Comments on: మా నాన్న జ్ఞాపకాలు

By: B.Ajay Prasad
రోహిణి ప్రసాద్ గారూ

మీరు ఈమాటలో రాసిన చందమామ జ్ఞాపకాలు ప్రింట్ తీసుకుని దాచిపెట్టుకున్నాను. కొన్ని కాపీలు స్నేహితులకి పంచాను. చందమామ కథలు, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క వంటి సీరియల్స్ బొమ్మలతో సహా ఇప్పటికీ కళ్ళలో మెదులుతుంటాయి. చందమామ పత్రిక అసంఖ్యాకులైన తెలుగు ప్రజల బాల్య జ్ఞాపకాలతో ముడిపెట్టుకుని ఉంది. ఎవరూ చేయలేనిపని – అనేకమంది కథకులను తెలుగు సాహిత్యానికి అందించింది. అటువంటి చందమామలో పనిచేసిన కుటుంబరావుగారు, దాసరి సుబ్రమణ్యం, చిత్ర, శంకర్ వంటివారి అనుభవాలు తెలుసుకోవడం నిజంగా దివ్యమైన అనుభవం.

ధన్యవాదాలతో

బి. అజయ్ ప్రసాద్

By: Rohiniprasad
రాజశేఖరరాజుగారూ,

మీరు వెలిబుచ్చిన అభిప్రాయలను పోలినవే నాకూ ఉండడంవల్ల నేను చందమామ జ్ఞాపకాలను గురించి రాశాను. సుబ్రహ్మణ్యంగారు  తనకు రెఫ్లెక్టెడ్ గ్లోరీలో ఆసక్తి లేదని అనడం నాకు నిరాశ కలిగించింది. ఇప్పటి తరంలో కొంతమందికి గతం గురించిన కొన్ని మంచి విషయాల్లో నిజమైన ఆసక్తి ఉందని నేను నమ్ముతున్నాను. వారికి కొన్ని వివరాలనైనా అందజెయ్యడం నా బాధ్యత అని నా ఉద్దేశం. చెప్పగలిగీ ఉండి కూడా చెప్పక పోవడం బాధ్యతారాహిత్యమేనని నా ద్దేశం. ఈ విషయంలో మా అమ్మతో కూడా కొన్ని వాదనల్లోకి దిగడానికి నేను వెనకాడలేదు. మనం చెప్పని వాస్తవాలను గురించి ఇతరులు వక్రీకరించిన సందర్భాలలో మనం ఊరుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. ఎవరైనా అడిగినప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి నేను తయారే.  ఇప్పటికీ మనతో ఉన్న రజనీ కాంతరావుగారూ,  సంగీతరావుగారూ, పాలగుమ్మి విశ్వనాథంగారూ మొదలైన పెద్దలను కలుసుకుని వారి అనుభవాలను ఎవరు తెలియజేసినా అది ఆహ్వానించదగ్గదే అనుకుంటాను.

By: కె. రాజశేఖర రాజు.
ప్రస్తుతం చందమామ ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న మా వంటి ఈ తరం వారికి తెలియని ఎన్నో విషయాలు మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నాము. మీరు, త్రివిక్రమ్, వసుంధర, వేణు వంటి ఇతరులు చందమామ గురించి రాసిన జ్ఞాపకాలు, వ్యాసాలు దాదాపుగా సేకరించాను. కాని నాకు అర్థం కానిదల్లా ఒకటే..

ఓ ముప్పై ఏళ్లు, నలభై, యాభై ఏళ్లు చందమామలో నిరంతరాయంగా పనిచేసిన దిగ్ధంతులు తమ సుదీర్ఘ అనుభవం గురించి ఎక్కడా చెప్పుకున్నట్లు కనిపించడం లేదు. కుటుంబరావు గారు, వడ్డాది పాపయ్య గారు, చిత్రా గారు, మూడేళ్లకు ముందు చందమామలో పని మానుకుని విశ్రాంతి తీసుకుంటున్న కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు కొనసాగుతున్న శంకర్ గారు, చందమామలో మీ నాన్నగారి సమకాలికులుగా మొదలై ప్రస్తుతం తెలుగు చందమామ మాస పత్రిక ఎడిటింగ్ బాధ్యతలను మొత్తంగా మోస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు తదితరులెవ్వరూ తమ గురించి, తమ వ్యక్తిగత, ఉద్యోగ పరమైన అనుభవాలను గురించి ఇంతవరకూ ఎక్కడా పెద్దగా చెప్పుకున్నట్లు లేదు.

చందమామ కథలు మాత్రమే చరిత్రలో మిగిలి అందులో పనిచేసిన, చేస్తున్న వారి కథలు చరిత్రకు అందకుండా పోయిన, పోతున్న పరిస్థితే భయం గొల్పుతుంది. తోకచుక్క, మకర దేవత, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలా ద్వీపం, రాకాసి లోయ, పాతాళ దుర్గం, శిథిలాలయం, యక్ష పర్వతం, రాతి రధం, మాయా సరోవరం, భల్లూక మాంత్రికుడు వంటి ధారావాహికలతో 1952 నుంచి 70ల దాకా చందమామ చదవగలిగిన తెలుగు కుటుంబాల పిల్లలను, పెద్దలను మంత్ర జగత్తులోకి తీసుకుపోయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు 85 ఏళ్ల వయసులో ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తన 55 ఏళ్ల చందమామ ఉద్యోగ జీవితకాలంలో ఆయన తన గురించి చెప్పుకున్న ఉదంతం కాని, తన కథల నేపధ్యం గురించి, వాటికి ప్రేరణ గురించి గానీ ఎక్కడా చెప్పుకున్నట్లుగా ఆధారాలు లేవు. పిల్లల పత్రిక అనే శీతకన్ను ప్రభావ ఫలితమో ఏమో కాని, శంకర్ గారి గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఈనాడులో వచ్చిన ఇంటర్వ్యూ ఒకటి తప్ప ఏ తెలుగు పత్రికలూ చందమామ రచయితలు, కథకుల గురించి ఇంతవరకూ పట్టించుకున్నట్లు లేదు.

దీనివల్ల వ్యక్తులుగా వారు కోల్పోయిందీ, కోల్పోతున్నదీ ఏమీ ఉండక పోవచ్చు కానీ, ఒక జాతి కథా, సాంస్కృతిక సంపదకు తమ వంతు వన్నెలద్దిన చందమామ రూపశిల్పుల గురించి మీరూ, మీలాంటి వారు రాస్తున్న పరోక్ష విషయాలే చరిత్రకు అందుతున్నాయి. ప్రత్యక్ష ఆధారాలైన వారు తమ గురించి తాము చెప్పుకోరు. ఇతరులకు అంత ఆసక్తి ఉన్నట్లు కూడా లేదు.

తమపట్ల, తమ రచనల పట్ల ఇంత నిర్మమకారం, నిర్లిప్తత చందమామ కథకులకు ఆభరణం కావచ్చేమో కానీ చరిత్ర మాటేమిటి? మరో 50 ఏళ్ల తర్వాత వీళ్ల గురించి బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు కూడా. ఈ క్రమం ఇలాగే కొనసాగాల్సిందేనా? మనం బ్లాగర్లుగా, నెటిజన్లుగా ఇంతగా కొట్టుమిట్టులాడుతున్నాం కానీ… కొత్తగా చేరిన కుర్రకారుకీ లేదా ఆన్‌లైన్ టచ్ ఉన్న నాలాంటి వారికీ తప్ప… చందమామ ప్రముఖ కథకులు, చిత్రకారులు ఎవరికీ కూడా దాదాపుగా ఇంటర్నెట్ గురించి తెలియదు. అందుకే వాళ్లంత ఘనతర చరిత్రకు సాక్షీభూతులయ్యారేమో మరి..

చివరకు తేలేదేమిటంటే వాళ్లు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఏ కొద్దిపాటి ప్రయత్నమూ చెయ్యరు. ఇతరులకు వారి గురించి ఎంతో కొంత తెలుసుకుని ప్రపంచానికి చెప్పడానికి సమయమూ ఉండదు. ఓపికా లేకపోవచ్చు. చివరకు అందరం ఇలా మిగిలిపోతున్నాం. మిగిలి ఉన్న కొద్ది మంది వృద్దులనైనా ఎవరైనా పలకరిస్తే.. వారి అనుభవాలను అక్షరబద్దం చేస్తే ఎంత బాగుండు…

నేనింతకు ముందే మరో సందర్భంలో చెప్పినట్లుగా…

కొన్ని కలలు అందంగానే ఉంటాయి…. చందమామ లాగే….

By: ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక
[...] మా నాన్న జ్ఞాపకాలు : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ [...]

By: manasvini
nice to read about our beloved koku

By: baabjeelu
కుటుంబరావు గారూ, రావిశాస్త్రి గారూ లాటి వారిని రోజువారీగా చూసే మామూలు మనుషుల్లా వూహించుకోలేం. ఎందుకంటే పత్రికల్లోనూ, మిగిలిన వ్యాసాల్లోనూ వారి గొప్పతనవేఁ చూస్తాం. మీ వ్యాసం కుటుంబరావుగారి కొన్ని పార్శ్వాల్ని చక్కగా చూపించేయి.

మీకెలాగూ భజన వ్యాసాలు రాయడం రాదు. అది మా అదృష్టం. “దట్టంగా చెట్లు పెరగడంతో దోమల బాధ కూడా వుండేది” లాటివి కూడా మీరే రాయగలరు.

కుంటుంబరావుగారి శాస్త్రీయ సంగీతం లోని ప్రవేశమూ, అభిరుచీ ల గురించి వ్యాసం ఎప్పుడు రాస్తున్నారు?

By: Vamsi M Maganti
మీ నాన్నగారి గురించి తెలియని విషయాలు ఎన్నో తెలియచేసినందుకు ధన్యవాదాలు.

వంశీ