సముద్రం పోయిందండి

- స్వాతి శ్రీపాద

నేలంతా పరుచుకున్న
అలల కొంగు దారంతా
జిలుగు రవ్వలు పొదుగుతూ
ఉదయపు సూరీడు
మగ్గం పనికెక్కక ముందే
జీవితాన్ని భుజాన వేసుకు
ఒంటిరెక్క నావెక్కే వాస్తవం
ఉషోదయం గమకాల
ఆటుపోట్ల మధ్య
క్షణాల్నీ గంటల్నీ కలనేసి
పడుగుపేకల అల్లికలో
కాలాన్ని రూపాయలుగా మార్చుకునే
వ్యాపారానికి తెరదింపుతూ
సముద్రం పోయిందండి
గోడల వెనక్కి
స్వార్ధం జాగల నీడల్లోకి
వేనవేల జీవితాల్ని
అనిశ్చితికి వేళ్ళాడదీసి సముద్రం పోయిందండి.
వెలుగంతా దోచేసుకు కనుకొలకుల మూలల్ని
చావు దీపం వెలిగించుతూ
గాజుకళ్ల పొడి నెగళ్ళ వెనక్కు
సముద్రం పోయిందండి.
ఉదయం వెలుగు జల్లులు పన్నీటి చినుకులై రాలుతూనే
ముంగిట్లో రంగుల హరివిల్లుల్ని బంధించి
పని రధాన్నెక్కి ఊరేగే
సీతాకోకచిలుకల రెక్కల్ని విరిచి
కాళ్ళుండి కుంటిదైపోయిన భవిష్యత్తు రేపట్లోకి
చివికిన చీకటి కుప్పలా విసిరి
సముద్రం పోయిందండి.
సముద్రం కదలికల మీద వ్రాసుకున్న
తరతరాల జీవితాల్లోకి పెరుగుదల
పలకా బలపం స్థాయిని వీడకముందే
మాయల మరాఠీ కథల వైచిత్రిలా
శూన్యవలయాల్ని విసురుతూ
హఠాత్తుగా సముద్రం అదృశ్యమై పోయింది.
ఊయల్లో ఊగే పిల్ల
మరో ఇంటి వెలుగయే తీరు
ఇంకా చంకొదలని చిన్నది
పిల్లలకోడిగా మారే రహదారి
జానెడు గుడ్డ ముక్కతో అపురూప ప్రపంచాల్ని
మనసు గుప్పిట దాచుకునే మహత్తర
పధకం ఇంకా రూపైనా దిద్దుకోలేదు
అన్నింటికీ అసలు పునాది
మా అరచేతి స్వర్గం సముద్రం పోయింది.
మా ఉనికే మాయమై పోయింది.
మా రేపు శూన్యమై పోయింది
మా జాతి వట్టి పోయింది.

(గంగవరం మత్స్యకారుల ఆవేదన)

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో