నా భాగ్యనగరం తెలంగాణ వజ్రకిరీటం

- రాజా హైద్రాబాదీ

నా ఇల్లును కూల్చి
మాల్స్‌ కట్టిందెవరు?
నా వాకిట్లో
స్టూడియోలు నిర్మించిందెవరు?
నా గల్లీలను మాయం చేసి
కాలనీలు పెంచుకొన్నదెవరు?
దీన్ని కబ్జా అంటారా!
దౌర్జన్యమంటారా!

నా భాషను
బఫూన్లతో మాట్లాడించి
పరిహాసం చేసిందెవరు?
కళాఖండం లాంటి
నా హైద్రాబాదును
పచారు కొట్టులాంటి
బెజవాడను చేసిందెవరు?
దీన్ని కుట్ర అంటారా!
కుటిలమంటారా!

మేరే ప్యారే దోస్తో!
నాది అస్లీ హైద్రాబాద్‌
నువ్వు తీన్‌ పాంచ్‌ చెయ్యకు
తల్లిలాంటి నా గండిపేట నీళ్ళకు
అవమానం జరుగుతుంది
జెరా బచ్‌కే రహెనా!
సలాం కరేతో గులాం నహీ సమజ్‌ నా!
నా కాలిమీద
నీ కాలుపెట్టి తొక్కితే
నయాపూల్‌ నిద్రలేస్తుంది
ఆగే పీచే దేఖ్‌ కే చల్‌నా!
ఈ మోడే ఖతర్నాక్‌ మోడు!

బంతిపూల తోటలో
కర్రీస్‌ పాయింట్లు పెట్టి
ఖూబ్‌ సూరత్‌ను
కచ్‌రా చేశావు
నీ అచార్‌ పచార్‌ కో
మారో గోలీ!
నా బిర్యానీ తిని
దునియా ఖుషీ అవుతుంది
చార్మినార్‌ మీద
చుక్కలు దిగుతాయి
బస్సు బుకింగు కౌంటర్లు తెరిచి
వెన్నెలను అమ్మేయకు!

ఇది అత్తర్‌ నగరం
కంపు రాజకీయాలతో
బీమార్‌ పెంచకు!
దోస్తీ చేసిన వాళ్ళను
ధోకా చెయ్యకు!
ఇక్కడి జనాలది
బోళా గుణం
నా గిన్నెలనే తిని
నీ ఎంగిలి నీళ్ళను
నా ముఖం మీద కొట్టకు
కరచాలనం చేసిన చేతిని
కపటంతో నరుకకు!

చిర్నవ్వు లాంటి
ఇరానీ హోటళ్ళను లేపేసి
క్లబ్బులూ పబ్బులూ పెట్టావు
మలాయి చాయినీ
మస్కా బన్నునీ
టిఫిన్‌ సెంటర్లకింద తొక్కేశావు
షామియానాను పడగొట్టి
సంగీతాన్ని నిలిపేశావు

నన్ను నెట్టివేస్తూ నెట్టివేస్తూ
నేను నిలుచున్న నీడను లాక్కున్నావు
జరుగుతూ జరుగుతూ
చివరిమెట్టుదాగా జారాను
ఇప్పుడు ఉల్టా తిరుగకపోతే
నాకు బతుకుతెరువు లేదు

నా మ్యూజియంని
రవిక గుడ్డ ముక్కలమ్ముకొనే
మ్యాచింగ్‌ సెంటర్‌ చేసిందెవరు?
కాశ్మీరు బులాఖీలాంటి
నా ట్యాంకుబండును
పాపడ్లు కాల్చే
గాజు గుడిసెలుగా మార్చిందెవరు?
సంగీత కచేరీ జరిగే చోట
రికార్డు డాన్సుల సంస్కృతి ఎక్కడిది!

నా భాగ్యనగరం
తెలంగాణ కిరీటం
కోహినూర్‌ వజ్రం లాగా
కొల్లగొట్టాలని చూస్తున్నదెవరు?
నా దివాన్‌ఖానాలో కూర్చుండి
నన్ను బయట నిలుచోబెట్టిందెవరు?
నా గోడమీది అద్దంలో
నీ ముఖం కనిపించడం మంచిదికాదు!

నా హైద్రాబాద్‌
సీతాకోక చిలుక
దాని రెక్కలకు కత్తులుకట్టి
కోడి పందాలు అడకండి
రాత్రి ముషాయిరా జరిగేవేళ
నీ బొరియా బిస్తర్‌
నా పలంగ్‌ మీద కనిపించొద్దు
అలాయి బలాయిని అర్థం చేసుకుంటే
గోలకొండ ఖుదాఫీజ్‌ చెపుతుంది

దయచేసి
నా హైద్రాబాద్‌ను
సజీవ శిల్పంగానే వుండనివ్వండి
ప్రైవేటు సర్వీసుల
‘అడ్డా’ను చేయకండి

నా జాగాలో నేను
షాయెరీ రాసుకొంటాను
నీ జాగాలో నువ్వు
సినిమా బొమ్మలమ్ముకో!
నా హైద్రాబాద్‌ను
హైద్రాబాదుగానే వుండనివ్వండి.

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “నా భాగ్యనగరం తెలంగాణ వజ్రకిరీటం”

  1. 1
    kcube varma Says:

    పెద్దరాజా, పెద్దరాజా
    కళా ఖండాలను ఎవరైనా
    ఖండ ఖండాలుగా ఖండించగలరా?
    చారిత్రక మహా హంతకులు తప్ప!
    భాగ్యనగర భాండాగారంలో సమిధలైన
    మన ఉత్తరాంధ్ర వలస పక్షులెన్నో
    కళా భాండాలను భళ్ళున పగుల గొట్టి
    ప్రాంతీయ వాద కవితా శకలాలను
    ఏరుకొంటున్న వారెవ్వరు?
    నీ జూబ్లీహిల్స్ కొండల జేబుల్లో
    కాసుల ముషాయిరా రింగ్ టోన్స్
    పలికిస్తున్న పబ్ బాబులకూ…
    పోడు మంటల్లో మాడి మసైపోతున్న
    మన సవర గోచీల బ్రతుకులకూ
    ముడిపెడతామా?

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో