కె.పి. అశోక్‌ కుమార్‌ కథావలోకనం పుస్తకావిష్కరణ సభ

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కె.పి.అశోక్‌ కుమార్‌ వివిధ కథల మీద రాసినటువంటి వ్యాసాల్ని కలిపి కథావలోకనం అనే పుస్తక రూపంలో తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ తేది 22-1-2009 హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని పాతతరం కథారచయిత మునిపల్లెరాజు ఆవిష్కరించారు. రాజుగారు ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ, విమర్శ అనే శబ్దం కఠినమైనదని, విమర్శకుడు భావ దాస్యం నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి విమర్శకుడు కాగలడని అభిప్రాయపడ్డారు. చీకటి కోణాలతో పాటు వెలుతురు కోణాల్ని కూడా కె.పి. అశోక్‌ కుమార్‌ చూపించాడు. అలాగే రచయిత వెలిగించని భావాల్ని విమర్శకుడు ఒక మెట్టు ఎక్కించి పాఠకుని జ్ఞాన పరిధిని విస్తరించడానికి పాటుపడిన కె.పి.అశోక్‌ కుమార్‌కి అభినందనలు తెలిపాడు.

పుస్తకం మీద ఎ.కె.ప్రభాకర్‌ మాట్లాడుతూ సాహిత్య విమర్శ ఒక సృజనాత్మక ప్రక్రియ అని, ప్రతివిషయాన్ని భూతద్దంలో చూడాలి అని, అంతే కాకుండా రచయిత రచన చూడాలి. వ్యక్తిత్వం చూడాలి. అలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అలవోకగా కె.పి.ఆశోక్‌ కుమార్‌ వ్యాసాలు రాశారు అని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పోరంకి దక్షిణామూర్తి మాట్లాడుతూ కథలపై వచ్చిన విమర్శానా దీపం చిన్నదని దాన్ని కాపాడుతూ వస్తున్న వ్యక్తి కె.పి.అశోక్‌ కుమార్‌ అని అన్నారు. ఈ పుస్తక తొలి ప్రతిని ప్రముఖ కథకుడు ధేనువకొండ శ్రీరామమూర్తి అందుకున్నారు. ఈ సమావేశంలో గుడిపాటి, అంపశయ్య నవీన్‌లు ప్రసంగించారు.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “కె.పి. అశోక్‌ కుమార్‌ కథావలోకనం పుస్తకావిష్కరణ సభ”

  1. 1
    ప్రాణహిత » ఫిబ్రవరి 2009 సూచిక Says:

    [...] కె.పి. అశోక్‌ కుమార్‌ కథావలోకనం పుస్త

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో