కొ.కు. వ్యాసం సమాజ నేత్రం

- రామతీర్థ

”అభ్యుదయ సాహిత్యం జీవితం మాదిరిగానే విస్తరించాలి. పరిణామం చెందాలి. మడి కట్టుకుని సంకుచితత్వం అవలంబించరాదు. ఉన్న గోడల్ని పడదొయ్యాలి.కొత్త గోడ లేవదీయరాదు. ప్రజల శక్తుల్ని పెంపొందించాలి. వాటిని బందిలి దొడ్డికి తోలరాదు ఈ ఉద్యమానికి సంఘంతో వున్న అందరు కళాసేవకుల సహకారమూ, అందరు సంస్కారుల సానుభూతి చాల అవసరం. అటువంటి సహకారము, సానుభూతి తప్పక లభించి తీరుతుంది. మా ఉద్యమం అవిచ్ఛిన్నంగా సాగిపోతుంది” - కొడవటిగంటి కుటుంబరావు

తెలుగుతల్లి జనవరి 1946 (కొ.కు. వ్యాస ప్రపంచం.5 సాహిత్య వ్యాసాలు.పీ.289) ఇరవై ఒకటో శతాబ్దం ఇంకా ఆరంభ దశకంలోనే వుంది. దీని ప్రభావశీలత ముందు ముందు ప్రపంచ సమాజాలపై ఎలావుటుందీ అనేది ఇంకా ఉహల్లోని విషయమే. ఇంతవరకూ అందిన శతాబ్దంలో మనమూ, మన ముందరి తరాల వారు జీవించారన్న విషయం ఒక్క దాని కోసమే కాదుగానీ చరిత్రను వివేచించినా ఇరవైయో శతాబ్దం కీలకమైనది.

గతశతాబ్దం శాస్త్రీయ ఆవిష్కరణల పరంగా, సామాజిక మూర్పుల పరంగా, రాజకీయ కార్యాచరణ పరంగా, ప్రజల భాగస్వామ్యం పరంగా, స్వాతంత్య్ర ఉద్యమాలు పలు ఖండాల్లో ఊతం అందుకుని చెప్పుకోదగ్గ మార్పులు సాధించిన దృష్ట్యా, సమాచార స్రవంతి వేగం పుంజుకుని, ప్రపంచం మొత్తాన్ని ఒక ఎలక్ట్రానిక్‌ కుగ్రామం చేయడం దృష్ట్యా, ఈ శతాబ్దం అందించినన్ని ఊపిరి సలపని పరిణామాలు, అంతకు ముందు శతాబ్దంలో లేవు అన్నది స్పష్టం.

మార్పులకు లోనవుతున్న సమాజాలలో రచయితలు సైతం తమ దృష్టిని మరింతగా పెంపొందించి, రాశి, వాసిలా కొత్త ఎత్తులకు ఎదిగి భావ ప్రసార వేగాన్ని అద్భుతంగా సాధించన శతాబ్దమది. తెలుగు సాహిత్యాన్ని ఒక పరిమాణ రాశిగా తీసుకుంటే, అంతకు ముందు శతాబ్దంలో అడపా దడపా రాయబడుతూ, మొత్తం సమాజం తరపున కొందరి నమోదు రచనలలోంచి మాత్రమే ఆయా కాలాల సమాజాన్ని దర్శించే ఇరుకైన అవకాశం వుండింది.

గత శతాబ్దంలో సకల సామాజిక పరిణామాలకు ప్రజలే నిర్ణాయక శక్తులు వారి పూనిక, భాగస్వామ్యం, సాహిత్యంలో సైతం రచన దంతపు మేడలు దిగి, ప్రజాపరం అయిన దృశ్యాన్ని మనకందిస్తుంది. ఇరవయ్యో శతాబ్దంలో ఒక్క తెలుగు సమాజాన్నే తీసుకున్నా, ఈ నూరేళ్ళ కాలంలో వచ్చినంతమంది రచయితలు అంతకు ముందరి ఏ శతాబ్ధిలోనూ రాలేదు.

సమాజ ప్రతిఫలనమే సాహిత్య రూపం కాబట్టి విషయ గాఢత, ఇతివృత్త సంక్లిష్టతా సైతం ఉత్తమ రచయితలకు ముఖ్య లక్షణంగా నిలిచాయి. వ్యాసం అసలు సాహిత్యం అవునా కాదా అనే చర్చ చాలా సార్లు జరిగిందనీ, కేవలం కల్పనా రచన మాత్రమే కాకా వ్యాసం కూడా కాల్పనికేతర రచనారూపంగా సాహిత్యమే అని అంగీకారం కుదిరిందనీ, అయితే శ్రీ శ్రీ మొదలగు వారు సాహిత్యాంశాలపై వ్యాసాలు రాసినా, సమాజపు అనేక అంశాలపై వ్యాసాలు రచించి కొ.కు. వ్యాసానికి సాహిత్యంగా వున్న గుర్తింపును విస్తృతం చేయగలిగాడనీ విరసం నిర్వాహక ముఖ్యులు చలసాని ప్రసాద్‌ ఇటీవల అన్నారు.

ఏడు వందల యాబై పేజీలకు పైగా విస్తరించి వున్న కొ.కు. వ్యాస ప్రపంచం-5 సాహిత్యవ్యాసాలు, పన్నెండు భాగాలకు పైగా, సాహిత్య రంగంపై కొ.కు. నమోదు చేసిన ఆలోచనల్ని మనకు పరిచయం చేస్తుంది. భాష, సాహిత్య వేత్తలు, నేనూ- నా రచనలూ, సాహిత్య రూపం,సాహిత్య సారం, సాహిత్య విమర్శ, లేఖలు, ప్రవక్త పరిచయం, పుస్తక సమీక్ష, బాలల సాహిత్యం, సాహిత్యంతో రాజకీయాలు, సాహిత్య ఉద్యమాలు, అనీ పన్నెండు విభాగాలుగా సంకలించిన శ్రీ చలసాని ప్రసాద్‌, శ్రీమతి కృష్ణాబాయి గార్లతో రెండు ఇష్టాగోష్టులు అనుబంధంగా, వెలువరించారు విరసం మే, 2008లో. పాశ్చాత్య సాహిత్యంలో బెర్ట్రాండ్‌ రస్సెల్‌ రాసినంత విషయ విస్తృతితో కొ.కు. ఇతర వ్యాస రచనలు సైన్సు వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, సినిమా వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, తాత్విక వ్యాసాలు వెలువరించి తన సమకాలీన ప్రగతీ శీలతను, కాల్పనికేతర రచనలలో బలంగా ప్రతిపాదించగలిగారు.

సాహిత్య వ్యాసాలు విభాగం ఏడు వందల పేజీలూ చదివతే కొ.కు. మేధానైశిత్యం మనకు అవగాహనకొస్తుంది. అనేక సామాజిక అంశాలపై రచయితలు, సమాజ చింతన గల మేధావులు ఎలా ఆలోచించడం వలన వారి పాత్ర సమాజ గమనంలో మరింత ప్రభావశీలమవుతుందో ఈ తరం పాఠకులు, రచయితలు గ్రహించగలిగే భావ సమగ్రత గలది కొ.కు. సాహిత్య వ్యాసాలు సంపుటం.

కన్యాశుల్కం పై నోట్సుగా నలభై ఆరు పేజీల వ్యాసం సాహిత్య వేత్తలు విభాగంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక రచనను దాని పాత్రల పరంగా, అది జీవిస్తున్న సాంఘిక నేపధ్యపు అవగాహనతో, ఒక తర్కాన్వయంతో ఎలా చదవాలో, ఈతరం నేర్చుకోగలిగే అద్భుత అవకాశం తను జీవిస్తున సమాజంలో పట్టించుకోదగిన సాహిత్య పరిణామాలన్నిటినీ తన వ్యాసంలో, స్పందనలతో, సమీక్షలతో లేఖల్లో పట్టించుకునే తత్వం, ఈ కాలం వారికి కొత్తయిన ఒక జీవిత కాలపు సాహిత్య రంగ కేంద్ర పాత్రను, కార్యాచరణను ఎలా కొ.కు. తన క్రమశిక్షణలోకి రంగరించుకున్నారో తెలుపుతుంది.

సాహిత్య విమర్శ, విషయ విశాలతను కోల్పోయి, అనేక మూసల్లో పోసి ఇవాళ పొగడ్తలు గానో, సాహిత్యేతర విషయలపై ఆధారిత తెగడ్త గానో, పుట్టుక, ప్రాంతం, కులం, ప్రధాన విషయాలుగా, సాహిత్య లక్షణం లోపించినా, దాన్ని పట్టించుకో అక్కరలేదని భావించే వారి చేతుల్లో, ఇంకా పెద్ద గొంతుల్లో సాగే రూప ఆధిక్యవాదపు హోరులో, వుండడం చూస్తున్న వారికి కొ.కు. కాలపు నిర్మాణ దృష్టి, నిజాయితీ అయిన భావప్రకటన, ప్రస్తుతం అందని వస్తువు వలెనే తోస్తుంది.

కొ.కు. సాహిత్యంలో విశాల ప్రజాస్వామ్య తత్వానికి ప్రతినిధి. ఒక మహా వామపక్ష విశ్వాసం వున్నా అది వారి ఆలోచన్లో కలగలిపి పోయి అవసరమైన పాత్రనే పోషించింది తప్ప, ఒక విశ్వాస నినాదంగా తనకే ప్రత్యేక ప్రతిపత్తినీ కోరలేదు. ఈ మౌలిక ప్రజాస్వామిక స్పృహ లోపించినపుడే సాహిత్యం కుంచించుకుపోయిన ప్రయోజనాల కోసం, భిన్న భిన్న వర్గాల అవగాహన ప్రతీకలా , ప్రజల చీలిపోయిన వాస్తవికతను మరింతగా ప్రమాదపు అంచుకు నెట్టే ప్రయత్నం చేసే వారికి ప్రాముఖ్యతను ఇస్తుంది.

ప్రాచీన భాష అనే స్థితి, హోదా పట్ల కొ.కు. ”భాష” పేరిట రాసిన తొమ్మిది వ్యాసాలూ, (ఇవి 1938 నుంచీ 1976 వరకూ నాలుగు దశాబ్దాలలో వేర్వేరు సామాజిక దశల్లో రాయబడినవి), ఇవాళ మనం ఆలోచిస్తున్న విధానంపై తప్పక ఎన్నో ప్రశ్నలు రేపుతాయి . వాటికి కొన్ని సమాధానాలు వెతుక్కోగలిగితే. ఇవాళ కూడా మనకు ఈ విషయమై ఎంతో స్పష్టత ఏర్పడుతుంది. భాషల మధ్య సహజీవనాన్ని, వ్యావహారిక భాషలు జాతీయ భాషగా ఏర్పడే క్రమాన్ని ఈ వ్యాసాలలో కొ.కు. చర్చించిన తీరు ఆలోచనలు రెకెత్తిస్తుంది.

ఏ భాషా సమాజానికైనా భాష ఒక వ్యక్తీకరణ పనిముట్టు కొంత పరిష్కరింపబడి, ఆ భాష వారందరికీ అర్థమయ్యేలా వుండేది ‘శిష్ట’ లేదా (ఈ మాట పడనివారికి) విశాల జనామోదం గలిగి, విషయం నలుగురికీ తెలిసేలా చేసేందుకు, ఉపయోగ పడే భాషను నిర్మించుకోవడం ఒక తప్పనిసరి క్రమం. మాండలికాలు, ఆమోద యోగ్య వ్యవహారికం పట్ల కొ.కు. ఆలోచనలు ఈ సమస్యనెలా అర్థం చేసుకోవాలో తెలుపుతాయి. మన ఒకానొక సందర్భ ఆవేశకావేశాలకు అనుగుణంగా భాషా పరిణామం ఉండదు అని కొ.కు. వ్యాసాలు స్పష్టం చేస్తాయి.

ఏ రచయితయినా తన పూర్వ రచయితల జీవలక్షణాలకూ, తన సమకాలీన సాహిత్య వైవిధ్యతకూ, తోటి రచయితలపై తన నిఖార్సయిన అభిప్రాయాలకూ, ఆ సాహిత్యక్షేత్రంలో తనకంటూ ఒక గుర్తింపును పొందుతాడు. కొ.కు. ఎందుకు అటువంటి ప్రత్యేక స్థానానికి అర్హుడో కొంచెంలో అయినా సాహిత్య వ్యాసాలు అనే ఈ బృహత్‌ సంపుటి తెలుపుతుంది.

ప్రస్తుతకాలంలో వ్యాపార వర్గాల రచయితగానో, రూపాధారిత అల్పాయుష్షు ఉద్యమాలకు స్వయం ప్రకృతి నాయకులు, సృష్టి కర్తలు గానో, తమతమ కూటములకు, శిబిరాలకు ఆధిపత్య భ్రమలుగల మూక మనస్తత్వంతోనో కాక, నిజమైన ప్రజాపక్షపాతి అయిన రచయిత ఎంత విస్తార అధ్యయనాన్ని కలిగివుంటే తప్ప, తాను చెప్పదలుచుకున్నది కాలానికి నిలబడదన్న సత్యం. కొ.కు. సాహిత్య కృషినుంచి, అధ్యయన శీలతనుంచి ఈ తరం రచయితలు నేర్చుకోవడం, ఒక ముఖ్యావసరం ఇవాళ. కొ.కు. శతజయంతి సందర్భంగా, ఈ ఏడాది, మనం ఈ సాహిత్య మహోపాధ్యాయుడినుంచి నేర్చుకోవాల్సిన మెలకువలు ఎన్నో వున్నాయి. వారికి నివాళి.

సాహిత్యానికి ఒక నిర్దేశక, నిర్ణాయిక పాత్రను కొ.కు. దర్శించారు. ఇవాళ తృతీయ సహస్రంలో దృశ్య మాధ్యమాల, ఇతరేతర హంగుల వరద శాసిస్తున్న తీరు ఎలాంటిదో కొ.కు. పూర్తిగా దర్శించకుండానే- ఏం జరుగుతున్నదో చిత్రించిన తీరు గమనార్హం.

”చదువుకున్న వాళ్ళు సైతం బుర్రలకు సెలవిచ్చి, పంచేంద్రియాలకు ప్రాధాన్యం యిస్తున్నారు. ఈ విషయం అన్ని కళలోను రుజువవుతున్నది. కంటికింపుగా ఉండే సినిమా తెరకు నటనా సామర్థ్యం లేకపోయినా ప్రజారాధన లభిస్తున్నది. లోపల తుక్కూ, ధూగరా వున్నా అందంగా అచ్చువేసిన పత్రికకు అమ్మకం బాగుంటున్నది. మాక్స్‌ ఫాక్టరు మేకప్‌ సామాను, జాన్‌ కిడ్స్‌ అచ్చు సిరాలు,త్రివర్ణ చిత్రాలను అచ్చువేసే యంత్రాలు, అందంగా ఫోటో తీసే కెమెరాలు, మన కళలకు శాసన కర్తలై పోయాయి. ప్రాణ చైతన్యమూ, భావ చైతన్యమూ గల మానవుడు మన కళలను నడిపించడం మానేశారు. ఆ పని యంత్రాలు పుచ్చుకున్నాయి. ఆ వెంటే మన కళల నుంచి జీవం కూడా నిష్క్రమించింది.

సాహిత్యాన్ని గురించి ఇటువంటి వైఖరి గల మనం జీవితాన్ని అవగాహన చేసుకోగలమనేది వట్టి భ్రమ. ఈ భ్రమ నుంచి బయట పడ్డనాడు మనం సాహిత్యభిలాష తెచ్చుకోగలుగుతాం. తిరిగి సాహిత్యం ఒక ఉద్యమం చేసుకోగలుగుతాం. అది ఎప్పటికైనా ఉన్నతమైన అభిరుచులు గల వారి ద్వారానే సాగాలి కాని తుఛ్ఛమైన అభిరుచులకు లొంగిపోయి అలుకు గుడ్డల్లాంటి పత్రికల పఠనంతా మైమరచి ఓలలాడే దౌర్భాగ్యం వల్ల ఒక్కనాటికే సాధ్యం కాదు.” అన్నారు కొ.కు. అరవై ఏళ్ళ క్రితమే 1949లో. ఇది ఈ నాటికీ మనం ఎదుర్కుంటున్న పరిస్థితే. ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి అన్వేషణ, యాత్ర వారి నుంచి మన తరంలో స్వీకరించి ముందుకు నడవడం కన్నా కొ.కు.కు వెచ్చని స్మృతి పాలన ఇంకేం ఈయగలం?

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో