విరసం కథా వర్క్ షాప్‌ కథకులతో ఒక సాయంత్రం

గత కొంత కాలం నుండి విభిన్న ప్రాంతాల్లో విరసం నిర్వహించిన కథల వర్క్ షాప్‌కు సంబంధించిన సమీక్ష సమావేశం “కథకులతో ఒక సాయంత్రం” అనే కార్యక్రమం అక్టోబర్‌ 19న హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ విరసం బాధ్యురాలు డా|| గీతాంజలి గారు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో వివిధ వర్క్ షాపులలో కొత్త పాత కథకులు రాసినటువంటి కథల మీద చర్చ జరిగింది. దీనిలో సమీక్షకులుగా వచ్చిన ప్రముఖ రచయిత్రి నల్లూరి రుక్మిణి గారు మాట్లాడుతూ సమకాలీన సాహిత్యంలో ఆధునిక కథ అల్లం రాజయ్య, తుమ్మేటితోనే ఆగిపోయిందని చాలా మంది విమర్శకులు పనికట్టుకొని చేస్తున్న వాదనను ఆమె కొట్టి పారేస్తూ కొత్త రచయితలు చాలా మంది విరసంలోంచి కథలు రాస్తున్నారని చెప్పారు. ప్రజా ఉద్యమాలు ఒడిదొడుకుల్ని ఎదుర్కుంటున్నప్పుడు కథల్ని అలవోకగా కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి రాయాలి. చాలా సమస్యల్ని దగ్గర నుండి చూసి కథలు రాస్తే మంచి కథలు వచ్చే అవకాశమున్నదని పేర్కొన్నారు. పోలవరం, పొల్కపల్లి, సత్యవేడు తదితర ప్రాజెక్ట్‌లు మరియు సెజ్‌ల మీద పరిశీలన చేసి ఉదయమిత్ర, ప్రశాంత్‌ లాంటి వాళ్ళు కథల రాసినారని ఆమె అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మరొక విమర్శకురాలు చూపు కాత్యాయని మాట్లాడుతూ విరసాన్ని బయట నుంచి చూస్తున్న వ్యక్తిగా తుమ్మేటి, రాజయ్యలతోని ఆధునిక కథాప్రస్ధానం ఆగిపోలేదు.

అంతే కాకుండా విప్లవ భావజాలంతో రాసిన పాత తరం కథకుల శైలిలో కాకుండా కొత్త శిల్పంతో,కొత్త కొత్త వస్తువుల్ని తీసుకొని కొత్త రచయితలు బాగా రాస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్ధుత సామాజిక పరిణామాల్ని, జీవితాల్ని పరిశీలించి కథలు రాస్తున్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వాటిని చర్చ జరిపి లోటుపాట్లను వివరించుకుంటూ పోతే అది కథకు న్యాయం చేకూరుస్తుంది అలాగే కథకులకు ప్రోత్సాహంగా ఉంటుందని అన్నారు. విరసం నిర్వహించిన వర్క్ షాప్‌ కథలలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వస్తువు సమకాలీన సమాజానికి సంబంధించినది కావడం వలన పెద్దగా పట్టించుకోకుండా, కథకులు సంక్షోభ సమాజాన్ని పరిశీలించి ఇంకా కథల్ని రాయాలని చెప్పారు.

ప్రముఖ మార్స్కిస్ట్ విమర్శకులు, విరసం సభ్యులు ఎన్‌. వేణుగోపాల్‌ మాట్లాడుతూ రచయితకు కథ కంటే ముందు జీవితం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో వర్క్ షాప్‌ కథకులు కూర్మనాథ్‌, ఉదయ్‌మిత్ర, ఉజ్వల్‌, బాసిత్‌, చెన్నయ్య తదితరుల వర్క్‌షాప్‌తో కలిగిన తమ తమ అనుభవాల్ని వివరించారు.

Share/Save/Bookmark

సాహిత్య వార్తలు

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక జనవరి 2009 1

    […] విరసం కథా వర్క్ షాప్‌ కథకులతో ఒక సాయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో