కురవని చినుకు కోసం

- బండ్ల మాధవ రావు

కురవని చినుకు కోసం
కురవని చినుకు అంచున
తలక్రిందులుగా నిలబడి నిరీక్షిస్తున్నాను
చినుకు నుండి జారి భూమిలో యింకిపోవాలని
ఏ కార్తె చినుకూ నన్ను క్రిందికి జార్చడంలేదు
ఆషాఢ మాసాన మెరవాల్సిన మేఘాలు
మబ్బుల్లో మాయమై పోయాయి
చాళ్ల వెంబడి విచ్చుకోవాల్సిన
విత్తనం గర్భంలో
ఘనీభవించిన మొలకల కదలికలు
రెండు నీటి చుక్కల కోసం
పొడిబారిన మట్టిపెళ్ళల్లోంచి తొంగిచూస్తున్నాను
ఇక్కడ కురవాల్సిన మేఘపు జాడకోసం
దాహం తీరే దారి లేక
నోరు పిడచగట్టుకుపోతోంది
యజ్ఞాలే చేస్తారో
కృత్రిమ వానలే కురిపిస్తారో
నా ముఖాన నాలుగు చెంబులు
నీళ్లు కుమ్మరించిపోండి
తడి తడిగా మట్టిలోంచి విచ్చుకోవాలనుంది
కొంచెం చెమ్మ తగిలినా చాలు
రెండు చేతులు జోడించి మీముందు నిల్చుంటా.

5 అభిప్రాయాలు »కవితలు

5 Responses to “కురవని చినుకు కోసం”

  1. 1
    Audisesha reddy Kypu Says:

    చినుకు కొసము మీరు పడిన శ్రమ అర్ధ0 చేసుకున్నాను. ప్రకృతి సమతుల్యత లొపము.. ఏమి చేద్దా0 మన ఖర్మ.

  2. 2
    GURRAMSEETARAMULU Says:

    మాధవ్ గారు బాగున్నారా
    కురవని చినుకు లాగానె ఉధ్యమాలు ఉన్నాయి
    all is well God in the heven ! !
    కవిత్వ0 మరీ గిడస బారి పొతుంది
    మంచి కవిత ఆసించడ0 అత్యాస గా మారింది
    seethttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=qwQui1XQwCfflAXCsoPvTCq-2OereE-9n3_DFcupkDg=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@gmail.com
    mail chyendi

  3. 3
    kosurodu Says:

    మాధ;వ్ రావు గారూ, మీ కవిత చాలా బాగు0ది చాలా రొజుల్ ను0చి మీతొ మాట్ లాడాలని అను కు0టూ మీ కవిత్ చదివాను.మ0చి క విత

    మీ కొసూరి

  4. 4
    vibha Says:

    చినుకు విలువను ఎంత బాగా చెప్పారు.చాలా బావుంది.

  5. 5
    ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక Says:

    [...] కురవని చినుకు కోసం : బండ్ల మాధవ రావు [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో