Oct2008
రహస్యం
రహస్యం
అమ్మ పేగుల్లోనే మొదలైందేమో
మొగ్గ విచ్చుకోవటంలో మొదలైందేమో
కానీ
రహస్యం ఎన్ని దాస్తుంది
అన్నీ దాచేసుకుని
స్టేజీపైన మేకప్ వేసుకున్న పాత్రలా
నటిస్తూ
అద్భుతమైన నటనను నేర్పుతుంది
నటన దాని జన్మహక్కు
హెచ్‌ఐవి కన్నా ప్రమాదకరమైంది కూడా
నటనే.
మన తన అనే బంధాలు పాశాలు లేనిది
కదా
మెహన్జొదారో శిధిలాల క్రింద
రాజరికపు గతాన్ని
దాచుకుని వుంటుంది.
శోధిస్తుంటే మట్టిక్రింద రహస్యంగా
విరాగిలా నవ్వుకుంటుంది
రహస్యం లేని రాజ్యాన్ని చూడాలని
రహస్యంగా మట్టితో కప్పేసి నిద్ర పోయాను
ఉదయానికి లేత ఎండలో
తడి మట్టిలో
పచ్చటి మొలకలా
తళుక్కున మెరసి
ఫక్కున నవ్వింది
రహస్యం
October 5th, 2008 at 10:00 am
వారిజ గారూ..! మీ కవిత ‘రహస్యమ్ చదివాను. బాగుంది.
— ఆది శేషారెడ్డి ,నెల్లూరు.
October 20th, 2008 at 7:29 am
హెచ్‌ఐవి కన్నా ప్రమాదకరమైంది కూడా
నటనే.
మన తన అనే బంధాలు పాశాలు లేనిది
కదా
మెహన్జొదారో శిధిలాల క్రింద
రాజరికపు గతాన్ని
దాచుకుని వుంటుంది.
శోధిస్తుంటే మట్టిక్రింద రహస్యంగా
విరాగిలా నవ్వుకుంటుంది
I DON’T UNDERSTAND KEY BOARD. ME KAVITHA CHALLLLLLLLLLLA BHAVUNDI