నవంబర్2008
ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకులు ఎవరూ?
- రమణ
నేను తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన వాణ్ణికాను. కె.సి.ఆర్, గౌడులు గురించి ఎలాంటి అభిప్రాయం వున్నా, ఏ చెట్టూ లేని చోట – పురుగులు పట్టిన – ఆముదం మొక్కల్లా కనబడుతున్న ప్రస్తుత ప్రత్యేక ఉద్యమ నాయకత్వాన్ని, ‘వాళ్ళ కారణాలు ఏమైనా కనీసం వాళ్ళైనా ప్రత్యేక రాష్ట్రం గురించి కృషి చేస్తున్నారు’ కదా అన్న కారణంతో బహిరంగంగా శపించకుండా వుండాల్సిన ఆబ్లిగేషన్ తెలంగాణా సోదరులకి వున్నట్టుగా నాకు లేదు. ఏ ఉద్యమ సఫలతకైనా దాన్ని పూర్తిగా సమర్ధించే వాళ్ళు మాత్రమే కాక, దాన్ని కొన్ని పరిమితులతో అంగీకరించే సానుభూతిపరుల ‘అవసరం’ కూడా వుంటుందన్నది అందరికీ ఎరుకే. ఐనా, ఈ విషయంలో ఆలాంటి వాళ్ళ నమ్మకం అవసరం వున్నట్టు కనపించండం లేదు. ప్రైవేటు చర్చలు, బ్లాగుల్లో కూడా, విభజన విషయంలో ఎలాంటి యిబ్బందికరమైన ప్రశ్నకైనా ఉద్రేకపూరితమైన, నినాదప్రాయమైన సమాధానం తప్ప రాకపోవడం, ఒక తెలంగాణ మిత్రుడైతే ‘నువ్వు ఆంధ్రావాడివి కనక నీ ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు’ అన్న సందర్భంకూడా నాకు ఎదురయ్యాయి, రాష్ట్ర విభజనకి సూత్రప్రాయంగా వ్యతిరేకం కాని వాళ్ళు, ఆ విభజన కె.సి.ఆర్, వంటి వాని నాయకత్వంలో జరిగితే దాని ఫలితాలు అందరికి ఎంత చేదుగా వుంటాయో అని భయపడేవాళ్ళు, నాలాంటి అజ్ఞానులు, కొందరైనా వుంటారనే అనుకుంటాను. అలాంటి వాళ్ళ ప్రశ్నలకి దాపరికాలు లేకుండా సమాధానాలు చెప్పవలసిన బాధ్యత ఎవరికైనా వుందో లేదో కూడా సందేహమే.
‘తెలంగాణా విభజన అక్కడి మెజారిటీ ప్రజల ఆకాంక్ష’ అన్న వాదనని పూర్తిగా అంగీకరించాలనే కోర్క ఉన్నా దానికి గట్టి నిదర్శనాలు కనబడటం లేదు. యిప్పుడు రాజకీయ పార్టీలు టి.ఆర్.ఎస్ తో పొత్తుకోసం ప్రయత్నింస్తుండడమో, తె.దె. లాంటి సమైక్యవాద పార్టీ విభజనకి సుముఖతని ప్రకటించడమో దానికి నిదర్శనంగా చూపిస్తే ఆ వాదం నిలబడదు. టి.ఆర్.స్ తో పొత్తూ, తెలంగాణా సానుభూతి పరుల (వాళ్ళ శాతం ఎంతైనా) ఓట్లు కాపాడుకోవడం, రాజకీయ సమీకరణలలో వ్యూహత్మకమైన అవసరం మాత్రమే. టి.ఆర్.ఎస్. ఒంటరిగా ఉప ఎన్నికలలో పోటీ చేసి పరాభవం చెందడం, అతి తక్కువ మెజారిటీతో కె.సి.ఆర్. ఎన్నిక కావడం కూడా యిది ‘మెజారిటీ ప్రజల ఆకాంక్ష’ అన్న వాదాన్ని బలహీనపరిచేవే. అంతటికీ మించి అంత మెజారిటీ ప్రజల కొర్కెకి యింతకన్న గొప్ప నాయకత్వంకానీ, ప్రధాన స్రవంతిలో ప్రతినిధ్యంకానీ లేకపోవడం ఏమిటి? ఇలా వాదించే వాళ్ళు విభజన వ్యతిరేకులే కానక్కర్లేదు. అలాగే మెజారిటీ ప్రజల ఆకాంక్ష కానంత మాత్రాన (మైనారిటీ ప్రజల కోరికే అయినా) ప్రత్యేక రాష్ట్రం కావాలనడం న్యాయమైన డిమాండ్ కాకుండానూ పోదు.
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అన్న ప్రశ్నకి చాలా సబబైన సమాధానాలే వున్నాయి; భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణాకి అన్యాయం జరిగింది. అది సరిదద్దవలసిన అవసరం వుంది. ఒకే రాష్ట్రంగా వుండడం వల్ల తెలంగాణా భాషకి సంస్కృతికి చాలా అపకారం జరిగింది. అందువల్ల సామరస్యంగానే రెండు రాష్ట్రాలుగా విడిపోవడం తెలంగాణా అభివృద్ధికి, తద్వారా దేశ అభివృద్ధికి మంచిది. ఇది మన రాజ్యాంగ పరిధిలో జరగవలసిన ఒక చిన్న సంస్కరణ మాత్రమే. ఈ వాదాన్ని ధూషణలతో కాక సామరస్యపూర్వకంగా ప్రభుత్వంలోనూ, బయటా నిజాయితీ పరుల మద్దతు కూడగట్టడంతో పాటు సమాంతరంగా భాషా, సాంస్కృతిక రంగాల్లో కృషి చేయడం ద్వారా రాజకీయ పరిష్కారం సాధించడం, ‘అన్నదమ్ములుగా విడిపోదం’ అన్న కోర్క వున్న వాళ్ళు వెళ్ళవలసిన దారిగా కనిపిస్తుంది. అలాంటి దారిలోనే వుద్యమానికి ‘గ్రాస్ రూట్ లెవెల్’లో ప్రజల భాగస్వామ్యం, అక్కడనుంచే శీలం వున్న నాయకత్వం రాగల అవకాశాలూ ఏర్పడతాయి. తద్వారా ఏర్పడే విభజన ఎక్కువమందిని భయపడుతుందని నేను భావించను. (ఈ సందర్భంలో తెలంగాణా వాదులు దేశంలోపలా బయటా విరివిగా చేస్తున్న బతుకమ్మ పండగ సంబరాలని ఒక మంచి చొరవగా అంగీకరించాలి.) అలాంటివి కాక, కొన్ని సందర్భాలలో బాల్ థాకరేని మరిపిస్తున్న కె.సి.ఆర్. లాంటి వ్యక్తి నాయకుడిగా ఈ వుద్యమం రెండో ఇన్నింగ్స్ ముందుకురావడం, కొనసాగడం తెలంగాణా వాదానికి ఎంత క్రెడిబిలిటి తెస్తున్నాయి? ఒకవేళ ఆయన అవకాశవాదాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయలు ఫలితంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయినా దానివల్ల ఎవరికి లాభం? యింత పరిమితమైన లక్షం – లెజిస్లేషన్ – కోసం జరిగే వుద్యమానికి మిలిటన్సి అవసరం ఏమిటి? యిలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరికి వుంది? లేక యివి అజ్ఞానులు, ‘ఆంధ్రా’వాళ్ళ అడుగుతున్న ప్రశ్నలు కాబట్టి వీటిని పట్టించుకోవలసిన అవసరం లేదా?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చేయవలసిన పనుల గురించి ఒక రోడ్ మేప్ డాక్యుమెంట్ లాంటిది వున్నట్టయితే అందులో ఏ అంశాలు రాష్ట్రం ఏర్పడతేనేకానీ చేయడానికి వీలవదు ఏ అంశాలు విభజనతో సంబంధం లేకుండా చేయడం వీలవుతుంది అని గుర్తించడానికి నిర్మాణాత్మకమైన కృషి ప్రారంభించడానికి వాయిదా వేయవలసిన అవసరం లేకుండా వుండడానికి వీలవుతుంది. అలాంటి పత్రం నాకు ఎక్కడ కనబడలేదు. అలాంటి పత్రం ఒకటి తప్పకుండా వుండి వుంటుందనీ దాన్ని ఆంధ్రావాళ్ళకి కనబడకుండా దాచి వుంటారని భావిస్తున్నాను.
ఆధునికమైన నిరసన సాధనంగా వినిమయ శక్తిని వాడడం గురించి తరచూ వినబడుతుంటుంది. ఉదాహరణకి చైనాలో మానవహక్కుల వుల్లంఘనకి నిరసనగా చైనాలో తయారైన వస్తువులు కొనని వాళ్ళని, జంతువులని పట్ల నిర్దయగా ప్రవర్తించాయన్న కారణంగా ఆ బ్రాండ్ బట్టలని కొనని వాళ్ళని గురించి వార్తలు చూస్తుంటాం. ఇది కొత్తదేమి కాదు. దీనినే గాంధీ చాలా పెద్ద స్థాయిలో ఒక పోరాటరూపంగా బ్రిటిష్ వస్తు బహిష్కరణ రూపంలో చేసి మంచి ఫలితాలు సాధించాడు. తెలంగాణా సాంస్కృతికరంగంలో ఏర్పాడాల్సిన అభివృద్ధికి ఇలాంటి మోడరేట్ నిరసన సాధనాలు, వాటితో పాటు నిర్మాణాత్మకమైన కృషి – ఉదాహరణకి దినపత్రికలలో వచ్చే తెలంగాణా అనుబంధాలు తెలంగాణా మాండలీకంలో వుండకపోతే ఆ పత్రిక తెలంగాణాలో కొనకపోవడం - జోడించిన చొరవ వల్లే దీర్ఘకాలంలో అక్కడి ప్రగతిశీలవాదులు ఆశించే అభివృద్ధి సాకారమవుతుంది.
కదనకుతూహలం, అవకాశవాద నాయకత్వం తప్ప నిర్మాణాత్మకమైన ఆలోచనలు కృషి లేకుండా ఏర్పడే విభజనవల్ల అందరికన్నా ఎక్కువ నిరాశ చెందబోయేది తెలంగాణా లోని ప్రగతశీలశక్తులే.
murali నవంబర్ 2008 1
chandrababu mamanu adikaram nuchi dichina vishvasa gatakudu, ysr adikaram kosam yemaina chestaru viriddaru andhra prantaniki naya katvam vahiste leni yibbandi kcr, goud telangana ku nayakatvam vahiste vache nashtam yemi ledu. maro 5yellalu mottam desha nayakatvam dalita, badugu vargala chetiki velutundi. miru yedchi gee pettina agadu. white house block chetiloki povadam kanipinchadam leda
తాడేపల్లి నవంబర్ 2008 2
తెలంగాణ మాండలికం అని చెప్పబడుతున్నది / తెలుగు సినిమాల్లో అవహేళనలకి గుఱైనదీ వాస్తవానికి తెలంగాణలో చదువురానివాళ్ళు మాట్లాడే మాండలికం. అది గౌరవనీయ సాహిత్యసృష్టికి పనికొచ్చేది కాదు. అసలైన శిష్ట తెలంగాణ మాండలికం ఒకటుంది. దానికి మాత్రం ప్రచారం లభించడంలేదు.
GURRAM SEETARAMULU నవంబర్ 2008 3
రమణ్ గారికి దన్యవాదాలు
తెలంగాన మీద మీకున్న గౌరవానికి క్రుతగ్నతలు
ఒ స్త్రీ పురిటీ నొప్పులు మగాడూ పడ్డ ట్టూ
తెలంగాణ పురిటీ ణోప్పులు మీ కెందుకండీ
తెలంగాన మీద
ఇప్పుడూ కావాలిసింది సానుబూతి కాదండీ !!!!!
కార్య రూప0!
తెలంగానా వస్తె దొరలు ఎలతారొ నిరకుశూలు యెలతారొ తెలియదు కాని
ఆ(మా) పాలన మా దొరలు చెస్తె చాల0డీ
ఆ చావు మమ్మలను చా వ నీయ0డీ
మాకు ఆంద్ర , రాయల సీమ దొరల పాలన్ మాత్ర0
ఇన్కెంత మాత్రమ్ వద్దు
తెలంగాన ఉద్యమాని అస్తిత్వ ఉద్యమ గాటన కట్టీన వామపక్స్య (ఆంద్ర), విప్లవ, ప్ర తిఘాతకులు
పొరాటాలు వదిలి seat la ఆ టలు ప్రజలు గమనిస్తూనె ఉన్నారు
ఇక పొతె majority minority విశయము ఎంత్ తక్కువ మాట లాడతె అంత మంచిది
ఈ దెశ0్ లొ communism ను majority ప్రజలు వద్దను కుంటూన్నారు
మ న వాల్లు ఈ దెశ0 లొ నిర్దాయ క శక్తి్ మా దె అంటూన్నా రె ( మా కరుణ్ ఉంటే నె తెలంగాన వస్తది )
వీ రు Chathisgad nu , జార్ఖండూ, ను , POTA, NU , M L C ని ఆపగలి గారా
ఎంత విచిత్ర0
……….
vinay నవంబర్ 2008 4
శిష్ట తెలంగాణ మాండలికం గురించి ఇంకా వివరించగలరు. రెండున్నర జిల్లాల కోస్తా ప్రాంతంలో కూడా గ్రామీణ యాసలున్నాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడరేమి?
GURRAM SEETARAMULU నవంబర్ 2008 5
రమణ గారికి దన్యవాదాలు
తెలంగాన మీద మీకున్న గౌరవానికి క్రుతగ్నతలు
ఒ స్త్రీ పురిటీ నొప్పులు మగాడూ పడ్డ ట్టూ
తెలంగాణ పురిటీ నొప్పులు మీ కెందుకండీ
తెలంగాన మీద
ఇప్పుడూ కావాలిసింది సానుబూతి కాదండీ !!!!!
కార్య రూప0!
తెలంగానా వస్తె దొరలు ఎలతారొ నిరకుసులు యెలతారొ తెలియదు కాని
ఆ(మా) పాలన మా దొరలు చెస్తె చాల0డీ
మా చావు మమ్మలను చా వ నీయ0డీ
మాకు ఆంద్ర , రాయల సీమ దొరల పాలన మాత్ర0
ఇన్కెంత మాత్రము వద్దు
తెలంగాన ఉద్యమాని
అస్తిత్వ ఉద్యమ గాటన కట్టన వామపక్స్య (ఆంద్ర), విప్లవ, ప్ర తిఘాతకులు
పొరాటాలు వదిలి సీట ల ఆ టలు ప్రజలు గమనిస్తూనె ఉన్నారు
ఇక పొతె majority minority విశయము ఎంత తక్కువ మాట లాడతె అంత మంచిది
ఈ దెశ0 లొ communism ను majority ప్రజలు వద్దను కుంటూన్నరు
మ న వాల్లు ఈ దెశ0 లొ నిర్దాయ క శక్తి మాదె అంటూన్నా రె ( మా కరుణ ఉంటే నె తెలంగాన వస్తది )
వీ రు Chathisgad nu , జార్ఖండూ, ను , POTA, ను , M L C ని ఆపగలి గారా
వా ల్ల బ్రమలు కా కుంటే !!!
buchi reddy నవంబర్ 2008 6
hi
ramana garu
mari chettaga undhi –mee article
yemi cheppaalanukunnaro–artham kaaledhu–
kcr–bal thackery kaadu–adi mee thappudu opinion
what about ysr//babu////
vidipothei tappu yemiti sir
yenthakaalam yi baanisthvam maaku
yenthakaalam– mosaalu– dhaga -kutralu
nellu meeku— kannillu maaku ???yekkadaund nyaayam sir
yemi raasaro– yenduku raasaro artham kaani prashna
reddy
Raju DASA నవంబర్ 2008 7
Hi Ramana,
Vodduna koorchoni matlaade vaadu emi aina matlaaduthaadu,Mose vaaniki telsu kaavadi baruvu ani oka telugu sametha vundi..Alaa..i kkadi kastaalu ikkadi vallaki telusthaayi..ekkado vundi sannayi nokkulu nokke vaaniki em thelusthaayi???
Nayakatvam evaru ane kadaa mee prashna????Ante maaku memu palinchukolemanaaa ???Mee vuddesham?Idigo ilanti ahankara vadam nunde maa verpatu vaddam puttindi.Maadi verpatu vadam ani mee kosam antunnaa..maadi asthtvam kosam aaratam..batuku kosam poratam.
Mee nayakulu chaala thelivi kalla vallu ani meeru anukonte mee medala meeda ekkinchukonni vullegandi.Adi mee Durada…Daannni memu moyalsina avasaram ledu anduke maadi maaku kaavali antunnaam.
Telangana venuka baatuki konni vudaharanalu isthaanu…
Thotta tholi pradani start chesina nagarjuna sagar lo maa vata neellu,kaluvalu inkaa pani jarugoooooooothune vuntaayi..inka estimations vesthaane vunnaru.mari mee kemo neelu istharu,current istharu,50 yellanundi neellu meeku,estimation kaagithaalu maaku.Saagu,thaagu neeti kosam motarlu pedithe current billulu maaku,kalu addam pedithe paare kalvalu meeku.
Kadapa la vunna NTPC moodu saarlu thana capacity ni double chepinchukondi(210*3) ade ramagundam NTPC daani kanna munde modalu ainaaa netiki daani capacity 65 MWne.Deeni vodduna vunnaa boggu,neellu deeniki paniki rakunda kadapa ki kaavlsi vachaayi..
Rasta rajadhaani pakkana vunna RR lo vokka DEGREE college vaddu kaani GUNTUR,KRISHNA lo 26,27 colleges vunddaali…
Rastra vibhajana tharvata jarugalsina vaati gurinchi ROADMAP annav..adi chaala manchi maata.Maa ROADMAP chaala simple.Maa polaalaki neellu kaavali,Maaku VIDYA kaavali,VYDYAM kaavali,VUPADHI kaavali ade maa ROADMAP.Andukosam maa vanarulu maake chendaali,maa kastam meme anubhavinchaali.Mammalni meme palinchukovaali.
Ikkada karuvulo rithula aatmahatyalu pattavu kaani konaseema ku thufaan vasthe kotla rupayala package lu prakatisthaaru.Alaaa maa gurinchi aalochinche prabhutvam kaavali..ante maa prabhuthvam kaavali.
Assalu neeko vishayam cheppali…
Mee rastram maa TELANGANA tho kalise naatiki mee KURNOOL lo assembly lu,highcourt lu tent llo nadisevi ,vaana vasthe thala daachukovadaani ki,pandulu etthuku pothunna fillanu bdraparuchakovadaaniki pakka BUILDINGS leka,Kattinchukoleka PANDULANI tharimi kottadaaniki budget alacation chese paristhithi.
Appatiki hydrabad lo HIGH COURT,UNIVERSITY,ASSEMBLY,SECRTARIATE,gandhi,Osmania,Nilopher laanti hospitals ne kaadu..15 lakhs janabha ki drainage,power ,water supply chese infrastructure vundi.City college,Medical college,Arts college,nijjam college vanti vidya vasathulu,koti,abids,mojam jaahi,monda laanti markets tho kalakalaadedi.
Alaanti maa rajadhaani maaku kaavali.Maa thatala ,thandrula kastam,swedam,raktham .Daani lo kirayi ki vachina vallanu vellamante meeku thega ibandi avuthunte,maa vanarulani,maa neellani,maa boggu ni,maa bhoomulni anubhavisthunna maaku inkentha kopam raavali.Anduke maa PRABHUTVA erpatu kosam maa aaratam..maa batuku kosam ee Poratam…..
ప్రభాకర్ మందార డిసంబర్ 2008 8
రమణ సాబ్
ఒకసారి గాదు రెండు మూడు సార్లు సదివినా నీ బాధేందో అర్థంగాలే.
ఉద్యమాలు ఎట్ల నడవాల్నో,
ఉద్యమాలకు ఎవరు నాయకత్వం వహించాల్నో
కంప్యూటర్ల ముందు కూసోని నువ్వు నేను నిర్ణయించలేం కదా.
బద్మాష్ రాజకీయాల మధ్య మనుగడసాగిస్తున్న తరం మనది.
ఎవడు సొక్కంగున్నడు చెప్పు?
ఎవడు ఎప్పుడు ఏం పాట పాడ్తడో, ఏ బాటపడ్తడో తెలవకపాయె.
పార్టీలు ఎన్నికల ముందు చెప్పే మాటలకు, ఎన్నికలైనంక ఏసే వేషాలకు, మోసాలకు లెక్కేలేదాయె.
ఒక నీచ్ కమీనే కుత్తే గాడు కూడా అసెంబ్లీకి పార్లమెంట్‌కి ఎన్నికై నిజాయితీపరుల నెత్తిమీద సవారి చేసేందుకు పుష్కలంగ అవకాశం వున్న ఎన్నికల వ్యవస్థమనది.
ఎట్లెన్నుకున్నరని ప్రజల్ని తప్పు పడితే ఫాయిదా ఏముంటది?
…..దొంగనోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా?????
…..లంచగొండి వెధవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా ??????
అన్నడు శ్రీశ్రీ. (అన్నట్టు శ్రీశ్రీకి ఆంధ్రలో కంటే తెలంగాణలనే మస్తు ఫాలోయర్స్ వున్నరు. అట్లనే సి.నారాయణరెడ్డికి తెలంగాణల కంటే ఆంధ్రల ఎక్కువమంది దోస్తులున్నరు)
తెలంగాణ ప్రజలు తమ తెలంగాణా రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నరా లేదా అన్న విషయం ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే ఒక్కపూటలో తేలిపోతది.
కాని అట్ల తేలనిస్తరా ఈ బటాచోర్ నాయకులు.
వారికి అంత నిజాయితీవుంటే మన బతుకులు గిట్లెందుకుంటయి.
జనం అడిగి అడిగి, పోరాడి పోరాడి, తన్నులు తిని తన్నులు తిని అ లసి, సొలసి సొమ్మసిల్లేదాక తమాష చూస్తరు.
ఎసొంటి ఉద్యమమైనా నాల్రోజులు సాగదీస్తే అదే సల్లబడ్తదని వాళ్ల ప్లాన్.
తెలంగాణా వచ్చినంక ఎవరు బాగు పడ్తరు? ఎవరు రాజ్యం చేస్తరు? ఎట్లాంటి వ్యవస్థ ఏర్పడతది? రోడ్డు మ్యాపేంటిది? డాక్యుమెంటు తయారుచేసిండ్లా లేదా? గవన్ని ఫుజూల్ మాటలు.
తెల్లదొరల దొరల పాలన పోయి నల్లదొరల పాలన వచ్చినంక సామాన్య జనానికి (మాలమాదిగలకు, బడుగుబలహీన వర్గాలకు) ఒరిగిందేమున్నది?
ముందు ఆంధ్ర దొరల భల్లూకపు పట్టునుంచి తెలంగాణ బయటపడితే చాలు.
తెలంగాణ దొరల సంగతి తర్వాత చూసుకోవచ్చు. మేం ఇప్పుడు కోరుకుంటున్నది గంతే.
తెలంగాణా ఏర్పడినంక ఏ ప్రగతి శీలశక్తులూ నిరాశపడవు. వాళ్ల పోరాటం, వాళ్ల ప్రయత్నం ఎప్పటిలాగే కొనసాగుతుంది. ఇదొక చిన్న మజిలీ మాత్రమే. కాబట్టి మీరు బేఫికరుగ వుండుండ్రి.
ప్రజల్లో రోజురోజుకు చైతన్యం పెరుగుతున్నది.
కెసిఆర్ గానీ మరొకడు గానీ జనాన్ని ఎంతోకాలం మోసం చేసుకుంటుపోలేరు.
ఆంధ్రా తెలంగాణా భాయి భాయి.
జై తెలంగాణా! జై ఆంధ్ర!