వెయ్యి సరస్సులు ఏవి?

- రాంకి

మట్టి లేని
మట్టి మనుషులకు
చోటులేని
గచ్చుల తారురోడ్డుల ఉచ్చులో
ఊపిరాడని మట్టిలా….
చెట్టులేని
చెమటకూ కన్నీళ్ళకూ
విలువలేని కృత్రిమ నవ్వుల పువ్వుల
హైటెక్ కాంతుల నడుమ
నిదురలేని వేశ్యలా
కదుల్తున్న వ్రణంలా
కూలీల కార్మికుల కడుపున
దాగిన కారుచిచ్చులా
నగరం

పిచ్చుకలకూ
చిలకా గోరింకలకూ
వలస పక్షులకూ
గూడులేని ఫ్లై ఓవర్ లా….
యంత్రాల పొగలూ
మనుషుల సెగలతో
జీవచ్చవంలా …….

బాగమతి, కులీ కుతుబ్ ల
ప్రేమ చిహ్నంగా మొలచి
ప్రేమలే కరువై
మూసి నది ఒడ్డున
ఇపుడొక ప్రేమ పురాస్మృతిలా…

పక్క మనిషి చనిపోతే
క్షణాలు లెక్కించుకుంటూ
పారిపోయి
ట్రాఫిక్ లో చిక్కుకున్న
వాహనాల రొదల దండలా నగరం

ఆ వర్షపు రాత్రి
రోజూ రోడ్డు పక్కన
సేదతీరే నోరులేని
ఊరు పేరు ముఖం తెలియని
మనుషులేమయ్యారో సోయిలేని …

మనిషి శ్రమనూ
మనిషితనాన్ని
మింగేసిన కొండచిలువలా….

దొరికిందేదో నమిలిన
ఎద్దు కడుపులోని
ప్లాస్టిక్ గడ్డలా
నగరం

అన్ని హక్కులకూ చెల్లని
తెలంగాణ పల్లె కరిగిపోతూ
పొడవూ వెడల్పూ పెరిగిపోతూ
ప్రతి అడుగు నేలా సరుకై…

చావుకూ పుట్టుకకూ
మంచినీళ్ళకూ మూత్రశాలకూ
రూపాయి రూపాయి
రూపాయి భాషలా. ……

పై పై వెలుగుల అడుగునే
పరుచుకున్న విస్తరిస్తున్న
ప్రశ్నల నీడల వాడలా ..

సుల్తాన్ బజార్లు పోయి
బిగ్ బజార్ లు గా ఎదిగిన
మహా సెజ్ నగరం

చినుకు పడితే చాలు
వేయి సరస్సుల గతపు
ఆనవాళ్ళను చూపుతూ …..

వర్షపు నీళ్ళే కాదు
మనిషి కన్నీళ్ళూ
ఇంత చోటులేక
ఊరవతలకు జారిపోయే
నగరం.

Share/Save/Bookmark

కవితలు

2 అభిప్రాయాలు

  1. bollojubaba అక్టోబర్ 2008 1

    చాలా బాగుంది
    బొల్లోజు బాబా

  2. N VENKATRAO అక్టోబర్ 2008 2

    మనిషి శ్రమనూ
    మనిషితనాన్ని
    మింగేసిన కొండచిలువలా…. నగరం
    చాలా బాగుంది

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో