పిచ్చి తల్లి

- సలీం

పసితనంలో బువ్వ తిన్పిస్తూ
అమ్మ ఆకాశం వైపుకు చూపిస్తూ
‘అదుగో చందమామా’ అన్నట్లు గుర్తు
కదిలే చందమామ కావాలని
కన్నీళ్ళ కెరటమై తడిసి ముద్దయిపోతే
అమ్మ విమానాన్ని చూపించిన గుర్తు
నక్షత్రాల్ని మోసుకెళ్ళే నావ కదా విమానం
మాట వినక మారాం చేస్తే
ఈపు ఇమానం మోతే
మేఘాల్లో మెలిక పడిన పతంగ్‌ కదా విమానం
బల్కంపేట వంతెన మీద
సాయంత్రానికల్లా వాలిపోయిన పక్షులం
తిరునాళ్ళ సందడి
తొంభై ఆమడలు ఒక్కంగలో దాటే
తోకున్న లోహ పిట్టల
వేగ విన్యాసం
పక్షి రెక్కలు టపటపలాడించి ఎగిరినట్లు
చలాగ్గా గాల్లో ఈదులాడే మరపడవ
గురుత్వాకర్షణ గుండు మీద మొట్టికాయ
గగనతలం మీద గరుడవాహన సేవ
విహాయసంలో హసించే లోహ విహంగం
వినువీధుల్లో విహరించే ఇంద్ర రధం
గట్టు మీద నిలబడి చూపుల వల విసిర్తే చాలు
రెండో మూడో రెక్కల చేపలు చిక్కుకుని
రివ్వున దిగంతాల్లోకి జారిపోయేవి.
చందమామ కధల్లో చదివిన
గండ భేరుండ పక్షులు
మా తలల మీదుగా ఎగిరేవి
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమనే క్రెడిట్‌ కార్డు పుచ్చుకుని
అమ్మతోపాటు మొదటిసారి విమానం ఎక్కినపుడు
‘ఇదిగో కదిలే చందమామా
నీ పాటల పల్లకీ మోసే బోయీ’ అంటూ
ఇద్దరం పసిపిల్లలమై
గాల్లో తేలియాడిన జ్ఞాపకం
ఇపుడు బేగం పేట ఆకాశం
పక్షులు వాలని చెట్టు
రెక్కలు తెగిన ముసలి విహంగం
పిల్లల్ని పరాయి దేశానికి
వలస పంపించి
ఒంటరితనంతో బావురు మంటున్న
పిచ్చితల్లి

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “పిచ్చి తల్లి”

  1. 1
    ప్రాణహిత » జనవరి 2009 సూచిక Says:

    [...] పిచ్చి తల్లి : సలీం [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో