Feb2009
ఐడెంటిటీ
- కె.గీత
ఇక్కడ నేను అన్ని రంగుల్నీ చూశాను-
ఆకాశంలో కాదు-నడిచే నిలువెత్తు మనుషుల్లో-
నిన్ను చూడగానే గుర్తించే రంగు
నీ ముఖాకృతి -నీ ఐడెంటిటీ
నువ్వు అమెరికన్ ఇండియన్ వా
ఏసియన్ ఇండియన్ వా
నీ ఐడెంటిటీ కోసం ఎంత చరిత్ర వెనక్కి వెళ్ళాలి?
ఎక్కడుంది నీ మూలం?
నీశరీరం పైని వొలిస్తే లోపలేంవుంది?
అయినా చిత్రంగా నువ్వు చైనీవైతే చైనీయులు
రష్యన్ వైతే రష్యన్లు
భారతీయుడవైతే భారతీయులు సంబంధీకులవుతారు
అందరూ ఒక్కటనేది- పైపైని సత్యం
అంతరాంతరాల్లో
నీ భాషని కూడా ఈసడించే చూపు-
నువ్వు ఇంగ్లీషు మాట్లాడితే ఆఫీసరూ
స్పానిష్ మాట్లాడితే నౌకరూ ఎలా అయ్యేవసలు?
నేల నీదే అయిన చోట
నీ మాతృభాష మృతభాష అయిన చోట
పరాయి సంస్కృతి
పరాయి పరిస్థితుల్లో
నీ గుర్తింపు
నీ రంగు- నీ ముఖాకృతి- నీ భాష
ఇదో మొదటి ప్రపంచం
నీ సమాధి మీద లిబర్టీలు నిలబెట్టిన సమూహం
రోజు రోజు ఇమ్మగ్రేషన్ టు డ్రీం లాండ్
ది గ్రేట్ లాండ్ ఆఫ్ అపార్చ్యునిటీ
డబ్బే ధ్యేయంగా నీ దేశం వచ్చి నిన్ను అంటరాదంటుంది
ఇక్కడ నేను అన్ని రంగుల్నీ చూశాను
చూడగానే మారే ముఖ కవళికల్లో-
March 1st, 2009 at 10:30 pm
[...] ఐడెంటిటీ : కె.గీత [...]
April 6th, 2009 at 9:09 am
really heart touching poetry… how can you think this much depth…anyway i felt so happy. my regards to you. I PRAY GOD TO GIVE YOU BRIGHT FUTURE IN TELUGU LITERATURE. plz send me some of your poetry to my mail…. your ” ABHIMAANI”– “RISHI”.
January 17th, 2011 at 11:19 pm
[...] http://www.pranahita.org/2009/02/identity/ This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink. ← వేసవి కాలిఫోర్నియా కబుర్లు డంబర్టన్ బ్రిడ్జి → LikeBe the first to like this post. [...]