ఏదీ మారలేదు

- కొండెపోగు.బి. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌

ఏదీ మారలేదు
కొవ్వు కాస్తయినా కరగలేదు
కాలం అభ్యుదయం వైపు తిరగలేదు.
మనువు మారు మనస్సు పొందలేదు
ముందు ముంతా వెనుక తాటాకుల్లేవు గానీ
ఎక్కడా అస్పృశ్యతలు అంతరించలేదు
శంభూకుడి శిరస్సింకా చిక్కలేదు
దామాషా రాజ్యాధికారం దక్కలేదు
ఏదీ మారలేదు
అగ్రవర్ణకుడి మీసాలు అవనతం కాలేదు
వాడపిల్లపై వెకిలిచూపు తొలగలేదు
పెత్తందారు కంట్లో పొగరు జీర చెరగలేదు
పంచముడికి పట్టాభిషేకం జరగలేదు
ఏదీ మారలేదు
కబ్జాదారుల భూదాహం తీరలేదు

కండకావరపు దళారీ జాతి మారలేదు
కారంచేడుల, ఖైర్లాంజీల కన్నీటి మడుగు ఇంకలేదు
వర్ణాహంకారపు హూంకారాలకు తెరపడలేదు.
ఏదీ మారలేదు
స్వేచ్ఛకు సంకెళ్ళు విరగలేదు
ప్రశ్నల్ని సహించని పీఠాలు కూలలేదు.
బొటనవేళ్ళు తస్కరించే ద్రోణులు నిష్క్రమించలేదు
కబలించే వామన పాదాలు కదలలేదు
ఏదీ మారలేదు, కొత్త అవతారాల ఎత్తుగడలు
అణచివేతల వ్యూహాత్మక పన్నుగడలు
అన్ని వివక్షలు యధాతథం, ఎక్కడి దొంగలు అక్కడ గప్‌ చిప్‌
ఏదీ మారలేదు కొవ్వు కాస్తయినా కరగలేదు
కాలం అభ్యుదయం వైపు తిరగలేదు
మనువు మారు మనస్సు పొందలేదు
అబ్బే! ఎక్కడా ఏదీ మారలేదు

2 అభిప్రాయాలు »కవితలు

2 Responses to “ఏదీ మారలేదు”

  1. 1
    జాన్ హైడ్ కనుమూరి Says:

    ఒబామా విజయకేతం ఎగురవేసి
    మార్పుకు తొలియడుగు వేసి
    ఏదైనా మారవచ్చని సంకేతమిచ్చాడు

  2. 2
    GURRAMSEETARAMULU Says:

    బొటనవేళ్ళు తస్కరించే ద్రోణులు నిష్క్రమించలేదు

    . ఇది అ0దరికి వర్తిస్తుంది దలిథ పంతుల్ల చెతుల్లొ మొసపొయిన
    కథలు నా కు చాలా తెలుసు కవిత్ బాగుంది

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో