శబ్దం

- దాట్లదేవదానం రాజు

నిర్మల సైకత తీరం లో
ఏకాంతాంతరంగం సేద తీరుతున్నది
నది అలల చిందులు
సుతిమెత్తని ఘోషలా
శ్రవణేంద్రియాల్ని తాకుతుంది.

దీపం అడుగున
కాస్తంత జాగాలో దాక్కున్న చీకటి
తలుపులు మూసిన
లోలోపల ఒంటరి గదిలోకి
వెలుతురు ప్రవహించినట్టు
పెళ్ళుమని జొరబడింది

దూదిపింజెల మీద
పిల్లి అడుగుల నడకలా
పొడుగ్గా సాగిన
నీడ తాలూకు బొమ్మలా
దూది బెజ్జంలోంచి
దారం ప్రవేశించినప్పటి చప్పుడులా
మనోవీధి సంచయంలో
బద్దలైంది నిశ్శబ్దం రహస్యంగానే

మౌనముద్రల ధ్యానం
రక్తపంకిలమయ్యింది
ధ్వనుల భేరీకి
గుండె బీటలు తీసింది
స్పర్శల్ని గుర్తించే
అశబ్దాల్ని తిరిగి కలగనాలి.

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో