మొవ్వు బయటకొచ్చినట్టు

- డా|| గూటం స్వామి

బాల్యం మొలకెత్తడమంటే
అరటి పిలక నుంచి మొవ్వు బయటకొచ్చినట్టు
రెపరెపలాడుతూ పచ్చటి ఆకు
పైకి పొడుచుకు రావాలంటే
ఎన్ని వలయాలు ఛేదించుకురావాలో…
బాల్యం మొలకెత్తడమంటే
అమ్మ కడుపులోంచి బయట పడ్డమే కాదు
కమ్మని మురిపాలను మూట కట్టుకోవడం
ముఖంలో ఎన్ని నవ్వు తెరలున్నాయో చూడాలంటే
బాల్యంలో విరబూసిన
జ్ఞాపకాల పూరేకులను లెక్కించాల్సిందే
ఆకాశం నించి ఓ వర్షపు చుక్క
భళ్ళున నేలపైకి పడడం నెర్రలు పడ్డ నేలకు పండగే
ఒక్కొక్క చినుకూ భూమిలోకి చొచ్చుకు పోతుంటే
భూమి పొరలోని ఉక్క
మంచు పొరలా పైకి లేస్తుంది
బాల్యం లోని జ్ఞాపకాలు కూడా
తెరలు తెరలుగా దృశ్యమానమౌతాయి
నువ్వు గింజపై నల్లటి పొర
గింజ నాణ్యతను పట్టిచ్చినట్టు
వృద్దాప్యంలో మనల్ని పలకరించేవి
బాల్యంలో మొలకెత్తిన ఊసులే..

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “మొవ్వు బయటకొచ్చినట్టు”

  1. 1
    raveender Says:

    బావుంది.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో