భక్తి లేదు-ముక్తి లేదు

- ఆశా పూర్ణా దేవి | అనువాదం: స్వాతి శ్రీపాద

అనుకోకుండా నా మిత్రుడొకడు మా ఇంటికి వచ్చాడు. లోపలకు అడుగు పెడుతూనే జేబులో చెయ్యి దూర్చి రెండు సినిమా టికెట్లు బయటకు లాగాడు.
“వెంటనే తయారవ్వండి” అవి నా చేతికిస్తూ

“శనివారం రాత్రి షోకని ముందుగానే టికెట్లు కొన్నాను. ఎన్నాళ్ళుగానో ఈ సినిమా
ప్రకటనలిస్తూనే వచ్చారు. వీటిని పారెయ్యలేక మీకిచ్చిపోదామని ఇంత దూరం వచ్చాను” నా మిత్రుడు ఇలాంటి విలాసాలకు దుబారా చెయ్యడం మామూలే.

“నువ్వే వెళ్ళొచ్చుగా? నిన్ను ఆపిందేమిటి?” సందేహంగా ఆడిగాను. ఓ పేలవమయిన నవ్వు అతని మొహం మీద కదలాడింది.
“రాత! ఇంకో రోజు రావడానికి సమయమే దొరకనట్టు సమాచారం” అమ్మమ్మ ఇప్పుడో ఇహనో అంటోందట..ఈ రాత్రి గడవడం అనుమానమేనని సమాచారం చెప్పాడతను.

“మీ అమ్మమ్మా?” అయోమయం అనుమానాలతో ఆశ్చర్యం వ్యక్తపరిచాను.
“ఆ రోజున మమ్ముల్ని పిలిచింది అమ్మమ్మ గారి శ్రాద్దానికేగా? కాదూ!”

“అది మా అమ్మమ్మ శాద్ద్రం ఇప్పుడిది మావిడ అమ్మమ్మ సంగతి. ఇదే మా అమ్మమ్మ అయివుంటే నా కార్యక్రమంలో మార్పే ఉండేది కాదు” అని మొహం గంభీరంగా పెట్టి “ఇహ నేను వెళ్ళాలి దేవుడు చిన్న చూపు చూసి వాళ్ళింటికి వేళ్ళేలోగా చచ్చిపోయిందో…ఇహ నా భార్య నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఆవిడ మంచి జరీ చీర కట్టుకుని వుంది. ఇప్పుడది ఓ మూలకు విసిరి కాటన్‌ చీర కడుతోంది. ఈలోగా నేనిటు పరుగెత్తుకు వచ్చాను. కనీసం మీ ఇద్దరూ సినిమా చూసి నా అత్మకు తృప్తినివ్వండి.”

కనురెప్పపాటులో గేటు ముందు నుండి అతని ద్విచక్ర వాహనం అదృశ్యమైంది. నిజానికి అతను ఆనందంగానే జీవిస్తున్నాడు. పెట్రోల్‌ మీద ఎంత కంట్రోల్‌ ఉన్నా

కలకత్తా ఈ మూల నుండి ఆ మూలకు తిరుగుతూనే ఉన్నాడు కార్‌ మీద ఏఆర్‌ పీతో.
ఉచితంగా టికెట్లు దొరకడం నాకు ఆనందాన్నిచ్చిన మాట కాదనలేను.

నా భార్యకు సినిమా పిచ్చి. దానికి తోడు ఈ సినిమాలో మహామహులైన నటీనటులు ఉన్నారని పొగుడుకోటం ఇది వరకే విన్నాను. ఈ సినిమాకి వెళ్దామనగానే ఆవిడ ఎగిరి గంతేస్తుందని నాకు బాగా తెలుసు.
ఇద్దరం కలిసి సినిమా చూడటం ఈ శనివారం సరదాగా గడపటమే.

నా సెలవలన్నీ ఎలా గడిచిపోయాయో నాకు తెలీనే లేదు. ఖాళీ సమయం అంతా బియ్యం, గోధుమలు, పంచదార, బొగ్గులు లాంటి అపురూప వస్తువుల వేటలోనే సరిపోయింది. కానీ గాక. ఇలాంటి కుటుంబ సమస్యలు వెయ్యిన్నొకటి చెప్పగలను. వీటికో అంతముండదు. నిజానికి అవి విషాద సముద్రాన్నీ కల్లోలపరుస్తాయి.

అదీగాక విషాదగీతాల్ను వినే తీరిక ఎవరికుంది గనక?

ప్రతీవాళ్ళు ఎవరి వంతు ఖర్మ వాళ్ళు అనుభవిస్తూనే వున్నారు. నా భార్య అంటూనే వుంటుంది-” ఎవరిక్కావలసింది వాళ్ళు పొందుతూనే వున్నారు నువ్వు తప్ప అని. అయితే మావిడకీ మాట చెప్పేందుకు నేను మాత్రం వెనక్కి పోను-నిజం చెప్పాలంటే ఇలాంటి రకరకాల మోతాదులకు నేనెప్పుడో అలవాటు పడిపోయాను.

ఇప్పుడీ క్షణం ఈ రాత్రి ఇద్దరం కలసి సినిమాకు పోవడం గురించి ఏమంటుందో ఊహించుకోవడం మొదలెట్టాను.
ఆనందం పొంగి పొర్లుతుండగా స్టోర్‌ రూమ్‌ దగ్గరకు వెళ్ళి తొంగిచూసాను. ఆ గది తలుపుకి ఓ పెద్ద తాళం కప్ప.

హడావిడిగా మాగదిలోకి వెళ్తే-ఎదురుగా ఆవిడ చీర సింగారిస్తోంది. నేను నవ్వుకున్నాను. మా మాటలన్నీ చాటుగా వినేసి ఉంటుంది.

శాంతిపురి చీర మడతలు విప్పుతోందావిడ. ఎక్కువ వ్యవధి లేకపోవడంతో పెద్ద భారం తగ్గినట్టు నిట్టూర్చాను. ఎవరో భుజం తట్టి అనుసరిస్తున్నట్టుగా నా మొహం మీద ఓ పెద్ద దరహాసం.”సరే, తయారవడం చాలా మంచి పని. ఈ రాత్రి డబ్బు ఖర్చు లేకుండా సరదాగా గడుపుదాం. శెశెర్‌ దావి మొదటాట సినిమా చూసొద్దాం.”

“ఏం మాట్లాడుతున్నారు? డబ్బుల్లేకుండా ఈ రోజున సరదాగా ఎలా గడపగలం?” కీచుమందామె స్వరం. “నిర్మల్‌ రావడం రెండు సినిమా టికెట్లు ఇవ్వడం నువ్వు చూడలేదా?” కాస్త అడిగాను. “మరింకేం పనీ పాటా లేనట్టు ఇరవై నాలుగ్గంటలూ మీ మాటలు వింటుంటాననుకున్నారా? మీ మిత్రుడికి ఎక్కడయినా రెండు సంచుల బొగ్గులు దొరికాయా మీ పట్ల ఇంత ధాతృత్వాన్ని ప్రదర్శించాడు?” భళ్ళుమందామె.

“కావొచ్చు. మరి నీ జరీ అంచుచీర సింగారింపుకు కారణమేమిటో” “హరి బాబు ఇంట్లో పూజ ఆంటీ స్వయంగా వచ్చి మరీ పిలిచారు” మరీ టికెట్ల మాటో?” కాస్త విషణ్ణంగా అడిగాను. “టికెట్ల గురించి నేనేం చెప్పను?” నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. “బయటకు విసిరెయ్యనా?” సినిమాకు రప్పించాలని ఒప్పించే ప్రయత్నంగా అన్నాను. “మరిక దారేదీ? సత్యనారాయణ పూజ వదిలి సినిమా చూసి నేను పాప కూపంలో మునిగి పోవాలనా మీ ఉద్దేశ్యం? మీ మిత్రుడుకి టికెట్లివ్వడానికి మరో సమయమే దొరకలేదా?” అందామె.

చీర కట్టడం, రెండు మూడుసార్లు తల దువ్వుకోడం, మొహానికి క్రీమ్‌ రాయడం అయాక నుదుటన బొట్టుబిళ్ళ అతికించుకుని విప్పిన చీర కొంగు నుండి తాళాల గుత్తి తీసుకుంటూ “ఎందుంత విచారంగా కూర్చున్నారు?” కట్టిన చీర కొంగుకు తాళాల గుత్తి ముడి వేస్తూ, “సినిమాకు మీరు వెళ్ళొచ్చుగా మీరొక్కరూ వెళ్ళొద్దని ఎవరూ అనలేదుగా?”అంది ఓదారుస్తున్నట్టు. సినిమాకు ఒంటరిగా వెళ్ళమని ఆమె సూచించటం ఇదే మొదటి సారి. ఒక వేళ పూజకు వాళ్ళ ఆంటీ ఆమెనొక్కదాన్నే పిలిచివుండకపోతే నేనొక్కడినే సినిమాకి వెళ్ళడం మీద ఎంత రాద్దాంతం జరిపేదో?

“నేనెలాగూ ఇంట్లో వుండను, ఒక్కళ్ళూ బిక్కు బిక్కుమంటూ ఉండేకంటే సినిమా చూసి రావడం టైం పాస్‌ చేసేందుకు ఉత్తమం కద”

ఈ క్షణంలో నా భావాలకు రూపమిప్తే ఈ సామరస్యత చెడగొట్టుకోవడమే. స్వరాన్ని మార్ధవంగా మారుస్తూ, “నువ్వు పక్కన లేకుండా సినిమా చూడటం నాకే మాత్రం ఆనందాన్నివ్వదు” అన్నాను. పిచ్చిగా మాట్లాడకండి. ఇష్టమయితే సినిమాకు వెళ్ళండి, లేదూ ఇంట్లోనే వుండండి. వంటమనిషిని మాత్రం వేచి వుండమనకండి” “ఏం? నువ్వు తినవా?” అడిగాను.

“ఆంటీ వాళ్ళింట్లోనే నా భోజనం, డిన్నర్‌ తినకుండా ఆంటీ నన్ను రానివ్వకపోవచ్చు. ఈరోజు వాళ్ళ కొత్తల్లుడు వస్తున్నాడు. అంటే లిల్లీ భర్త. వాళ్ళ సంబరాల్లో పాలుపంచుకోమని ఆంటీ చెప్పింది.”

దానర్ధం సత్యనారాయణ వ్రతమని ఆవిడ ముఖ్య ఉద్దేశ్యం కాదు. ఆమె ఆంటీకి బాగా తెలుసు ఈవిడ తెలివైనది, చతురాలు హాస్యంగా మాట్లాడుతుంది చక్కగా పాడుతుంది అని. “ఇంకో ఆడమనిషి మొగుడితో సరదాగా గడిపే అవసరమేమిటి?” ఆవిడ ఉద్దేశ్యం మార్చే ప్రయత్నంగా అన్నాను.
నిజం చెప్పాలంటే ఈవిడ స్వంత డబ్బా కొట్టుకోవాలనే ఈవిడ కోరిక నాకేమాత్రం రుచించదు.

“నీ మొగుడితోనే సరదాగా…” ఆవిడ కోర చూపు విసిరి నిర్లక్ష్యంగా బయటకు కదలడంతో మధ్యలోనే ఆపేసాను.

సినిమాకు వెళ్ళాలనే నా కోరికా చివికి పోయింది. మొదట టికెట్లు వంటమనిషికి ఇచ్చి ఇంట్లో ఒంటరిగా వుండిపోదామనుకున్నాను. అంతలోనే మరో ఆలోచన నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. కారణం నాలో మగతనం ఎదురుతిరిగింది. నా భార్యకు నా ఓటమి ఎందుకు తెలియనివ్వాలి? నా సమస్యలు కష్టాలు లెఖ్ఖచెయ్యకుండా ఆమె వేరే వాళ్ళతో సరదాగా గడుపుతుందా? ఆవిడ మాటలకు నేనెందుకు తాళం వెయ్యాలి? మేం, భర్తలం మా పెళ్ళాల కోరికలకు మా అభిరుచులు చక్కని ప్రవర్తన గాయపడినా మన్నిస్తాము. ఇప్పుడు మాత్రం ఆవిడ పక్కన లేకున్నా నా స్నేహితులతో ఆనందించగలనని చూపాలి. నా మోటర్‌ సైకిల్‌ తీసుకుని నా ఆలోచనలను ఆచరణకు అనువదించే కార్యక్రమంలో నా మిత్రుడు అబాని ఇంటికి బయల్దేరాను. అతని భార్య చాలా అందంగా ఉంటుంది. అందుకే ఆవిడంటే నా భార్యకు ఓ రకమైన అసూయ. నా భార్య ఈర్ష్యను రగిలించే ఉద్దేశ్యంతో ఇంకో టికెట్‌ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకాడ కుండా అబానిని అతని భార్యను సినిమాకు తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను. వాళ్ళిద్దరినీ సినిమాకు ఆహ్వానించటమే కాదు వాళ్ళని టాక్సీలో తీసుకువెళ్ళి రాచ మర్యాదలూ చేస్తాను. ఐస్‌ క్రీమ్‌, ఆలూ చిప్స్‌ మొదలయిన వాటితో సినిమా ఆనందాన్ని అనుభవించేలా చేస్తాను.

ఇవన్నీ ఆబాని భార్య ఎంత ఆనందంగా తిని అనుభవించిందో నా భార్యకు సవివరంగా వర్ణించి చెబుతాను.

నా ఉద్దేశ్యాన్ని భగవంతుడు మరోలా భావించాడు.”ఈ రాత్రికి సినిమా చూసే రాత మాకు లేదు. నేనూ రెండు టికెట్లు తెద్దామని ప్రయత్నించా, తేలేక పోయాను. మొట్ట మొదటి రాత్రి ఆటకే వెళ్ళాలని నా భార్య పట్టు బట్టింది. ఆవిడకు మొదటి ఆటే కావాలి. దురదృష్టం ఏమిటంటే నా కొడుకు మెట్ల మీంచి పడిపోయి నుదుటికి గాయం చేసుకున్నాడు. ఆయోడిన్‌, కాటన్‌ తెచ్చేందుకు వెళ్తున్నా.. నాక్కాస్త ముందే చెప్పుంటే…”

చివరి మాటలు ఏ విధంగా చెప్పాడంటే ముందే గనుక అతనికి చెప్పుంటే అతని కొడుకు నుదుటికి గాయం చేసుకునేందుకు తడబడే వాడన్నట్టుగా…
అబానిని మనసులోనే శపిస్తూ నిఖిలేశ్‌ ఇంటి వేపు బయల్దేరాను.

అతని భార్య పెద్ద అందగత్తె కాకపోయినా చదువుకున్నదనే పేరుందామెకి. ఆవిడ చదువు మావిడకు కంటిమంటగా ఉన్నా ఆవిడతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంటుందనే చెప్పాలి.

నా ప్రతిపాదన విన్నాక నిఖిలేశ్‌ అభిమానంతో కరిగిపోయాడు. “నా భార్యకు ఫిట్స్‌ రాకపోయివుంటే సినిమాకు సంతోషంగా వచ్చే వాళ్ళం అన్నాడు. ‘ఏమైందావిడకు ?” నిరాశ పడుతూ అడిగాను. “మా అమ్మతో పోట్లాట.దాని వల్లే ఆవిడకు ఫిట్స్‌. ఈ మధ్య మా అమ్మకు బొత్తిగా వివేకం లేకుండా పోతోంది”

నీ చావు నువ్వు చావు” మనసులోనే అనుకున్నాను.

కోపంతో మరిగిపోతూ శశాంక ఇంటికి బయల్దేరాను. శశాంక భార్యకు చదువు అందం లాంటి లక్షణాలేమీ లేవు. అలాగని పెద్ద ఆకర్షణీయంగానూ ఉండదు. అదృష్టం నన్ను నిజంగా విడిచి పెట్టేసింది. నీళ్లలో దూకే చేపపాటి కూడా మిగల్లేదు.

“మీతో సినిమాకు రావడం మాకు గొప్ప సంతోషమే, కాదంటే నువ్వింత దుష్ట సమయాన వస్తావని అనుకోలేదు” అన్నాడు శశాంక.
“ఏం జరిగింది?” నా అదృష్టాన్ని నిందించుకుంటూ అడిగాను.

శిబ్‌పూర్‌ నుండి మా పెద్దన్నయ్య అత్తమామలు వచ్చారు. వాళ్ళ కళ్ళ ముందే నా భార్యను తీసుకుని బయటకు రావడం బాగుండదు కద!” చెప్పాడు.
“నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళేందుకు ఏం అడ్డం పడుతోంది?” అతనితో వాదించాను.. మరొకరి భార్యను బయటకు తీసుకెళ్తే సమస్యలు రావచ్చు కాని. మీ పెద్ద వదిన ఇంట్లో లేరా వాళ్ళని చూసుకుందుకు?”

“ఆవిడ ఇంట్లోనే వుంది కాని వాళ్ళతో మాటల్లో మునిగి పోయారావిడ దాంతో వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత నా భార్య మీద పడింది. అందరు బెంగాలీ కుటుంబాల్లో ఇది సర్వ సాధారణమే. అదీ గాక నా భార్య గురించి మా కుటుంబంలో ఎవరు వేలెత్తి చూపినా నేను సహించలేను”
నీరసించి పోయి నేను మళ్ళీ నా మోటర్‌ బైక్‌ ఎక్కి కమలాక్షు ఇంటి వైపు పోబోతుంటే నా వెనుక నుండి శశాంక “ మా గడియారం సరిగ్గా పని చెయ్యట్లేదు. బహుశా టైమ్ లేదల్లేలా వుంది”

అతని హెచ్చరిక నే చెవిన పెట్టలేదు. యుద్దం గురించి ఉపన్యాసాలు యుద్ధ దృశ్యాలు అయిపోయినా చింత లేదు. కమలాక్ష మంచి అనుచరుడు. అతనో న్యాయవాది, ఇంకా ప్రాక్టీస్‌లో పుంజుకోలేదు. పెళ్ళి కూడా కాలేదు. నాతో సినిమాకి వచ్చేందుకు అతనికెలాంటి అడ్డంకులు కలిగించే వాళ్ళు లేరు. ఓ కుర్తా పైజామా తగిలించుకు రావడమే, అసలు సమస్యల్లా ఇంట్లో ఉంటాడా లేదా అన్నదే? ఇంట్లో ఉన్నాడు. నా ఆర్తనాదం విని బయటకు వచ్చాడు, అతని పని వాణ్ణి పిలిచి నా బైక్‌ సరిగ్గా తీసి పెట్టమని, నన్ను తనే లేవదీశాడు…

“ఏం జరిగింది? మోటర్‌ బైక్‌ ఇంత పిచ్చిగా నడుపుతూ రావలసిన అగత్యం ఏం వచ్చి పడింది? ఈ ముసలి వయసులో కాలు విరగొట్టుకున్నావు. గాయాలయాయా?’ “అవును. విరగొట్టుకున్నాను” విసురుగా అన్నాను. “నిన్ను పట్టుకుందామని వచ్చాను. నీ ఇంటి ముందున్న ఆ స్పీడ్‌ బ్రేకర్‌ లాంటి దిబ్బ ఎక్కబోయి పడ్డాను.. మరీ అంతెత్తున కట్టుకోవడం నేరమే” “ నిజమే అలా కట్టుకోవడం నిజంగా నేరమే? రేపే దాన్ని విరగ్గొట్టిస్తాను కాని నాలాంటి బీదవాడిని వెదుక్కొంటూ రావలసిన అవసరం నీకేమొచ్చింది..?

నీ పెళ్ళాం పుట్టింటికెళ్ళిందా? లేదా ఆమెతో తగువు పడ్డావా?”
“నా విషాద గాధ విని నువ్వేం చేస్తావులే? ఓ రిక్షా పిలిస్తే బాగుండు కద?”

నా భార్య చాలా ఆలస్యంగా వచ్చిందారాత్రి. నేను కప్పుకుని పడుకుని ఉండటంతో “ ఒంట్లో బాగాలేదా?” స్వరంలో ఆత్రుత వ్యక్తపరుస్తూ అడిగింది.
నేనామె ప్రశ్నకు జవాబివ్వకుండా “ఇంత ఆలస్యమయిందేమ్‌”అని అడిగాను ఆమె నవ్వింది- ఓ ఇబ్బంది కరమై నవ్వు. జరగవలసిందాన్ని తప్పించకోవడం మనిషి తరమా?

నేను హరిబాబు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కొత్తల్లుడు మా అందరినీ సినిమాకి తీసుకువెళ్ళే ప్లాన్‌లో ఉన్నాడు. టికెట్లు కూడా తెప్పించాడు. సినిమాకు వెళ్ళేందుకు గేట్‌ వద్ద కార్‌ ఎదురు చూస్తోంది. ముందు నేను రాననే అన్నాను కాని మా ఆంటీ అస్సలు వినలేదు.”

ఆవిడ దర్జాగా హాల్‌లో కూర్చుని బంధుజన పరివారంతో సినిమా చూసే సమయంలో నేను ఇంటింటికీ పిచ్చి కుక్కలా, జేబులో రెండు మొదటి తరగతి టికెట్స్‌ జేబులో పెట్టుకుని మరీ స్నేహితుల వెంట వారి పెళ్ళాలను వెంటేసుకుని నాతో సినిమాకు రమ్మని బలవంతపెడుతూ తిరిగాను.

నా భార్యనుంచి చూపులు తిప్పుకు “సత్యనారాయణ వ్రతం మాటేమిటి?” అని అడిగాను “సత్యనారాయణ గురించి హాస్యమాడటం ఎందుకు?”
“ఆంటీ పూజారి సినిమా చూసేందుకు రాలేదు. తిరిగొచ్చాక పూజ కానిచ్చి ప్రసాదం పుచ్చుకున్నాం.తరువాత అద్భుతమైన విందు ఆటపాటలూ..కొత్త జంట కబుర్లు వినేందుకు సాతు థాకుర్పో పైనించి కిటికి వరకు ఓ తాడు కట్టాడు. అంకుల్‌ అతను తాడు మీద వేళ్ళాడ్డం పసిగట్టాడు. ఇదంతా ఎంత వినోదకరంగా వుండిందనీ?’

ఆమె హృదయం తృప్తి పడేలా వినోదాల వల్లరిని అభివర్ణించింది నా భార్య. ఆమె సుఖసంతోషాల నిలయంగా కనిపించింది. సత్యనారాయణ దీవెనలకు కృతజ్ఞతలు ఆమె వినోదాల వ్యాహ్యాళి చేసి వచ్చింది.

“మరి నా మాటో? నరకంలో ఓ పురుగు. నాకు భక్తీ లేదు. మోక్షమూ లేదు.
దాని కోసం ఆశ పడటమూ లేదు. ఆమె మీద ప్రతీకార వాంఛ లోలోపల పెంచుకున్నందుకు సిగ్గుపడ్డాను.
చీర మార్చుకుని పాన్‌ డబ్బాతో వచ్చి మంచం పట్టి మీద కూర్చుంది.

“మీరు సినిమా కెళ్ళారా?” సౌమ్యంగా అడిగింది.
“వెళ్ళాను “ చెప్పి మరో వైపు తిరిగాను.
“వెళ్ళారా? మంచి పని చేసారు! అప్పట్నించీ పడుకునే ఉన్నారనుకున్నాను. మీరు మరీ బద్దకస్తులు కదా, సినిమా బాగుందా? మంచి సినిమా కదూ!?” చెప్తోందామె.
“అవును” అంటూ దుప్పటిని పసుపు రాసుకున్న నా కాలి మీదకు లాక్కున్నాను.

ఒక అభిప్రాయం »కథలు

One Response to “భక్తి లేదు-ముక్తి లేదు”

  1. 1
    sarveswar Says:

    తెలుగులో మాంగల్య బలం సినిమా ఆశాపూర్ణాదేవి నవల ఆధారంగా అని చదివేను. ఆ రచయితేనా?

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో