మా తొవ్వ మేం నడుస్తం

- సిద్దెంకి గిరి

మతిల కుటీల్లం యిప్పరాకుంట తిప్పలు వెడితె
కిర్రు చెప్పులు తయారు చేసే మా బతుకు చెప్పరాకుంటైంది
ముడిసినమని మురిసినమో లోదో ముడుసుల మీద తంతే
నోరు మూసుకొని దగ్గరికి ముడుసుకున్నం
ఎవలకు చెప్పిన ఏం లేదని మా తప్పనుకున్నం
ఎతలు ఎల్లిపారుతూ మనసు కుతకుత ఉడికితే
ఎగిల్లివారంగ మోటగొట్టిన ఏతం బొక్కెన పాట ఏం చెప్పుతది
జాలువారిన సెమట సుక్కల పంట
కడుపుల ఆకలి మంటలు లేపితే
పోరగండ్లకు గంజి పోసి కన్నీళ్ళు మింగినం
మాయితనం జేస్తే మమ్ముల ముంచిండ్రని
గాయికి ఎత్తుకొని కోపానికి రాక కొట్లాటకు పోలేదు
ఒర్రేపేగులకి బిర్రుగ ఉరివెట్టి గోడకు ఒరిగి కూసుండి
సల్లటి సెమటలు పుట్టంగా నెత్తురు పాలతో పిల్లలకు సాదుకున్నం
ఎగురుకుంట డప్పుకొడుతూ దుఖాన్ని దిగ(తాగినం) మింగినం
వంతుకు వరిగంజి తీగి గజ్జెకట్టి గంతేసిన దెబ్బకు గొంతొస్తదా
జబ్బకు దప్పు చేతుల సిర్ర సిటికిన పుల్ల ఊరంత బొబ్బ
ఈలవేస్తు కంటితో ఆందుకున్న రూపాయిలోటు
నొసటితో ఏరుకున్న ఆటాన బిల్ల
ముట్టుడైన పుల్‌కాశి తనమ్ముందు పనికిరాకుంటైనందుకు
యిషం బెట్టుకొని యిమరస చేయలేదు
లంచం తీసుకొని లపూట్ల మాటలు మాట్లాడలేదు
మా బతుకులు యింతే అనుకున్నంగని యింకోగని తెరువువోలే..
చెప్పురాకుండ తిడితె పడ్డం చెప్పుతో తంతె పడ్డం
ఎక్కిరిస్తే పడ్డం హేళన చేస్తే పడ్డం
మా మంచితనాన్ని ఆసరచేసుకుని ముంచాలనుకుంటే
దుమ్ము దులుపుతం ఎద్దుకొమ్ముల మిగ్గుతీస్తం కత్తి ఆరెనూరుతం
ఎక్కడకి అక్కడకి కోసి తిత్తి తీస్తం గుత్తలకు గుత్తులే పీకుతం
దొబ్బలు కోసి కార్జాలు గుంజి తస్సలు ఒలుస్తం తునుకలు ఆరేస్తం
అనుకల గుద్ది ఎములు యిరిసి మండెల రాస్తం
మాకడ్డమొస్తే ఆయింత లేకుంట జేస్తం
మా తొవ్వ మేమునడుస్తం మావొల్ల నడిపించుకుంటం
మా వొతను నిలబెట్టుకుంటం మా హక్కులు కాపాడుకుంటం

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “మా తొవ్వ మేం నడుస్తం”

  1. 1
    ప్రాణహిత » జనవరి 2009 సూచిక Says:

    [...] మా తొవ్వ మేం నడుస్తం : సిద్దెంకి గిరి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో