ప్రేమ మాధ్యమం

సాయంత్రం ఆరు గంటలు;
బ్రెయిలీ క్లాసుకి ఆటవిడుపు గంట మోగింది
చైతన్య పురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు
దూసుకొచ్చే వాహనాల మధ్య నుంచి
ఒకరి చేతులొకరు పట్టుకుని మెల్లిగా రోడ్డు దాటారు
ఇ – సేవ కివతల మలుపు మీద నుంచున్న
ముగ్గురమ్మాయిలకీ ప్రాణం వచ్చింది
గల్లీ రౌడీ చూపుల్ని విదిలించుకుని
ఒక్కసారిగా ముందుకొచ్చారు
“షాజహానా ఎక్కడున్నావు..?”
“స్వప్నా నే వచ్చాను చూశావా..”
“ఎస్తర్ ఇవాళ వచ్చిందాండీ..?”
అబ్బాయిలు ఎవరి ప్రపంచాన్ని వాళ్ళు పేరు పెట్టి పిలిచారు
వారం రోజుల పాటు ఉగ్గబట్టుకున్న ఏకాంత దుఃఖం
నల్లద్దాల వెనక ప్రవహిస్తోంది
అమ్మాయిలు మాట్లాడలేరు
నిశ్శబ్దం వారి పెదవుల మీద మోపిన శిల
షాజహానా ఒకబ్బాయి పక్కకొచ్చి
అర చేతిలో మధురగీతం రాస్తుంది
స్వప్న అలిగినట్టు నుంచుని
అతని మాటల్ని అల్లుకుని మెడలో వేసుకుంటుంది
ఎస్తర్ నవుతూ ఎదురొచ్చి
అబ్బాయి చెంపమీద ఎవరూ చూడకుండా ఒక ముద్దు పెడుతుంది
ఇక్కడ నిజంగానే ప్రే మ గుడ్డిది
ప్రేమ మూగది
శ్రవణాన్ని దృశ్యంగా మార్చుకుని
సంభాషణ చేస్తున్న అబ్బాయిలకు
దృశ్యాన్ని శబ్దంగా కూర్చుకుని
సమాధానం చెబుతారు అమ్మాయిలు
మూడు జంటల శ్రవణ, శబ్ద, నేత్రావధానం
అరవై నిమిషాల సేపు
చైతన్య పురి పరిసరాల్ని ప్రేమ పురి చేస్తుంది
హాస్ట్లలుగంట పరమ నిర్దయగా మోగుతుంది
విడిపోవడం ఇష్టంలేని చేతులు మరింతగా బిగుసుకుంటాయి
హటాత్తుగా భూమి చీలి తలో దిక్కునా పడినట్టు
నిస్సహాయంగా అమ్మాయిలు తమ గదికి వెడతారు
అబ్బాయిలు ఒకర్నొకరు పట్టుకుని మళ్ళీ ప్రమాదాల రోడ్డెక్కుతారు
వారానికొక్క ఇంద్ర ధనస్సు అల్లుకోవడం కోసం
వాళ్ళు ఏడురంగులతో ఎదురుచూస్తారు
దశాబ్దాలుగా కలిసి బతుకుతూ కూడా
అపరిచితుల్లా మిగిలిపోయే మన చీకట్లను వెక్కిరిస్తూ
ప్రేమ మాధ్యమాన్ని వెలిగించి చూపిస్తారు

6 అభిప్రాయాలు »కవితలు

6 Responses to “ప్రేమ మాధ్యమం”

  1. 1
    N VENKATRAO Says:

    దశాబ్దాలుగా కలిసి బతుకుతూ కూడా
    అపరిచితుల్లా మిగిలిపోయే మన చీకట్లను వెక్కిరిస్తూ..చాలా బాగుంది.

  2. 2
    raamaa chandramouli Says:

    బాగున్నది

  3. 3
    buchi reddy Says:

    చాల బాగుంధి

  4. 4
    Hrk Says:

    రియలీ గుడ్ పొయెమ్. ఊరికే పారబొయ్యకుండా, తడిని కాపాడుతూ, అనుబంధాల్ని వ్యక్తం చేయడం చాల బాగుంది.

  5. 5
    bollojubaba Says:

    కొండే పూడి నిర్మల గారి కవితలలో మానవసంబధాల ఔన్నత్యం తొణికిసలాడుతుంది. ఈ కవిత ప్రారంభంలో రోడ్ సైడ్ ప్రేమల గురించి చెపుతున్నారు, ఎలా జస్టిఫై చేస్తారబ్బా అనుకుంటూ ముందుకు వెళితే, ఎంతటి రమణీయంగా ముగించారూ. ఎంతటి మానవత్వంతో నింపేసారూ. ఎంతటి కరుణార్ధ్ర దృశ్యాన్ని ఒక ప్రేమపూరిత కనులతో దర్శింపచేసారు.

    సమాజంపై కవికి ప్రేమలేకపోతే, మంచి కవిత్వం సృష్టించలేడనటానికి ఈ కవిత గొప్ప ఉదాహరణ.

  6. 6
    bhasker.k Says:

    hats off to nirmala gariki. chala adbhutamaina kavita. gundelnitakediga undi. she is essentially poetess which goes w/o saying. she always comes of with flying colours while in poetry.
    bhasker.k

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో