Oct2008
లెక్కలేని తనం
వంద కరెన్సీ నోట్లను ఏకబికిన లెక్కపెట్టడమా
నా వల్ల కాదు
వంద పువ్వుల్ని
వంద నక్షత్రాల్ని
వంద తమలపాకుల్ని సునాయాసంగా లెక్కించగలను
బహుశ వందమంది శత్రువుల్ని అప్రతిహతంగా జయించగలను
కానీ వంద నోట్లను ఒకేసారి లెక్కించడం నా తరం కాదు
అది వందమైళ్ళు ఆగకుండా పరుగుపెట్టినంత కష్టం
బిందెడు నీళ్ళు పైకెత్తి
దించకుండా వంద గుటకలు వేసినంత ఆయాసం
దినదిన గండంతో నూరేళ్ళు జీవించినంత భారం
అప్పటిదాకా రెపరెపలాడిన నోట్ల కట్ట
నా చేతిలో పడగానే
నోట్లన్నీ అతుక్కుపోయి నాపరాతి ముక్కవుతుంది
ఇక లెక్కించడమంటే
నాపరాయిని వందపొరలుగా వొలవడమే
డబ్బులెప్పడు లెక్కబెట్టినా
ఎదురుగాలికి పడవ నడిపినట్టుంటుంది
ఎక్కుతున్న పర్వతం ఎదుగుతున్నట్టుంటుంది
పట్టుబట్టి లెక్కపెడతాను కాబోలు
యాభై పూర్తయ్యేసరికి
వంద పూర్తి చేసిన అలసట కలుగుతుంది
మధ్యలో వేలు రెండుసార్లు నాలుక మీద తడి తీసుకుంటుంది కానీ
మొదటిసారి ఉన్న తేమ రెండవసారి ఉండదు
మరో పాతిక పూర్తయ్యేసరికి
అలసట రెట్టింపవుతుంది
ఆ తర్వాత అందులో సగానికి
ఆ పై మిగిలిన సగంలో సగానికి
అలసట ద్విగుణం బహుళం అవుతుంది
నోట్లకు సగభాగాలుండవు కాబట్టి
అలసట లెక్క పెరిగి
అసలు లెక్క ఎక్కడో తప్పుతుంది
అప్పటికల్లా నాలుక పూర్తిగా తడారిపోతుంది
గ్లాసుడు నీళ్ళు తాగి
మళ్ళీ వేలుకు తడిచేసుకుంటే కానీ
లెక్క మొదలవదు
మొదలైనా పూర్తవదు
లెక్క పెడుతున్నంత సేపూ
నాలుక మీద వేలు మిగిల్చిన ఉప్పదనమే
నోరంతా ఆవరించుకుని ఉంటుంది
డబ్బులు తీసుకుంటే లెక్కపెట్టుకు తీరాలి
ఎవరికైనా మనం డబ్బులిస్తే
వాళ్ళు లెక్కపెట్టుకుని మన నిర్దోషిత్వం రుజువయ్యేదాకా
సిగ్గుతో చావాలి
అందుకని
డబ్బులు చేతిలో పడగానే
జేబులో వేసుకోవడానికో
ఇంకొకరికివ్వడానికో బదులు
ఏట్లో వెయ్యాలనుంటుంది
ఏట్లో వేసేటప్పుడైనా సరే లెక్కపెట్టే వెయ్యమన్నాడు తాతయ్య
లెక్క కుదిరితే వెయ్యాలనే ఉంది
లెక్కే కుదరడం లేదు.
October 5th, 2008 at 10:49 am
వందెల్లు గుర్థుండె కవిత..భాగుంది..పెరుగు.రామక్రిష్న
October 7th, 2008 at 1:13 am
kopparthi garu rupaini naparathitho polchi manchi kavitha rasaru maa voori naparathi quari lo panichese sramikulu nijamgane rupaini naparathi gane bhavistharu thieyatam anthkastam kanuka.dabbulu lekka pettatadam edurugaliki padava nadapatame lekapothe kostha karidar koasam inni rajakieya thimingalalu nollu theravvu kada. LEKKALENITHANAM nijamga oka koththa vasthuvunna kavitha naa lanti vardhamanulaku kastha kotha dari chupette kavitha KOSURIRAVIKUMAR
November 2nd, 2008 at 10:12 am
ధన స0స్క్రతి వీర వి హా ర 0 కా ల 0 లొ విల క్స న మ యి న కవిత.
November 4th, 2008 at 12:59 am
[...] ‘వేయి సరస్సులు ఏవి?‘ , కొప్పర్తి ‘లెక్కలేని తనం ‘, కృపాకర్ మాదిగ పొనుగోటి ‘అమ్మ [...]
November 7th, 2008 at 12:42 am
Dad,
Your poem is simply good.