అణుబంధం

పులి మేకల అను(ణు)బంధం
అను(ణు) బందీల పేర
అంకుల్ శాం బరువు మోస్తూ
పార్లమెంటుదాకా కావడి దించని పరీక్ష
అంతర్జాతీయ ఉగ్రవాది క(ఆ)నుసన్నల్లో
ఆంతరగిక భద్రత పర్వ రక్తికట్టనుంది-
దేసమంతా సామ్రాజ్యవాద నిర్బంధ శిబిరం
ఇంకా అణువిధ్యుత్ షాక్ కూడా తగలాలా!
పాతికేండ్ల కు గానీ పెరుగని
మిణుగురు పురుగంతటి వెలుగుకోసం
కత్తి వారి కిచ్చి కుత్తుకమీదికి తెచ్చుకోవాలా!
పండుగైనా రాక ముందే
ఐ ఎ ఈ ఎ వారి వారి ఆజ్ఞ్ ల ముందు మోకరిల్లి
జపాన్ వెల్లి మరీ జడిచ్చి వచ్చారు
సదరు గొర్రెను పార్ల మెంటులో ముస్తాబు చేయడమే తరువాయి
పారదర్శకతకు పాతరేసి
పొరుగు దేశాలను పులితొలు కప్పుకొని బెదిరించగా
అలీనం మలినమైపోయి
ఆమెరికా వారి షరతుల్లో సంలీనమయ్యే
ఎత్తూ పల్లాల్లో నిలబడి
తోడేలు-మేక నీల్లు తాగే కథ…
సిటిబిటి పై సంతకం చేయని ప్రోఖన్ వీరులం కదా
ఇందన సరఫరా వీరుల ముందు సాష్టాంగ పడాలి
బుష్ గారి కరుణా కటాక్షాలకై
బేష్జాలన్నీ వదులు కొవాలి
దేశపు అపార బొగ్గు నిల్వలు ధర్మల్ శక్తికను నైతేనేం
సహజమైన కొండదారలు హైడ్రో వెలుగయితేనేం
అనంతమైన గాలి పవన విధ్యుత్తయి వీస్తేనేం
ఎండతో సోలార్ విద్యుథు పండితేనేం
చౌకప్రత్యామ్నమాలు గిట్టుబాట్టు కావులెండి
ఎనీలన్ వారి వాతలు పచ్చిపుండయి సల్పుతున్నా
మన అణు రయాక్టర్లన్నింటికీ
వైట్ హౌస్ లో కనెక్షన్ లివ్వాలట
ప్రజలకూ, పార్లమెంటుకు జవాబుదారీగాని
అంతర్జాతీయ వ్యవహారం
అంత దేశం కోసమేనట
నూటాయాబైఏండ్ల ప్రథమ స్వాతంత్ర్యపోరు సాక్షిగా
దేశమంతా జైలవుతుంటే
జైలు పక్షుల పార్లమెంటులో వాలితే తప్పేంటి
స్టాక్ ఎక్స్చేంజీలు దీవాళగంటలు మోగిస్తూ
ద్రవ్యోల్బషం- ధరలు హనుకుంతుని తోకవుతుంటే
వేలకోట్ల బేరసారాల గురించి బెంగపడొద్దు
గద్దెదక్కించుకోకుండా దేశాన్నెలా కాపాడగలం !?
123 ఏండ్ల దేశభక్తి
ఏ.డి.హ్యూకు గారి హద్దులు దాటి పొగుతుంటే
అంకుల్ హెన్రీహైడ్ వారి 1,2,3 పాదసేవలో
మనమోహన దేహం తహతహలాట
కొనుగోల్ల అమ్మకాల బలిపరీక్షలో దేశం
తస్మాత్ జాగ్రత్త.

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “అణుబంధం”

  1. 1
    ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక Says:

    [...] అణుబంధం : అమర్ [...]

  2. 2
    ప్రాణహిత » నవంబర్ 2008 సంపాదకీయం Says:

    [...] అక్టోబర్ సంచికలో అమర్ ‘అణుబంధం ‘, రాంకీ ‘వేయి సరస్సులు ఏవి?‘ , [...]

  3. 3
    ప్రాణహిత » అక్టోబర్ 2008 సూచిక Says:

    [...] అణుబంధం : అమర్ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో