Oct2008
‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ
అమ్మంగి వేణుగోపాల్ ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ సభ
- వేముగంటి మురళీకృష్ణ
జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక వారి ఆధ్వర్యంలో తేదీ 13-09-2008 రోజున అమ్మంగి వేణుగోపాల్ రచించిన ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ సభ జరిగింది. ‘భరోసా’ కవితా సంకలనాన్ని ప్రొ|| జయధీర్ తిరుమల రావు, నాటికల్ని డా|| అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు.
ప్రొ||జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ అమ్మంగి గ్రూప్‌ల వైపు నిలబడ్డ కవి కాదని ప్రజల పక్షాన నిలబడ్డ నిజమైన కవి అని ప్రశంసించారు.
సంకలనాన్ని పరిచయం ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యులు చేస్తూ అమ్మంగి రాసిన కవిత్వ పంక్తుల్ని ఉదహరిస్తూ “కవిత్వం ముందు కవి ఎప్పుడూ అల్పుడే” అన్న వాక్యంలో ఒక తాత్విక దృక్పథం కలిగి ఉన్నదని, చక్కని వ్యక్తిత్వం, సాహిత్యం కలిస్తే నిజమైన వ్యక్తిత్వం గల మనిషి ఉద్భవిస్తాడు. అలాంటి మనిషి అమ్మంగి. ఏది తనకు దగ్గరగా ఉందో దానిని కవిత్వీకరించారు. “నాకు దేశభక్తి కంటే నా ఊరు మీద మమకారం ఎక్కువ” అన్న మాటను బట్టి తన చుట్టూ ఉన్న సమస్యల్ని కవిత్వీకరించాడు. సంక్లిష్టమైన విషయాన్ని సరళతరం చేస్తూ సాంద్రతను కలిగి ఉండేలా చూడడం కవిత్వంలో కష్టమైన పని, దానిని అమ్మంగి వేణుగోపాల్ విజయవంతంగా నిర్వహించారు. ‘భరోసా’ కవిత్వాన్ని కాపాడుకుంటూ భావ ప్రచారం చేయడం గొప్ప విషయమంటూ ముగించారు దర్భశయనం.
నాటికల్ని ఆవిష్కరించిన అంపశయ్య నవీన్ మాట్లాడుతూ రా.రా. చేత శభాష్ అనిపించుకున్న కవి ఎవరైనా ఉంటే అది అమ్మంగి అని అన్నారు. ఈ సమావేశానికి ప్రొ||జి.చెన్న కేశవ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.పి అశోక్ కుమార్, డా|| నోముల సత్యనారాయణ, జి.వెంకటేశ్వర్లు, వేణు సంకోజు, ప్రొ|| పి.లక్ష్మీనారాయణ, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
4 అభిప్రాయాలు »సాహిత్య వార్తలు
October 4th, 2008 at 2:16 am
అభినందనలు
November 4th, 2008 at 12:54 am
[...] ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్క
November 4th, 2008 at 1:00 am
[...] ‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్క
November 4th, 2008 at 1:00 am
[...] వార్తల్లో ‘‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్