బతుకులోతులకి నిప్పుతో పట్టిన నీరాజనం ‘కుంపటి’

- వఝల శివకుమార్‌

ఊరునిచ్చిన మట్టి, ఊపిరిచ్చిన ఊరు, ఊరు చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల్లో ఇంకా పచ్చగా భద్రంగా ఒదిగిపోయిన పరిసరాలు, ఆ పరిసరాలకు మమకారపు పరిమళం అద్దిన జీవన వైవిధ్యం, వెరసి అది తురకగూడెమే కావచ్చు. మరే ఊరైనా కావచ్చు ఆ గ్రామీణ వాతావరణం చిత్రణలో కవిగా బాణాల శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక శైలిని జతచేసి మన మనోఫలకాల మీద అవిష్కరిస్తాడు. అనుబంధ గ్రంథాలు సుసంపన్నం చేసిన ఆ ఆవిష్కరణల నేపధ్యం అతని కవితా పటిమకు అదనపు శక్తి చేకూర్చాయి.

సామజిక ఆర్థిక నేపథ్యాలు ఆ ఊరి ఉనికి మీద చూపించిన ప్రభావాలను దృష్టాంతం చేస్తూ కదిలించుకుపోతాడు. తన అనుభవ ధారల వెంట కవిత్వపు వేలందించి మనని తీసికెళ్లాడు. చూపులకి దూరంగా కనిపిస్తున్నా కానీ ఆత్మీయంగా ఆ వైపు అడుగేసిన వారికి ఆ ఊరు ఏమంత దూరం కాదు. అంటూ కవిత్వపు ఎత్తుగడలోనే లక్ష్యాన్ని మేళవించి చెప్పడం ఓ వైవిధ్యం. మునగాల చెరువు గాలి జాడల్ని మంగలోళ్ల మామిళ్ళ చల్లని నీడలోంచి ముడికట్టల్లోంచి మనసు మూలలకు తాకేలా చెబుతాడు.

పదహారణాల తెలంగాణా కుగ్రామానికి అచ్చమైన నిర్వచనాన్నిస్తూ, ఏ సౌకర్యాలకూ నోచని తెలంగాణా ముఖ చిత్రాన్ని కళ్ళ ముందు చెక్కుతాడు. రాత్రయినా చీకటి తెలియని ఆటలతో కళ్ళలో మందారాలు పూయించటం లాంటి వాక్యాలు కవి కళాదృష్టికి సౌందర్యాత్రం సాక్ష్యాలుగా నిలుస్తాయి. వృత్తితో వృత్తినే ఆలంబనగా చేసుకున్న జీవితంతో విడదీయరాని అనుబంధాన్ని కలిగిన ‘కుంపటి’ ని ప్రధాన వస్తువుగా స్వీకరించి ఆ వస్తు మాధ్యమం నించి శ్రమైక జీవన కోణాల్ని కళ్ళముందు ఆలోచింపజేసేలా నిలబెట్టటం బాణాల ప్రత్యేక ఒరవడి.
వృత్తుల నుంచి ప్రభవించిన సంస్కృతి స్వరూప స్వభావాలు క్రమక్రమంగా కనుమరుగౌతున్న కాలంలో, వృత్తుల పునాదులు చెదిరిపోతున్న కాలంలో
‘బాణాల’ కంసాలీల బ్రతుకులకు నిప్పుల నగిషీలనద్దే కుంపటి గురించి అద్భుతంగా చెప్పిన కవిత ఇది. ఆ కుంపటితో ముడిపడ్డ సామాజిక ఆర్థికాంశాలను ఆలోచనలు రాజుకునేలా చెప్పుతాడు. తూర్పున పొద్దు పొడవక ముందే ఇంటి ఆకాశంలో కుంపటి సూర్యుడు కళ్ళు తెరిచే చోట, పట్టెడ మీద పడ్డ సుత్తి దెబ్బ తనను స్కూలుకు పంపే అలారం మోతగా చెప్పడం వెనుక కొత్త తరాన్ని ప్రభావితం చేస్తున్న పాతతరపు నిబద్దత, పట్టుదల, దీక్ష మనకు కనిపిస్తాయి.

తన తండ్రి యజ్ఞగుండం ముందు ఋషిలా కనిపించడంలాంటి ప్రయోగాలు మనో ఫలకాల మీద తండ్రిచిత్తర్వును నిలబెట్టేశాయి. ఇంక వైచిత్రిని గమనిస్తే చేతుల్ని సవ్యసాచిలా ఆడిస్తూ చెంపలకు రెండు బెలూన్లు తగిలించుకొని, ఊపిరితిత్తుల్లోని గాలిని ఊది బంగారాన్ని కరిగించి ఆభరణంగా మలిచిన కుంపటిని ఆధారంగా చేసుకొని తండ్రి కళా తపస్సును కళ్ళముందుంచుతాడు.

పనిని తపస్సుగా భావించిన వారికి పనితో ముడిపడ్డ ప్రతి వస్తువూ దేవతా స్వరూపమే. తమ వృత్తికి ప్రాణం ప్రభావం అయిన ‘కుంపటి’ ఇళ్ళకు వెలుగులా బతుకు నావకు దిక్సూచిలా, తాతకు ప్రతీకలా నాయినకు నిశానిలా, కులవృత్తికి చిత్రికలా, గుండె ధైర్యాన్నిచ్చే జీవన వేదంలా, తంత్రీనాదంలా ఒడుగువర్గాల పర్యాయపదంలా అభివర్ణిస్తాడు. బతుకులోతుల్నించి ప్రభవించిన అనుభవసారాన్ని హృద్యంగా పాఠకులకు అందిస్తాడు. శ్రమైక జీవన సౌందర్యపు లోతుల్ని కళాత్మకంగా చెప్పటం వెనుక కవికి ఉన్న జీవితం మీది ప్రేమని, తన పునాదుల మీది గౌరవాన్ని మనం చూస్తాం. అందుకే బాణాల కుంపటిని సూర్యుపుష్పంగా అభివర్ణిస్తాడు. కుంపటి చుట్టూ పరిభ్రమిస్తున్న విశ్వాన్ని చూపిస్తాడు. భాషాపరంగా అసహజతకు తావివ్వక బతుకులోంచి రవళించిన భాషనే తన కవిత్వ భాష చేసుకున్నాడు బాణాల.

ఈ కవిత్వంలో జాతికారు జావళీలు, పట్టుకారు పదనిసల లయలు, రుంజమోతలు, కమ్మెచ్చు తీగల కిన్నెర నాదాలు వంటి అపురూపమైన రసజ్ఞత ఉట్టిపడే పదాలు ‘కుంపటి’కి అదనపు మెరుపు రవ్వలైనాయి.

వ్యవసాయ జీవన మూల్యాలను, వృత్తి సంస్కార ఫలాలను ఈ కవితలో పుష్కలంగా అందించాడు బాణాల.
చరిత్ర చెరపలేని సాక్ష్యంగా నందికొండ కాలువ వెనుక నీటి రాజకీయ ద్రోహాన్ని స్ఫురింపజేస్తూ ”నగల్ని చేసిన నాయిన చేతులు ఊళ్ళో కరువుకు తోడవ్వని నందికొండ కాలువ పనికి పోయిన సందర్భాన్ని మనముందుకు తెస్తాడు.

కాలాన్ని ద్రావకంలో ముంచి, తన బతుకు బంగారాన్ని మెరిగిసుకతో రుద్ది శుద్ధి చేసి లక్ష్యంకేసి నడిపించిన తీరుని వివరిస్తూ తన తండ్రికి అందుబాటులో లేని అవకాశాల్ని తనకు సమకూర్చిన తీరుకి ప్రతీకగా మెరుగిసుకతో రుద్దిలాంటి ప్రతీకలు వాడి చెప్పడం బాణాల కవితాభినివేశాన్ని తెలియజేస్తుంది. అపురూపమైన వాతావరణం చిత్రణ, బతుకుమూలాల్ని తట్టిలేపే తాత్విక అభివ్యక్తి, ఈ కవిత్వంలో పుష్కలంగా ఉంది. కులవృత్తుల కళానైపుణ్యాల్ని, వృత్తి సంస్కారాల్ని ప్రతిభావంతంగా కుంపటి నిప్పుల్లా మనముందు పరుస్తాడు బాణాల.

Share/Save/Bookmark

సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. vajjalashivakumar అక్టోబర్ 2008 1

    మొదటి పేరాలో ” ఆ గ్రామీణ వాతావరణ చిత్రణ లో బాణాల ” అని ‘మరియు “అనుబంధ గంధాలను సుసంపన్నం చేసిన”అని” చదువు కొనగలరు
    నా అభిప్రాయాన్ని చక్కగాఅందించినందుకుధన్యవాదములు. వఝల శివకుమార్

  2. ప్రాణహిత » అక్టోబర్ 2008 సంపాదకీయం నవంబర్ 2008 2

    […] బతుకమ్మపాట” , వఝల శివకుమార్ ‘బతుకులోతులకి నిప్పుతో పట్టిన నీరాజన

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో