అనన్య

- హెచ్చార్కె

ఇంతింత కళ్ళతో
ఏమి చూస్తున్నావు
ముడిచిన పిడికిట్లో
ఏమి దాస్తున్నావు
నీలో నువ్వే నవ్వుకుంటావు
నన్ను చూసి అని మురిసిపోతాను
నీలో నువ్వే మాట్టాడుకుంటావు
అర్థాలు వివరించి చెప్పబోతాను
ananya.jpg
చెవులొగ్గి వింటాను
చెప్పరాదా కాస్త
భుజమెత్తి మోస్తాను
ఏమిటా రాస్యం
నిన్న సాయంత్రం
చలికాలం వచ్చిందని
స్వెటర్ తీసి మడతలు విప్పితే
మడతల్లోంచి నవ్వుతూ చిన్న గడ్డిపువ్వు

నా దేశానికి వస్తూ
నిన్ను ముట్టుకుంటే
కోపంగా లాగేసుకున్న
నీ చిట్టి చెయ్యిని గుర్తు చేసింది
మేపుల్ చెట్ల నీడల్లో
నీ ఆటపాటల గురించి
కల గంటూ నేను
ఎత్తుకుని
నిన్ను ముద్దాడుతుందని
మీ లాన్లో వీపింగ్ చెర్రీ మీద అసూయ

నాకొద్దు దేశాలు
ఒద్దుపన్యాసాలు
నీ నవ్వులు నీ ఏడుపు
ఉంగా ఉంగా భాషలో
నువ్వు కట్టే కవనాలు
ధ్వనించే చోటులలో
పుట్టడం కోసం
చనిపోవాలనుంది నాకు
మళ్ళీ మళ్ళీ

Share/Save/Bookmark

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో