నిరంతర సత్యాన్వేషి మహేంద్ర

- కె.యన్‌.పలమనేరు బాలాజి

ఒక వ్యక్తి తన లక్ష్య సాధనకై అంకిత భావంతో చేసిన కృషి ఫలించి సాధన అనంతర ఫలితాలు వెలుగు చూసే లోపు అతడి జీవితం ముగిసి పోవడం అంతటి విషాదం చరిత్రలో మరొకటి లేదు. గడిచిన చరిత్రలో మిగిలిన విషాదస్మృతుల వరుసలో ఇప్పుడు చేరిన విషాదకరమైన అంశం కథారచయిత మహేంద్ర మరణం.

కొన్ని అరుదైన కథలతో తెలుగు కథా చరిత్రలో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్న మహేంద్ర 1998 జూన్‌ 11వ తేది ఉదయం గం 5-10 ని|| కు సెరిబ్రల్‌ ఫీవర్‌ తో వేలూరు సి.యం.సి. ఆస్పత్రిలో మరణించాడు.

మహేంద్ర తండ్రి మధురాంతకం రాజారాం అన్న మధురాంతకం నరేంద్ర, ఇద్దరూ ప్రముఖ కధారచయితలే అయినప్పటికీ తన పేరు ముందే కాదు, తన రచనల్లో సైతం వారసత్వ ప్రభావం లేకుండా నిరంతరం ప్రయత్నించిన స్వయం కృషీవలుడు మహేంద్ర.

16-7-1959న జన్మించిన మహేంద్ర తన ముప్పైఎనిమిది సంవత్సరాల పదినెలల జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ కాలం తెలుగు కథారంగంలో విశేషమైన కృషి చేసారు. మహేంద్ర రాసిన మొదటి కథ ”కనిపించని కోయిల” (భారతి 1979). చివరి కథ ‘వ్రతం’ (ఇండియాటుడే, జూన్‌ 1995), తను రాసిన ఒకే నవల ”స్వర్గసీమకు స్వాగతం” (ఆంధ్రజ్యోతి వార పత్రిక సీరియల్‌)ను తాను స్వయంగా గీచిన చిత్రాలతో ప్రచురించి వాళ్ళ నాన్న గారికి అంకితమిచ్చారు అదే నవల ఎన్‌.బి.టి. ద్వారా పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది.

మహేంద్ర రాసిన మరికొన్ని మంచి కథలు ”జరై ఇంధనం, హంగావేకల్‌, ముసలమ్మ, పాడి ఆవు, కుక్క చావు, గౌళి, బేసిన్‌ బ్రిడ్జి దగ్గర, ఈత, ప్రతిజ్ఞ, అతడిపేరు మనిషి, ఒక పగటి వేళ యిరానీ హోటల్లో”

నదిని, నాగరికతని ప్రేమించిన మహేంద్ర చదివింది. యం.యస్‌.సి. ఫిజిక్స్‌ అయినప్పటికీ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టం. చేస్తుంది బ్యాంకు మేనేజరు వృత్తి కన్నా తన సాహిత్య వ్యాపకం అంటేనే తనకు చాలా గౌరవం. రాయలసీమ దయనీయ స్ధితికి గల కారణాలను అన్వేషించే అవకాశం, రైతుకు, నీటికి, అప్పుకు గల సంబంధాన్ని లోతుగా పరిశీలించగలిగే అవకాశం వృత్తిరీత్యా మహేంద్రకు కలిగింది.

మహేంద్ర స్వయంగా చిత్రకారుడు కావటం వల్ల ప్రతి సున్నితమైన అంశాన్ని సునిశితంగా పరిశీలించి దృశ్యం కనిపించేటట్లు, సంభాషణ వినిపించేటట్లుగా అద్భుతమైన కథా చిత్రం చేయగలగాడు ”హోంగిచేకల్‌, ఇంధనంగొళి” కథలు ఇందుకు ఉదాహరణలు

నీళ్ళే నాగరికతగా పేరు గాంచిన రాయలసీమలోని నీటి సమస్యని, తద్వారా మానవ సంబంధాలలో ఏర్పడే మార్పుల్ని ” కనిపించని కోయిల, ప్రతిజ్ఞ, స్వర్ణసీమకు స్వాగతం, ముసలమ్మ మరణం, వ్రతం, చేసిన్‌ బ్రిడ్జి దగ్గర” కథల్లో సహజంగా చిత్రీకరించాడు. కాలంతో పాటూ పరుగిడుతూ కూడా నిశ్చింతగా, నిర్మలంగా, నిర్భయంగా నిలబడగలిగి ”సత్యాన్ని” చూడటానికి ‘తాత్విక దృష్టి’ కావాలి ఈ దృష్టి ఉంది కాబట్టి మహేంద్ర కథలు, పాత్రలు, సంఘటనలు కాలంతో నిమిత్తం లేకుండా పాఠకుల్ని వెంటాడుతూ ఉంటాయి.

కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కొత్త విషయాలు తెలుసుకోవటం మహేంద్రకు చాలా ఇష్టం. జరిగిపోయిన లేదా జరుగుతున్న అనేకానేక విషయాలకు సంబంధించి మహేంద్ర సత్యాన్వేషణ సాగించేవాడు. కథా రచనను మహేంద్ర ఆషామాషీగా తీసుకోలేదు. అతడి కథలు వైవిధ్యాన్ని కలిగి వుంటాయి. కథా రచనలో మహేంద్రకు గల ఏకాగ్రత, నిబద్దత, నిమగ్నత ఆశ్చర్యం కలిగిస్తాయి. మహేంద్ర జీవితంలాగే. అతడి చాలా కథలు విషాదాంతాలు.
నలభై సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా, రాయాల్సిన ఎన్నో మంచి కథల్ని రాయకుండానే, ఒక్క కథా సంపుటి కూడా వేసుకోకుండానే, రాస్తున్న నవల పూర్తి కాకుండానే హఠాత్తుగా మహేంద్ర మరణించటం విషాదకరం.తెలుగు కథా భవిష్యత్‌ పట్ల గొప్ప నమ్మకాన్ని కలిగించిన ఉత్తమ కథకుడి మరణంతో తెలుగుకథ చిన్నబోయింది.

రచయితగా మహేంద్ర సాధించిన పరిణతికి అతడి చివరి రచనే కొలబద్ద. తన కథా విధానం వివరిస్తూ రాసిన వ్యాసం అతడి మరణానంతరం ఆదివారం ఆంధ్రజ్యోతిలో (21జూన్‌’98) ప్రచురింపబడింది. ఈ వ్యాసంలో కథా నిర్మాణానికి సంబంధించి మహేంద్ర అభిప్రాయాలను గమనిద్దాం.

”సాధారణ జీవితానుభవం సాహిత్యరూపంగా మారే క్రమంలో ఏది చెప్పాలి (సెలక్షన్‌), ఎంత చెప్పాలి (ప్రపోర్షన్‌), ఎక్కడ దేన్ని కుదించి దేన్ని విస్తరించాలి (అప్రవల్స్‌) అనేవి రచయిత తనకు తాను సాధన ద్వారా పొందిన పరిణతికి లేదా గురైన పరిమితికి గుర్తుగా రచన మిగులుతుంది. ఇదంతా చాలా మట్టుకు భూమి మీది నుంచి అమాంతంగా ఆకాశంలోకి లేచే గోపుర నిర్మాణాల్లా కాక సహజ సిద్ద పర్వతాలను తొలిచి ఏర్పడ్డ అజంతా గుహల్లా, వున్న దానినుంచీ కొంత పరిహరించడం వల్ల ఏర్పడుతున్న కళారూపాల్లా అనిపిస్తుంది”

మానవుని జీవితంలో సంభవించే ఆనందం, విషాదాల మధ్య వ్యవధి లేనితనాన్ని తాత్విక దృష్టితో పరిశీలించిన విశిష్టమైన కథ ” హొగినేకల్‌”. సుందరమైన జలపాత దర్శనం కోసం సంతోషంగా బయలుదేరిన ఒక కుటుంబం అదే జలపాతంలో తమకు ప్రాణమైన ఒక చిన్నారి పాపను పోగొట్టుకుని విషాదంతో తిరుగు ప్రయాణం అవటం ఇందులోని కథాంశం. మొత్తం జీవితాన్ని సంతోషంగా, సుఖంగా గడపాలనుకునే మానవుడి తాపత్రయాన్ని, ఆ ప్రయత్నంలో సంభవించే విషాదకరమైన పరిణామాల్ని, సుఖ దు:ఖాల పట్ల మానవుడిప్రతిస్పందనని సమర్థవంతంగా చిత్రించడం జరిగింది. మానవుడి అంతరంగాన్ని అనుసరించి ఒకే దృశ్యం వేరువేరుగా గోచరించటాన్ని రచయిత మాటల్లోనే చదవాలి.

”బేసిన్‌ బ్రిడ్జి దగ్గర” కథలో అయిన కాడికి అప్పు చేసి పల్లె విడిచి పట్నం చేరి అప్పు సంగతి మరచిపోయిన చంద్రయ్య దగ్గర్నుండి అప్పు వసూలు చేసుకునే నెపంతో అతని పొలాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో పల్లెనుండీ మద్రాసు మహానగరంలోకి అడుగుపెట్టిన మోతుబరి మునుస్వామి నాయుడు నగరంలోని మురికి, ఇరుగు జీవితాల్లోకి తొంగి చూసివస్తాడు. పల్లెలో జీవితం ఎంత దారుణంగా ఉందో తలుచుకుని నాయుడు భయపడతాడు. కథ చదివాక పేరు తెలియని భయం మనల్ని కమ్ముకుంటుంది.

అనేక సంఘర్షణలను మిళితం చేస్తూ వచ్చిన కథలలో ”ఇంధనం” ప్రసిద్ధమైనది. అరుణాచలం అనే రోగిష్టి అనాధ రైల్వే స్టేషనులో బ్రతకటానికి పడిన తాపత్రయం, చివరికతడు మరణించిన విధానం, ఇంధనం కొరత మొదలైన పలు సమస్యలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ కథాంశం
మానవ జీవితంపై అధికారం ఎవరిదనే ప్రశ్నతో కథ ముగిసినా, పాఠకుల ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది.

మొదట ఈత నేర్చుకోవటానికి భయపడే పిల్లలే ఆ తర్వాత గంటల తరబడి లోతైన బావులు, చెరువుల్లో ‘ఈత’ గొడుతూ చూపరులకు భయాన్ని కలిగిస్తారు. ఈత రాని కారణంగా ప్రమాదవశాత్తు మరణాలు సంభవించడం పల్లెల్లో జరిగే విషయమే. మూడో తరగతి చదివే సుబ్రమణ్యం వాళ్లమ్మ బట్టలు ఉతుకుతూ కాలుజారి బావిలో పడి మరణిస్తుంది. పిల్లాడికి ‘ఈత’ అంటే విపరీతమైన భయం పిల్లాడికి ఈత ఎలాగైనా నేర్పాలని వాడి తాత చేసే ప్రయత్నాలు ఫలించవు.

ఎనుములు ఈత గొడ్తున్న దృశ్యాన్ని చూసి పిల్లాడు అడిగిన ప్రశ్నకు ఒక ముసలివాడిచ్చిన సమాధానంలోని జీవన లయని గమనించండి.
”పశువులకు ఈత ఒకరు నేర్పించపనిలేదు. చేపలకు కప్పలకు ఈత ఒకరు నేర్పించాలా? గువ్వలకు రెక్కలు కట్టుకుని ఎగరమని ఒకరు నేర్పించాలనా..? ధయిర్నం కావాల. ధైర్నముంటే ఇదే కాయం బెండు మాదిరి తేలిపోతాది. లేకపోతే బండ మాదిరి మునిగిపోతాది.”
సుబ్రమణ్యం ఈత నేర్చుకోవటమే ‘ఈత’ కథ.

ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు నిజంగా ఎవరికి, ఎలా, ఎందుకు చేరుతున్నాయో చెబుతూ సహాయం చేయాలనుకునే అధికారులకే నిరుపేద సహకరించలేని దారుణమైన పరిస్థితిని వివరించిన కథ ‘పాడి ఆవు ఒక పల్లెలో దొంగ కుక్కగా పేరు తెచ్చుకున్న ఒక కుక్క చనిపోయినపుడు ఊరు ఊరంతా కదిలిన దృశ్యమే ‘కుక్క చావు’ కథ.

అంటరాని తనమంటూ ఏదీలేదని, సహాయం చేసి మనిషికి కృతజ్ఞత చూపడం అంటే ఏమిటో, ఎలాగో చెప్పిన కథ ‘అతని పేరు మనిషి’
ఆంధ్రజ్యోతి వార పత్రికలో (1992)బహుమతిని పలువురి ప్రశంసలను పొందిన కథ ”జర్తె” అదేవూళ్ళో వుండే జారుడు బండ (జర్తె) అడవుల్లో ఉండే జారుడు బండ(జర్తె)పైనుండి ఫారెస్టోళ్ళకు భయపడి, జారిపడి చనిపోయిన గురుసామి అంత క్రితం ఎల్లమ్మను వేటాడిన వైనం, బలహీనులపై బలాన్ని ప్రయోగించే వేటగాళ్ళతో నిండిన సమాజం, వీటన్నింటి చిత్రణే ఈ కథ..

మనిషి జీవితం డబ్బుతో, అప్పుతో ఎంతగా ముడిపడి వుంటుందో చెబుతూ, చేసిన అప్పు ఎలాగైనా అణాపైసలతో సహా తీర్చేయాలని ఒక ముసలివాడు చేసే పోరాటాన్ని ”వ్రతం” కథ వివరిస్తుంది. ” మాట నమ్మకం మీద బతుకు..నీకు నమ్మకమైన బతుకు జరగతాదని”చెప్పిన పెద్దాయన మాటలు ఏ పాఠకుడైనా మరిచిపోగలడా? ఐ.పీలు బాంబుల్లా పేలుతున్న సమయంలో అందరం ఆలోచించాల్సిన విషయం ఈ కథాంశం.

బోర్‌ పేరుతో ప్రస్తుతం నుండి పారిపోతున్న యువతరం చదివి తీరాల్సిన కథ ‘ఒక పగటి వేళ -ఇరానీ హోటల్లో” ఎనిమిది గంటల పాటు హోటల్లో తన కోసం ఎదురుచూసిన స్నేహితుడి కోసం ఐదు నిమిషాలు నిల్చోవడాన్ని బోర్‌గా ఫీలయిన స్నేహితురాలితో కథా నాయకుడిట్లా అంటాడు.
” నువ్వు తిరుపతి నుంచి విజయవాడకెళ్లడానికి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కావనుకో…ఎక్కిన క్షణంలోనే విజయవాడ వచ్చేస్తే యింత దూరం వెళ్ళే అనుభవం నీకక్కర్లేదా? విజయవాడకు, తిరుపతికి మధ్య గల దూరానికొక అస్తిత్వం అవసరం లేదా? అనుకున్నది తక్షణంలో జరిగిపోతే జీవితం పూర్తవడానికి ఒక సెకను కూడా అవసరం లేదు…ఏ జీవితానికైనా చివర ఉన్నది మృత్యువే.కాదన్ను. కానీ జీవిత లక్ష్యం మరణం కాదు- జీవితం అంటే గమ్యం కాదు… గమ్యం కోసం చేసే ప్రయాణం”

శరీరానికి ఏ కష్టమూ లేకుండా యాచన చేసే వాళ్లకు , ఏదో బల్లి శాస్త్రాన్నో మరొక దాన్నో భుజాన వేసుకుని జనాలకు చెప్పుకుంటూ కాలం గడిపే వాళ్లకు ”గౌళి” కథలో వీరాస్వామి మాటలు చెంపదెబ్బ లాంటివి.

“శాస్తరాలు, జాతకాలు మనిషికి తిండిబెట్టవు ప్రాణాలు బొయ్యవు. ఒడ్లు పుట్టీవు.తెలుసుకో. దేనికయినా కండల్లో బలముండాలి. మనసులో దిమాకుండాలి…సెమటోడ్చి పని చెయ్యాల”

రాయలసీమ రైతు బాగుపడినా, చెడిపోయినా బావి మూలంగానే జరుగుతుంది. బావి తవ్వి నీటి జాడ లేక అప్పుల్లో కూరుకుపోయి బికారిగా మారే రైతు కథ” ప్రతిజ్ఞ” ఆకలి కారణంగా మనిషి మరిచిపోయే విలువల కథ ఇది.

ఎంతటి పేదరికంలో అయినా పల్లె బాగుకోసం అనుక్షణం తపన పడిన ఓ రాయలసీమ గ్రామీణ యువతి కథే ‘ముసలమ్మ మరణం”.
మహేంద్ర రాసిన కథలు, కధా నేపథ్యం పుస్తక రూపంలో త్వరలో రానుంది..అరుదైన కథలను రాసిన మహేంద్ర ”మంచిని కలుగజేయడానికి, సత్యాన్ని తెలియజెయ్యడానికి ప్రయత్నించేది సత్యాహితమేగా మిగులుతుందని నమ్మినవాడు..

మహేంద్ర కథలపై చర్చ జరగాల్సి ఉంది. అంతే కాదు..ఈ అరుదైన కథల్ని ఇతర భాషల్లోకి అనువదించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ ప్రయత్నాన్ని త్వరగా ప్రారంభించవలసిందిగా సహృదయులను కోరుతున్నాను..

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “నిరంతర సత్యాన్వేషి మహేంద్ర”

  1. 1
    ప్రాణహిత » జనవరి 2009 సూచిక Says:

    [...] నిరంతర సత్యాన్వేషి మహేంద్ర : కె.యన్‌.పలమనేరు బాలాజి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో