖ్యలకు సమాధానం ఇది.
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
అక్టోబర్2008
ప్రాణహిత
తెలంగాణా బాధను, కన్నీళ్ళ గాధను…అక్షర బద్ధం చేసిన రచయిత్రి సబ్బని శారద ”తెలంగాణా బతుకమ్మపాట”
-సంకెపల్లి నాగేంద్ర శర్మ
Bathukamma
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో….బంగారు బతుకమ్మ ఊయ్యాలో… అంటూ వయస్సు, అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తెదవులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరంతో కలిసి ఆడుకునే తెలంగాణా ట్రేడ్ మార్కు పండుగ. గుజరాతీలు, రాజస్ధానీలు శరన్నవరాత్రులలో జరుపుకునే దాండియా, గర్బి ఆటతో ఆ పండుగను పోల్చవచ్చును. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
అక్టోబర్2008
వఝల శివకుమార్
- వఝల శివకుమార్
ఊరునిచ్చిన మట్టి, ఊపిరిచ్చిన ఊరు, ఊరు చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల్లో ఇంకా పచ్చగా భద్రంగా ఒదిగిపోయిన పరిసరాలు, ఆ పరిసరాలకు మమకారపు పరిమళం అద్దిన జీవన వైవిధ్యం, వెరసి అది తురకగూడెమే కావచ్చు. మరే ఊరైనా కావచ్చు ఆ గ్రామీణ వాతావరణం చిత్రణలో కవిగా బాణాల శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక శైలిని జతచేసి మన మనోఫలకాల మీద అవిష్కరిస్తాడు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు