కొన్ని జ్ఞాపకాలు…పలవరింతలు

- కాంచనపల్లి

రాత్రి దండానికి వెలువడే ఊపిరి తీగకు
ఒక గుచ్చుకున్న జ్ఞాపకం
కలో నిజమో తెలియని
జీవన రాగంలో
అనివార్యంగా సాగే పాటలో
కదలే చక్రవాకం
పల్లెతల్లీ… జూలపల్లీ
ఎలా ఉన్నావో ఇప్పుడు
బతకు సూదితో ఊరి సిగ్గును
కుట్టే మేర సత్తన్నా
ఎలా ఉన్నావ్‌?
వేవురు అతిథుల ఎదలకు
సత్రశాలవై
ముఖం మీద సూర్యుడుదయిస్తుంటే
లచల తత్వాన్ని అభినవ వేదంగా అందరికీ అందించే
కన్నం సత్తెన్న ఎలా ఉన్నావ్‌?
అసమానతలకు శస్త్ర చికిత్సే అనివార్యం అని
పోరాటాల పిడికిలో ఒదిగిపోయిన ఆయుధమా…
కడసారైనా పలకరించలేకపోయిన కన్నీటి గీతమా
వెంకన్నా ఇప్పుడెక్కడున్నావ్‌?
ఊరంతా చీకటి దుప్పటిలో
ఒదిగి పోయినప్పుడు
రెండు నక్షత్రాల కళ్ళున్న ఓ జాబిలి కూన
ప్రణయ ఝరిలో ప్రియున్ని బిందువు చేయడానికి వెళ్ళే సాహస కన్య
ఇప్పుడు చేతి కర్రమోసే వయసయిందేమో?
అన్ని పంచాయితీలకు
పంచనామాలకు ఆంజనేయున్ని సాక్షిని చేసి
పైపూతల పంచదార వెనుక
స్వార్థాన్ని పడగ దాచుకొని
చిక్కు ముడులు విప్పినట్టే విప్పి
మరింత బిగించే కొలువు దొరల
చావడి ఇంకా ఉందా?
సమస్త విషాద సంతోషానుభూతుల్ని
నిశ్శబ్దంగా గుండెలో మోస్తూ
త్రికాల సంధ్యాగీతమై
ప్రవహించే వాగుతల్లీ
బాగున్నావా?
వూవులలో హృదయం పొదిగి
ప్రేమ సిబ్బిలో పేర్చిన
సద్దుల బతుకమ్మ
గౌనులన్నీ ఓణీలైపోయి
అపూర్వ యౌవన పాకంలో
ఆదమరిచి ఆడే గొబ్బిళ్ళూ
ఉదయాలూ-సాయంత్రాలు
నగ్న సంభాషణలూ
నిసర్గమైన బతుకు దీపాలూ
ఎన్ని వసంతాలూ?
ఎన్ని శిశిర గీతాలు?
జ్ఞాపకాల వర్షంలో తడిచే
ఒంటరి పక్షినయ్యానుకదా
నగరీకరించబడ్డ
చెరువు గుండెనయ్యాను కదా

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “కొన్ని జ్ఞాపకాలు…పలవరింతలు”

  1. 1
    ప్రాణహిత » ఫిబ్రవరి 2009 సూచిక Says:

    [...] కొన్ని జ్ఞాపకాలు…పలవరింతలు : కాంచనపల్లి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో