Oct2008
తవుసు
- చైతన్య ప్రకాశ్
వెనుకడుగు ముందడుగు
జరుగు జరుగు పరుగు పరుగు
పొడిచేదో కన్ను తుడిచేదో కన్ను
నక్కి నక్కి దాక్కుంటూ
వెనుకబాటులో పోటీ
వెనక్కి నెట్టేసి ముందంజలో పోటీ
కాలొగ జాగల మనసొగ జాగల
చెప్పేదొకటి చేసేదొకటి
ఎటు మెసలనియ్యని పెత్తనం
ఈ చేతులే పాపం-
కడప దాటితే తండ్లాట
ముక్కు ముల్సుక పడుడు
బొక్కపోర్ల పడుడు
ఎక్కెక్కి ఏడ్సి ఏడ్కెల పాలవుడు
నిక్కబొడ్సుకునే తాలకు
బొండిగె బిసుకుడు
సందుల మందు
బుడ్డెన్కాని ఏషమొకటి తొవ్వ తప్పిచ్చుడు
మరిపిచ్చి మురిపిచ్చుడు
ఎవల నెత్తురు వాళ్ళదే
ధానకర్ణులే వేరు-
కంకేది కంకుడు బొంకేది బొంకుడు
ఉత్తుత్తగనే ఎగిరెగిరి దుంకుడు
కూకుందామంటే తీరం లేదు
ఓర్సుకుందామంటే కుదార్తెంగాదు
కింద మంట మీద గొడుగు
ఆరింది గాదు తీరింది గాదు
తీరొక్క తవుసెల్ల దీసుడు
బిలబిల పాణమెల్ల గొట్టుకునుడు
ఇగవచ్చె తసు అగవచ్చె తసు
అచ్చిందిగాదు పోయింది గాదు
తాయికి లేకుంట ఆగమాగం
సూత్త సూత్తుండంగ
కండ్లల్ల వొడ్సుడు
సుసాయం బట్టి
సుదురాయించుకునుడు
కాళ్ళల్ల కాళ్ళిరికిచ్చుడు
ఎన్కనుంచి ఇగిలిచ్చి నవ్వుడు
తక్తెక్కినంక ఒగమాట-
సెగవెట్టుడు వగలాడుడు
ఇగ తగదప్పని ఉసికుడుకుడు
ఎందర్ని చూడలేదన్నట్లు
అదే పనిగా భూమి కదులుడు
నాన్చుడు నశ్కెలు ఎప్పటికప్పుడు ఎండుడు
ఉన్నతొవ్వైనా లేని తొవ్వైనా
నడిసేతందుకే నిలవడుడు
అవద్దం నువ్వద్దె కాదెప్పుడు
మరుగులనైనా మన్సులు మసులుడు
కారేది కారుకుంటా పారేది పారుకుంట
పోయిందేదైనా సురువవుడే!
ప్రాణహిత » నవంబర్ 2008 సంపాదకీయం Nov 4, 2008 1
[...] వారిజ ‘రహస్యం‘, చైతన్య ప్రకాష్ ‘తవుసు‘, శివారెడ్డి అనువాదం ‘ఈ పద్యం [...]
ప్రాణహిత » అక్టోబర్ 2008 సూచిక Nov 4, 2008 2
[...] తవుసు : చైతన్య ప్రకాశ్ [...]