అధ్యాయం 11: ముట్టడి (రెండో భాగం)

ఒకరోజు పొద్దున్నే బంకర్లలో వున్న మా సెక్యూరిటీకి కాఫీ తీసుకువెళ్తున్న నామీద కాల్పులు మొదలుపెట్టారు మార్షల్స్ . అపాచీ తెగకు చెందిన కార్లోస్ అనే యువకుడు నా వైపు దూసుకొచ్చి, నన్ను కిందకు తోసి తన శరీరంతో నన్ను కప్పాడు. నేను పొట్టిగా వుంటాను. ఆ అబ్బాయి నాకంటే చిన్నగా వున్నాడు. కొన్ని బుల్లెట్లు మాకు వెంట్రుకవాసిలో తప్పాయి. కాల్పులు కొంచెం తగ్గగానే దగ్గర్లో వున్న బంకర్లోకి నన్ను లాక్కెళ్లాడు. అక్కడ నా మీద విరుచుకుపడ్డాడు, “నీకేమైనా పిచ్చా? అసలు నువ్వు బయటకు రాకుండా వుండాల్సింది. బయటకు రావలసిన అవసరంలేదు నీకు.” అతణ్ని చూసి నవ్వొచ్చింది నాకు:”నేను తొందర్లో అమ్మను కాబోతున్నాను. నువ్వు ఇంకా పిల్లాడివి. నేను ఏం చెయ్యాలో, చెయ్యాకూడదో నువ్వు చెప్పాలనుకుంటున్నావా?” కానీ అతని ప్రవర్తన నా హృదయాన్ని తాకింది. నేను అతనికంటే మరీ పెద్దదాన్నేం కాదు. మగవాళ్లందరూ నాగురించి మరీ ఎక్కువ పట్టించుకునేవారు. మా తిండి సామాగ్రి బాగా తగ్గిపొయ్యింది. ఎండబెట్టిన చిక్కుడు కాయలు, కొంత పిండి మాత్రమే మిగిలింది. కాఫీ, చక్కెర, సిగరెట్లు లాంటి వస్తువులు లేనేలేవు. మార్షల్స్ అధిపతి బహిరంగంగానే ప్రకటించాడు: “ వాళ్ల భోజన అలవాట్లను మార్చేస్తాం మేం!”

తరిగిపోతున్న తిండి సామాగ్రి మీద డెనిస్ ఒక కన్నేసి ఉంచాడు. ఈస్టర్ ఆదివారం కోసమని కొంచెం హ్యామ్ , కొన్ని బంగాళాదుంపలను దాచివుంచాడు. వూండెడ్ నీకి మరోవైపు వున్న ఇంకో చిన్ని చర్చిలో కలుసుకుని డెనిస్ దాచి వుంచిన తిండితో ఒకలాంటి విందు చేసుకున్నాం. తిండితో నిండివున్న బరువైన సంచిని భుజంమీద వేసుకుని అక్కడికి వెళ్లాను నేను. స్ట్యాన్ హోల్డర్ నా దగ్గరికి వచ్చాడు, “ఏమయింది నీకు. ఆలోచనలేకుండా పని చేస్తావు.“ ఇంకొంతమంది స్నేహితులు అతనికి తోడయ్యారు: “ముందు ఆ సంచిని భుజం మీది నుంచి దించు! నీకేమైనా అయితే మేం బాధ్యత వహించాల్సి వుంటుంది తెలుసా.”

నేను వాళ్లకు గట్టిగా చెప్పాను, “ఇలా నా వెంట పడడం ఆపెయ్యండి. నా చేష్టలకు నేను తప్ప మరెవ్వరూ బాధ్యత వహించనక్కర లేదు.” వంట చెయ్యడం, బంకర్లలో వున్నవారికి కాఫీ తీసుకెళ్లడం లాంటి పనులు చెయ్యడం మానలేదు నేను. ఎక్కడ కలుసుకున్నా పెద్రో బిసోనెట్ నా పొట్ట చూపిస్తూ, “మా చిన్నారి వీరుడికి ఆకలి వేస్తుంటుంది. తనకు ఇదిగో ఈ బువ్వ పెట్టు“ అంటూ తనకు కేటాయించిన కొద్దిపాటి ఆహారాన్ని నాకు బలవంతంగా ఇచ్చేసేవాడు. ఒక్కోసారి నాదగ్గరి వచ్చి బాస్కెట్ బాల్ ఆడుతావా అని అడిగేవాడు. అతను అలా అడిగినప్పుడల్లా చుట్టూ వున్న వాళ్లందరూ నవ్వేవాళ్లు. నా పొట్ట చాలా పెద్దదిగా వుండేది మరి. నిజానికి ఒకరినొకరిపై హాస్యాలాడుతూ బాగా నవ్వుకునేవాళ్లం . ఆ స్వభావమే మేం వూండెడ్ నీలో అన్ని రోజులు వుండగలగడానికి సహాయ పడింది.

తిండి పరిస్థితి మరీ దిగజారిపోతుండగా ఒక యువ వేటగాళ్ల బృందాన్ని “మందకొండి ఎల్క్ “ని వేటాడడానికి పంపాం. “మందకొండి ఎల్క్ “ అంటే చుట్టుపక్కల వున్న తెల్ల ర్యాంచర్ల పొలాల్లో మేస్తున్న పశువులన్నమాట. “మంచి ఆవును వేటాడితెండి,” అని డెనిస్ వాళ్లకు చెప్పాడు. వాళ్లో ముసలి ఎద్దును వేటాడి తెచ్చారు. ఆ ముసలి ఎద్దుకు చావాలని ఎంత మాత్రమూ లేదు పాపం. దాదాపు ఇరవై సార్లు షూట్ చేస్తే కానీ అది చివరి శ్వాస విడువలేదు. ఇంతకీ చూస్తే మా యువకులకు దాన్ని ఎలా నరకాలో తెలీదు. భలే వేటగాళ్లే! వాళ్లందరూ సెయింట్ పౌల్ , డెన్వర్ , రాపిడ్ సిటీ నుంచి వచ్చిన పట్టణవాసులు మరి. అక్కడే వున్న ఒక తెల్ల రిపోర్టర్ ఎద్దును ఎలా నరకాలో చూపించాడు. మా అడవాళ్లు మాంసాన్ని ఎంతో సేపు దంచి, ఉడకబెట్టారు. అయినా అది రాయిలా గట్టిగా వుండిపొయ్యింది. కొంచెం మాంసాన్ని తీసుకుని తింటే ఏదో తాడు నములుతున్నట్లనిపించింది. తరువాత డెనిస్ ఒక పెద్ద పోస్టరు తగిలించాడు. ఆ పోస్టరులో ఒకపక్క ఎద్దు వెనుక భాగాన్ని గీసి, దాని కింద పెద్ద అక్షరాల్లో రాశాడు: ఇది ఎద్దు! ఇంకో పక్క ఆవు వెనుక భాగాన్ని, పాలపొదుగును గీసి దాని కింద కూడా పెద్ద అక్షరాల్లో రాశాడు: ఇది ఆవు! ఆ రెండు బొమ్మల మీద ఇంకా పెద్ద అక్షరాల్లో : ఆవు – అవును, ఎద్దు – వద్దు!

మార్షల్స్ , గూన్స్ , బి.ఐ.ఏ పోలీసులు అంతా కలిసి మూడువందలకు పైగా జమగూడినా మమ్మల్ని పూర్తిగా సీల్ చెయ్యలేకపొయ్యారు. పెద్రో బిసోనెట్ చెప్పినట్ల్లు : “ భూమి తల్లి మనవైపు వుంది.” ఆ ప్రాంతమంతా గుట్టలు, వంకలు, లోయలు, సేజ్ పొదలు, కాటన్ వుడ్ చెట్లతో నిండివుంది. అక్కడ మార్షల్స్ చాలా సులువుగా దారి తప్పి పొయ్యేవాళ్లు. అంతేకాక గెరిల్లా తరహా యుద్ధానికి వాళ్లు సముఖంగా లేరు. దాంతో మార్షల్సు కళ్లుగప్పి వూండెడ్ నీ బయటకు వెలుపలికి రాకపోకలు బాగానే సాగేవి. డెన్వర్ , న్యూ మెక్సికో , ఎల్ .ఏ నుంచి ఇండియన్లు డజనో, అర డజను మందో కలిసి వూండెడ్ నీలోకి వచ్చేసేవాళ్లు. న్యూ యార్కు నుంచి వచ్చిన ఇరక్వా ఇండియన్లు కొన్ని రోజులు మాతో కలిసి వున్నారు. ఆ ప్రాంతంలోని ప్రతి చెట్టూ పుట్టలతో పరిచయం వుండి, కళ్లకు గంతలు కట్టుకున్నా దారి తప్పని కొందరు సూ వ్యక్తులు బయటి జనాలు వూండెడ్ నీలోకి రావడానికి సహాయం చేశారు. చాలావరకు వూండెడ్ నీకి ఎనిమిది తొమ్మిది మైళ్ల దూరంలో వున్న పోర్క్యుపైన్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. మార్షల్సు ఎ.పి.సిలను వుపయోగించి, అగ్గిరవ్వలతో చీకట్లను కాంతిమయం చేసేవారు. గుడ్డిగా షూట్ చేస్తూ ఆ ప్రాంతాన్ని తుపాకుల మోతలతో నింపేవారు. ఎరుపు రంగులో ట్రేసర్ బుల్లెట్ల వర్షం, మా చుట్టూ వున్న ప్రెయిరీపై వెలుగులు చిమ్మేవి. మమ్మల్ని చేరుకోవడానికి వచ్చిన అన్నలు, అక్కలను ఆ తుపాకీ మోతలు, బుల్లెట్ల వెలుగులు ఏమాత్రం భయపెట్టలేదు. వూండెడ్ నీలోకి వచ్చిన గుంపుల్లో నేటివ్ అమెరికన్ మత్స్య కారుల హక్కుల గురించి పోరాటం చేస్తున్న సిడ్ మిల్స్ ఆధ్వర్యంలో వచ్చిన నార్త్ – వెస్ట్ కోస్ట్ జనాలు, పుల్యేపు, నిస్క్వాలీ జనాలు వున్నారు.

ఒకసారి సిడ్ మరో ఇద్దరు ముగ్గురు యువకులతో కలిసి తిండి సామాన్లు తేవడానికి బయల్దేరాడు. రాత్రంతా నడిచినా తమ గమ్యానికి చేరుకోలేకపొయ్యారు. వెలుగు రాగానే చూసుకుంటే సేక్రెడ్ హార్ట్ చర్చి నుంచి ఏ వంద గజాల దూరంలో వున్నామని గుర్తించారు. రాత్రంతా వలయాల్లో నడుస్తూ, రాయి విసిరేంత దూరం కూడా వెళ్లలేదు వాళ్లు. వాళ్ల గౌరవార్థం ఒక క్రతువు ఏర్పాటు చేశాడు డెనిస్ .సిడ్ కు గద్ద ఈక బదులు కంపాస్ బహుమతిగా లభించింది . అయినా సిడ్ దగ్గర అప్పటికే గద్ద ఈక వుండింది.

మరోసారి ఒక ఇండియన్ యువకుడు మా చిన్ని డాట్ సన్ ఎక్కి గవర్నమెంటుకు చెందిన ఒక పెద్ద సాయుధ శకటాన్ని వెంబడించాడు. కట్టెతో ఆ శకటాన్ని బాదుతూ వెంటబడ్డాడు*. ఏం చెయ్యాలో తోచక టక్కుతూ తారుతూ వెళ్లిందా శకటం . మా చిన్ని డాట్ సన్ ఆ శకటాన్ని రోడ్డు బ్లాకు దాకా తరుముతూ వెళ్లింది.

కొంతమంది ఓక్లహోమా యువకులు గవర్నమెంటు బంకరులో వున్న కాఫీ, గుడ్లు, సిగరెట్లు, బ్రెడ్డు, సాసేజ్ లాంటి అమూల్యమైన వస్తువులను కొల్లగొట్టి తెచ్చారు. ఆ బంకరులోని మార్షల్సు నిద్రపోతూనో, తప్పతాగి పడివుండవచ్చు. ఇంకోసారి T V సిబ్బంది వదిలి వెళ్లిన ఖాళీ ఫిల్మ్ డబ్బాలను తీసుకుని వాటిని నేలలో పూడ్చి పెడుతూ పెద్ద తతంగం చేశారు మా వాళ్లు. కొద్ది సేపటిలోనే పోలీసుల షార్ట్ వేవుల ద్వారా వారి మధ్య వ్యాపిస్తున్న పుకారు వినిపించింది: “ఆ ఇండియన్లు టెల్లర్ మైన్లను పాతిపెడుతున్నారు!” అన్ని ఏ.పి.సీ లు అక్కడనుంచి తొందర తొందరగావెళ్లిపొయ్యాయి. దాంతో మేము మరో తంత్రాన్ని గెలిచినట్లయ్యింది . అలా వూండెడ్ నీ ముట్టడిలో హాస్యం కూడా చోటుచేసుకుంది.

మా ప్రత్యర్థులతో మేం నిరంతరం సంభాషణల్లో వుండేవాళ్లం. ఒకరినొకరిని పేర్లు పిలిచుకుంటూ, గేలి చేసుకుంటూ, తిట్టుకుంటూ వుండేవాళ్లం. ఒకరోజు హఠాత్తుగా ఛీఫ్ మార్షల్ గొంతు వినిపించింది: “ఇక వినోదాలు , ఆటలు అయిపొయ్యాయి!” మా చుట్టూ వున్న ఛట్రం మరింత బిగుసుకుంది. స్నూపి అనే పేరు గల హెలికాప్టర్ స్నైపర్లను పెట్టుకుని మావైపు షూట్ చెయ్యసాగింది. 50 – కాలిబర్ ఎమ్ .జి లు మా పై కాల్పులు మొదలెట్టాయి. మార్షల్స్ తో వున్న కనెక్షన్ తప్ప వుండెడ్ నీ బయట మాకున్న అన్ని కనెక్షన్లను పీకేశారు. చీకట్లో మా కదలికలను గమనించడానికి ఇన్ఫ్రారెడ్ గన్ స్కోపులు , వేటకుక్కలతో కూడిన విధ్వంసక-సంహారక దళాలను రప్పించారు. మా చుట్టుపక్కల ప్రదేశాల్లో ట్రిప్ – వైర్లను బిగించారు. మేమెవరైనా ఆ వైర్లను తగిలితే ఒక అగ్గిరవ్వ పైకెగిసి విచిత్రమైన కాంతితో ఆ ప్రదేశాన్ని నింపేది. ప్రెస్సును లోపలికి అనుమతించడంలేదు. అందరికంటే చివర వెళ్లిపోతున్న ఒక రిపోర్టరు రస్సెల్ మీన్సును అడిగాడు, “ రేపు పొద్దున్న కూడా మీరిక్కడే వుంటారనుకుంటున్నారా?” “అంతా గవర్నమెంటు దయ” అని బదులిచ్చాడు రస్సెల్ మీన్స్ .

మా ఉపబలాలు, సరఫరాలు బాగా తరిగిపొయ్యాయి. మా చుట్టూ వున్న దృశ్యం మొదటి ప్రపంచం యుద్ధం గురించి తీసిన చౌకబారు సినిమాను తలపిస్తోంది. మార్షల్స్ తమ చుట్టూ ఇంటి సౌఖ్యాన్ని తలపించే సామాగ్రిని నింపేసుకున్నారు. వాళ్ల వినోదం కోసం రేడియోలే కాక TV లు కూడా వున్నాయి. వాళ్ల బంకర్ల నుండి రాక్ ఆండ్ రోల్ పాటలు తేలివచ్చేవి. జంప్ సూట్లో, మరుగు పరిచే దుస్తులు వేసుకుని వుండేవాళ్లు. వాళ్ల స్థానాల చుట్టూ గుట్టలు గుట్టలుగా ఖాళీ షెల్స్ , బీరు సీసాలు పేరుకుపోయాయి. వాళ్ల సాయుధ శకటాలకు శక్తివంతమైన సెర్చి లైట్లు , ఎమ్ – 79 గ్రెనైడ్ లాంఛర్లు తగిలించి వుండేవి.

అలాంటి సాంకేతిక యుధ్ద సామాగ్రిని ఎదుర్కొనడానికి మా దగ్గర వున్న ఆయుధ సామాగ్రి ఏ మాత్రం సరితూగలేదు. తిండికి వున్నంత కటకట మందుగుండు సామాగ్రికి కూడా వుంది. దాదాపు ప్రతిరోజూ జరిగే మామూలు కాల్పుల సంఘటనలో మార్షల్సు రెండు, మూడు వేల రౌండ్లు కాలిస్తే మేం ఇరవయ్యో ముప్పైయ్యో రౌండ్లు కాల్చేవాళ్లం. మాకు దొరికిన మందుగుండు సామాగ్రినంతా సేక్రెడ్ హార్ట్ చర్చి పీఠం మీద కుప్ప పోశాం. మా మగవాళ్లు అప్పుడప్పుడు తమ బంకర్లనుంచి వచ్చి బుల్లెట్లతో జేబులు నింపుకుని వెళ్లేవారు. పెద్ద సమస్య ఏమంటే వారి దగ్గరవున్న తుపాకులకు సరిపొయ్యే బుల్లెట్లను వెదుక్కోవడం చాలా కష్టమయ్యేది. వాళ్ల దగ్గర వున్న కొన్ని తుపాకులు ఎంత మొరటువంటే వాటిని పురాతన వస్తువుల్లా మ్యూజియమ్ లో పెట్టొచ్చు. వాళ్ల దగ్గర అంత అధునాతనమైన ఆయుధాలు వున్నా, మార్షల్సుకు మేమంటే భయమని అనిపించింది నాకు. మామూలుగా ఇండియన్లు ఎప్పుడూ వున్నట్లే మేం నిశ్చలంగా వుంటే మార్షల్సు మాత్రం ఎప్పుడూ టెన్షన్లో వుండి, ఎప్పుడు తుపాకీ కాలుద్దామా అని ఎదురు చూస్తున్నట్లుండేవాళ్లు. ఒకనాటి రాత్రి మేం పౌ-వవ్ తరహా పాటలు పాడుకుంటే, మార్షల్సు వాటిని మృత్యు గీతలనుకొని భయపడ్డారు. ఒకరోజు డెనిస్ ఎక్కడినుంచో ఒక స్టవ్ పైపును దొరకపుచ్చుకుని దానికేదో తగిలించి గన్ సైటులా తయారు చేశాడు. మేం దాన్ని ఒకచోట నిలబెట్టి మాకు రాకెట్ లాంఛర్ దొరికిందని పుకారు పుట్టించాం. ఇది కూడా మార్షల్సును బాగా భయపెట్టింది. వాళ్లకంటే మేం గుండె ధైర్యంతో వుండేవాళ్లం. కానీ, వాళ్ల దగ్గర అత్యాధునికమైన యంత్రాలు వున్నాయి.

* కొన్ని తెగల్లో యుద్ధమంటే ఒకరినొకరిని చంపుకోవడం కాక కర్రలతో ప్రత్యర్థిని ముట్టుకునేవారు.

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

ఒక అభిప్రాయం

  1. kolord97@gmail.com Jul 7, 2009 1

    oka kotha jivana vidanam telisindi, anuvaadam baagundi.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో