అమ్మ కోసం

- కృపాకర్‌ మాదిగ పొనుగోటి

గూట్లో పిల్లలున్న పక్షికీ
మాయమ్మకీ తేడా యాడుంది?
గెట్లు చెట్లు కుంటలు కానలు
యేరకరావడానికి యెతకబోయేది
నానా కష్టం జేసేది
ముళ్ళు తొక్కి ఆసాముల కళ్ళుగప్పి
పూటకి తెచ్చేది. మాయాకలి తీర్చేది
పొద్దుగుంకినాక పొయికాడ పచ్చికట్టెలతో
పోరాడుతున్న అమ్మను జూస్తే ఏడుపొచ్చేది
కడుపులో ఆకలి పొయ్యిలో రాజుకునేది
ఆశల పేలాలు మంగళం పెంకులో ఏగేవి
నోరు చలమై ఊరేది

అమ్మంటే ఎవురూ…
కాలం పాత్రని జీవగంజితో నింపేది
మొక్కల్ని పువ్వుల్ని పిల్లల్లా చూసేది
పాదీ నీరూ ఎరువూ కాపలాదారూ అయ్యి
అమ్మ నా బతుకు చెట్టుని సాకింది
తిరిగి తిరిగి అరిగి అరిగి గోడవార వొరిగిన
తిరగలిని చూస్తే దిగులు పుట్టేది

అమ్మ తిరగలి అయ్యిందో
తిరగలి అమ్మ అయ్యిందో
బతుకు తిరగట్లో పిండిపిండి అయ్యింది
రోలుకీ రోకటిపోటుకీ మధ్య గింజలై మెదిగింది
అమ్మకు ఆసరా కాగలనా ?
అమ్మ కొడుకుగా మిగిలిపోగలనా?

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “అమ్మ కోసం”

  1. 1
    Hari Says:

    కృపాకర్ గారూ! చాలా బావుంది …

  2. 2
    N VENKATRAO Says:

    కృపాకర్ గారూ! చాలా బావుంది …

  3. 3
    BUJJI BABU.G Says:

    Krupakar gaaru,kastam anubhavinchi wrasina Kavitha Adbhutham gaa Vuntundi.Meee
    kavitha Chadivina tharvaatha palleturi kastam yentha Adbhutham gaa vuntundho kallaku kattinatlu Vundhi.Nijangaa Dalitha Brathukulu Thirugalilo Pindi pindi Avinavi.
    Yeppudu Maaruthundo ee samajam.
    Thank you
    Bujji Babu.G

  4. 4
    ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక Says:

    [...] కవిత-అమ్మ కోసం : కృపాకర్ మాదిగ పొనుగోటి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో