కాటగలిసిన పదాలు

మట్టిలాడచ్చు పెండను తొక్కితే తొక్కచ్చు
ఇసుక వాగుల ఎడారి ఓడల్లా పరుగులు పెట్టవచ్చు
అల్లరి చిల్లరగనే తిరగచ్చు కావచ్చుగాక

నిజానికి ఎప్పుడు చూడబోయినం
పాదాల ఎత్తు వంపుల వేళ్ళ చివరల
గోళ్ళ అందాలను గోళ్ల నెలపొడుపులను

తెలుగు పాదాలకు
ప్రపంచం తన అడుగుజాడల నడుస్తున్నదని
ప్రపంచ నాగరికతను వేరు వ్యవస్థా వెన్నముకా తనేనని

నడకలు నదులై సాగుతున్నై
నిలిచిన చోటల్లా రెండు చెట్లై పుష్పిస్తున్నై
ఎర్రటెండల్ల బొబ్బలెక్కి పోట్రవుతులకు రక్తం చిమ్మి
ముల్లు గుండెకు దిగి అమ్మ అన్నది పదం
ఓదార్చ లేకపోయినం వేల ఏళ్ళ ప్రస్థానంలో
ఒక్క నిర్వచనమన్నా తొడగలేకపోయనం
పచ్చగడ్డికి తెలుసు అలుగులుందుకే చెరువుకు తెలుసు
పొలాలకు తెలుసు పోరుబాటకూ తెలుసు
పాదాల నెట్లెత్తుకోవాలో

వినగలిగితే గొప్ప శబ్దతంత్రి
పాడగలిగితే ఎంతకు ఒడువనిపాట
మనిషికి తెరిచిన పుస్తకాల పాదలను చదువలేకపోయాను
అడుగును దీసి అడుగు అవి ఎవరివి?
అది ఏ చరిత్ర?

కాటగలిసిన పాదయాత్రలెక్కడ?
ఆకలి బాట పొతమైందెక్కడ?
రెండడుగుల నడుమ దూరాన్ని కొలువలేకపోయినం
జీవితాన్ని మోసుకు తిరిగింది కదా!
ఆ సోయన్నా ఉందా?
నువ్వు ఒప్పుకుంటవు
పాదాలకు బాగానే బాకీపడ్డమని

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “కాటగలిసిన పదాలు”

  1. 1
    ప్రాణహిత » ఫిబ్రవరి 2009 సూచిక Says:

    [...] కాటగలిసిన పదాలు [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో