అసలు దోషి

- చైతన్య ప్రకాశ్‌

సిరిసిల్లా కార్గిల్లేక్‌ ముఖద్వారం
కట్టుకున్న బట్టే బరిబాతల నిలబెట్టి
‘వర్ధని కుంట’ మీద మర ఫిరంగియై మొరుగుతూ వర్ధిల్లుతుంది
ఇక్కడ బట్టా పొట్టే నిర్భంద బలిపీఠం -
పండుగ పరీక్షయ్యో చీప్‌ లిక్కరయ్యో కల్తీ కల్లయ్యో
సరిహద్దురేఖగా నడుం చుట్టుకుంటుంది
బద్దం ఎల్లారెడ్డి నగర్‌ క్షణం క్షణం బద్దలవుతూ ఉంటుంది
కుట్టులేని బట్ట
బిల్‌ క్లింటన్‌కు దానం చేసిన పరంధామా!
పోతూ పొతూ జెట్లూమ్‌నైనా నిలేయకపోతిని గదా!
అధికార హంతక ఆప్కొ బకాయిలన్నా అడుగక పోతిని గదా!

హత్యలూ ఆత్మ హత్యలూ కలె గలిసి
ఓట్ల పెట్టె ముందు ప్రలోభ ధీనంగా
బతికిన మనుషులు సైతం
శవాలుగా వేలాడ్తున్నారు-

పిల్ల కాలువలే నదులై చిరుగాలే ఈదురుగాలై
పెను ఉప్పెనై ఊగని చేట్టూ లేదూ
కదలని పాదమూ లేదు
నెత్తురు తడువని నేల లేదు

ఇది సిరిసిల్లా గతం-

కనబడ్డోన్ని కనబడ్డట్టే వందల మంది ముందు
ఉత్త పుణ్యానికే కాల్చిచంపి
ఎన్‌కౌంటర్‌ ఎటుచూసినా బూటకం
కన్నీళ్ళతో తడిసిన లాకప్‌గది
కిక్కిరిసిన కోర్టు హాలూ
చేతుల గొలుసులు “విప్లవం వర్దిల్లాలి!”

ఒకప్పటి సిరిసిల్లా పోస్ట్‌ మార్టమ్‌ గదే
దేశంలో కెల్లా పెద్ద గ్రంధాలయం-

ఇప్పటి సిరిసిల్లా

దొర్కని మూలం ముందు కూలవడ్డ
ఒంటిని ఆసాంతం సాగిలబడి
గుంజుతున్న బాడిగ చక్రం-

ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళందరికీ వేదిక శవం
ఇప్పటికీ సిరిసిల్లా పోస్ట్‌మార్టమ్‌ గదిముందు
మనమంతా అజ్ఞాన మౌన ప్రేక్షకులం
బతుకడమూ చావడమూ ఒకటిలా
బిక్షాపాత్రయై దేబిరించడం సుదీర్ఘ శేషం
స్థైర్యమిచ్చే వాళ్ళం కనీసం చేతులన్నా లేనివాళ్లం కదా!

పోయినోని మీద నిందలు తప్ప
పునారావృతం కాకుండా మూలాలైనా వెతుకాలె గదా!
కనీసం బతికిన వాళ్ళనైనా
సాటి మనిషిగా చూడాల్సింది గదా!
చిత్రమేమిటంటే
వేతన పెంపుకు ధర్నాని తుపాకులు లాటీలతో
తరిమి కొట్టిన వాళ్ళు సైతం
పురాణ వేషాలతో ఆత్మస్ధెర్య ర్యాలి-

నేతన్నా! మనకు మనమే ధీమా
కొన్నొద్దులుంటాం ఒక రోజు పోతాం
ఎవరికి ఎవరు జిమేదారు కాదు-
పోతే ఈ కనా కష్టపు బతుకైనా మళ్ళీ రాదు-

జీవించే కళ మనకు తెల్సినంతగా
ఓదార్చే వాళ్ళకు లేదు
మనల్ని మనం గుర్తు పెట్టుకుంటే మార్గాలనేకం-

చెత్తా చెదారం
అంతా ఉత్త పటాటోప ప్రచారం
పరామర్శ పలుకరింపే నిరంతర నేరగ్రస్త ద్రోహం

ఎప్పటికైనా బోనులో నిలబడాల్సిన దోషి ఒక్కటే
రాజ్యం!


కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో