చివరి ప్రార్థన

(క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా)
- కృపాకర్ పొనుగోటి మాదిగ

కాలనీలు చర్చీలు మఠాలు ధ్వంసమౌతున్నాయి
ఆడవాళ్ళం చిన్నపిల్లలం సేవకులం చెరల పాలవుతున్నాం
శక్తిహీనులం నెత్తురోడుతున్నాం
సైన్యాలకధిపతియైన దేవా
మా దైన్యాన్ని కనుము
మా ఏడ్పులను వినుము
లూసీపరివార దాడుల నుండి మమ్ములను రక్షింపుము
నీ దాసులము
మేము నీ లోకం చేరే లోగా
మా శత్రువులు మాకు లొంగిపోవాలి లేదా
అదృశ్యం కావాలి
మాకు ఎదురుగా నిలుచు ఏ ఆయుధమూ
వర్ధిల్లదని భరోసా ఇచ్చిన తండ్రీ
అజ్ఞాతంలో ఉన్న దావీదులమైనాము
యోసోబులమై నలిగిపోయాము
సౌలు, ఫరో, మనువు సేనలను ఎదుర్కొనే శక్తి మాకిమ్ము
అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి
బలహీనులకు ఊతమియ్యుడి అనిన ప్రభువా
మమ్ములను శక్తీకరించు
సంఘ బానిసత్వం రద్దు చేసుకుంటాం
భూమ్మీదకు ఖడ్గాన్ని మోసుకొచ్చానే గాని
శాంతి స్థాపనకు రాలేదని సెలవిచ్చిన సామీ
మాకు కొన్ని ఖడ్గాలనిమ్ము
భుజంగ దళాలను
విశ్వహీన పరిషత్తులను
అసాంఘిక పరివారాలను అంతం చేస్తాం
ఇన్నాళ్ళూ నీ వాక్యం
మా పాదాలకు దీపం
మా కళ్ళకు వెలుగు అయితే చాలనుకున్నాం
సరిపోదు ఇప్పుడు మా చేతుల్లో ఆయుధమై మెరవాల
సైతాను క్రియలు సత్తెనాశనం కావాల
సైన్యాల కధిపతియైన దేవా
మాలో ఉన్న నీ రాజ్యం
కాపుదలగా ఆయుధంగా మాకు అందును గాక ఆమెన్‌!

ఒక అభిప్రాయం »కవితలు

ఒక అభిప్రాయం

  1. Lalitha Jun 7, 2009 1

    ఈ కవిత వండర్ ఫుల్ గా ఉంది. రచయిత చాల బాగ రాసారు. అభినందలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో