ఈ పద్యం నీలానే నయాగారా!

- జో మేరియా హెరిదియా (అనువాదం – కె. శివారెడ్డి)

“క్యూబన్‌ ప్రజల హృదయాల్లో
సతత జ్వలిత స్వేచ్ఛాగ్ని”

ప్రశాంతంగా ప్రవహిస్తావు
నీ కెరటాలు ఎత్తయిన రాళ్ళ మధ్య ముక్కలయ్యేదాకా
అప్పుడు నీ ప్రవాహం చొచ్చుకెడుతుంది
నిర్నిరోధకమయిన ఒక గమ్యంలా
ఎంత రౌద్రం, భయపెట్టే ఆగ్రహం
గాద్గదికమయిన సుడిగుండాలక్కడ,
నా మనసు అదుపు తప్పుతుంది
నా ఇంద్రియాలూ సంచరిస్తాయి యధేచ్ఛగా
నే చూస్తున్నంతసేపూ నీ శీఘ్రగతిని
నా దృష్టి నిరుపయోగం అనుసరిస్తుంది చివరి అంచుదాకా
అసంఖ్యాకంగా కలుస్తాయక్కడ దుందుడుకు కెరటాలు
లెక్కలేనన్ని అలలు
ఉత్సాహంతో దాటిపోతాయి ముందటి అలల్ని
నురగలోని ఉరుములో అదృశ్యమౌతాయి
అవరోధాన్ని, అడ్డుకట్టని చేరతాయి
దూకుతాయి ఒక్కసారిగా
తీరని దాహంతో అగాధం మింగేస్తుంది దూకుతున్న అలల్ని-
వేల యింద్రధనుస్సులు
అర్థచంద్రాకారంలో చుట్టుముడతాయి
గర్జనల్తో అడవుల చెవులు బద్దలవుతాయి

నా అశాంతి నేత్రం దేన్ని పొందాలని
అగాధపు కోరలు యిక్కడ పైపైకి లేస్తూ
నా క్యూబా దేశపు మైదానాల్లో లేచి, ఎదుగుతున్న
తాటి తోపులూ, ఈతతోపులూ
గాలి ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లోనూ
సూర్యుని దాకా ఎదిగిన
మందపాటి ఆకుల శిరస్సులు
స్వర్గపు మచ్చల్లేని నీలిమ కింద ఒక అల
భయోద్విగ్న నయాగరా నా యానం
కొద్ది సమయం, కొద్ది సంవత్సరాలు
నీ గురించి అమోఘంగా పాడుతున్న
ఈ కవి ఎముకల మీద కాస్త చల్లని మట్టి-
ఇది
అమేయస్పందనాయుత పదం, ప్రపంచం
ఈ పద్యం నీలానే
అశాశ్వతమయిన నాలో-
ఈలోగా
నిర్దిష్ట విశ్రాంతి దిశగా ఆనందంగా కదులుతూ
వెలిగిపోతున్న నా నుదురు లేస్తుంది
పైపైకి మబ్బులపైకి
కీర్తి ప్రతిధ్వనులు వింటానికి

(జో మేరియా హెరిదియా (1803-1839) క్యూబన్‌ దేశ భక్తుడు, కవీ-నయాగరా జలపాతాన్ని కెనడా వైపు నుంచి చూట్టానికెడితే ఒక అద్భుత దృశ్యం కనబడుతుంది. అంతెత్తు నుంచి దూకుతున్న నయాగరా-ఏకకాలంలో ఈ కవి అన్నట్టు ఎన్నో ఇంధ్రధనస్సులు.అక్కడే ఒడ్డున ఒక శిలా ఫలకం-దాని మీద ఉంది ఈ కవిత. ఈ కవిత మొత్తం నోట్‌ చేసేసరికి తడిసి ముద్దయిపోయా. 8 జూలై 2001లో నోట్‌ చేసుకున్నా-నే కవిత రాయలేదు గానీ, నన్ను కొంత వ్యక్తీకరించిన కవిత ఇది-అందునా క్యూబన్‌ కవి రాసింది. నన్నూ, నవీన్‌ని కెనడా వైపుకి తీసుకెళ్ళి అద్భుత నయాగరా దృశ్యాన్ని చూయించిన మద్దిపాటి కృష్ణారావు, డా. విజయగార్లకి ఈ అనువాదం.)

2 అభిప్రాయాలు »కవితలు

2 Responses to “ఈ పద్యం నీలానే నయాగారా!”

  1. 1
    ravikumar kosuri Says:

    SURYUNI DAKA EDIGINA MANDAPATI AKULA HARITHANNI MAGUNDEELA MEEDA ADDINA SIVAREDDY GARKI DHANYAVADALU .ANUVADAM INTHA ARDHAVANTHAM GA VUNTUNDA ANIPISTHONDI …………..NENU IPPUDIPPUDE CHDUVUTHUNNA GOPPA KAVITHVEEKARANALU ELAVUNTAYO ARDHAMAVUTHONDI…………DHANYAVADALU PRANAHITA

  2. 2
    ప్రాణహిత » అక్టోబర్ 2008 సూచిక Says:

    [...] ఈ పద్యం నీలానే నయాగారా! : జో మేరియా హెరిదియా (అనువాదం – కె. శివారెడ్డి) [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో