March 2009 సంచిక

మార్చ్ 2009 సంపాదకీయం

పత్రికను క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లో (వీలయినంతగా మొదటి తారీకు నాడే) తీసుకురావాలనే మా ప్రయత్నాలు సఫలీకృతమౌతున్నాయి. వీలయినన్ని ఎక్కువ రచనలతో మీముందుకు తీసుకు రావాలని, తెలుగు నేల నుంచి సమకాలీన తెలుగు ప్రజా, సామాజిక జీవన వైరుధ్యాలని ప్రతిబింబించే సాహిత్యాన్ని, మీకు అందజేయాలని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం – ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాము. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

మార్చ్ 2009 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

నల్లానల్లని నవ్వు

మెట్రో బస్ వెనకాతల

వొక కితకితల నల్ల సముద్రమేదో

అల లలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది

ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి

నవ్వుల వానలో ముంచెత్తాలని. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

బతుకు మెట్లు

అప్పుడు
నాకు ఆరేళ్ళ వయస్సునుకుంటాను
అప్పుడే రెక్కలు విప్పుకున్న తుంటరి తూనీగలా
అమ్మను చుట్టేసి అన్నాను…
మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

మనం మళ్లీ వెనక్కి వెళ్ళిపోదాం…!

మనమంతా ‘లైఫ్‌-టైం’ ఖైదీలం!
సెల్‌ జైళ్ళల్లో మగ్గుతున్నాం!
అగ్రరాజ్యం రింగ్‌ మాస్టరై
ఆడించే గ్లోబులా…
మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

గాలిసోకిన ఊరుబాల్యం

మనిషి పుట్టగానే ఆట
ఏడుపు పాట ఏకకాలంలోనే పుట్టి ఉంటాయి
అలా మొదలై బాల్యంతో
అల్లుకపోయిన ఆట
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

తిరగబెట్టిన కాగితం

- వడ్లకొండ రమేష్‌

బీళ్ళలో నడుస్తున్న పాదాలు మొద్దుబారినై
బుర్రలో పాతప్పుల ఘర్షణా
కరుణించిన కర్రె మబ్బు
మొగులును జల్లెడవట్టింది
మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

మన చరిత్రలోకి

- ఆర్‌క్యూబ్‌

ఇప్పటి దాకా
వానెవని పాదయాత్రలో కదా ఇవి
చుక్కలు చుక్కలుగా మనం పూలై పరచుకున్నం
అవి అస్పృశ్య వాక్యాలైనా
మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

చరిత్ర పూసిన పువ్వు

నల్లజాతి కలువా,
నాలోని ఆత్మగౌరవ పతాక!
నీ విజయానికి మా దళిత దండాలు.
ఈ కాలం నీది, కొంత నాది,
ఇంకొంత మన అస్తిత్వ గొంతుకలది.
మొత్తంగా మొనగాళ్ళదీ కాలం,
దీన స్వరాలది.

మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

తోట

‘నా స్థలం పక్కనే నీ స్థలం. ఇద్దరం ఇరుగుపొరుగుగా ఉందాం’ మన్నుతో ఫ్రాన్సిస్‌ చెప్పాడు.
చంక కర్రలు చిందులు వేయగా మన్ను డాన్స్‌ చేశారు. మన్నుకు అరవై, ఫ్రాన్సిస్‌కు ఎనభై ఏళ్ళు.
మన్ను తన స్థలం చుట్టూ చూచి నడిమధ్యలో కూర్చుని కన్నీరు పెట్టుకొన్నాడు. ఫ్రాన్సిస్‌ ఓదార్చాడు.
సంతోషంతో మన్నుకు రాత్రంతా నిద్రపట్టలేడు. తెల్లారినా నిద్రలేవలేదు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

రెండు ఉత్తరాలు

బళ్ళలో ప్రవేశపెట్టిన పథకాలలో పోస్ట్ బాక్స్ పథకం ఒకటి. పిల్లలు పోస్ట్‌ బాక్స్‌ వద్దకు వెళ్ళే బదలు పోస్ట్ బాక్స్ పిల్లల వద్దకు వచ్చింది. పోస్ట్ బాక్స్ ను ఏవిధంగా ఉపయోగించు కోవాలో పిల్లలకు నేర్పి తమ తమ అభిప్రాయాల్ని రాయించి, వేయించడం పంతుళ్ల పని. ఉత్తరాలు రాసే విధానాన్ని పిల్లలందరికి నేర్పడానికి ఒక్కచోట కూర్చోబెట్టాం. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కథలు

కొడవటిగంటి చదువు నవల సామాజిక జీవన చిత్రణ

ప్రస్తావన

ఒక రచనలో రచయిత జీవితం వర్ణితమవుతుందా? రచయిత ఆలోచన తెలుస్తుందా? ఆనాటి సమాజం తెలుస్తుందా? వంటి అనేక ప్రశ్నలు కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘చదువు’ నవల చదివినప్పుడు పాఠకులకు కలుగుతాయి. కె.వి.రమణారెడ్డి ఈ నవలను సంఘ చరిత్రాత్మక నవలగా, ఆత్మ చరిత్ర నవలగా వ్యాఖ్యానించారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

ఏది తెలుగులో తొలి కథానిక? ఎందుకు?

ఆధునిక తెలుగు కథ నూరేళ్ళ పండుగ జరుపుకుంటున్నా, చాలా మందిలో తొలి తెలుగు కథ పట్ల స్పష్టమైన అభిప్రాయాలు వెలువడటం లేదు. గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ మొట్టమొదటి ఆధునిక కథానిక అని చాలా మంది విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. దిద్దుబాటు 1910, లలిత 1902, విశాఖ 1904, స్త్రీ విద్య 1902, ధనత్రయోదశి 1902 కథలలో ఒక దాన్ని మాత్రమే తొలి తెలుగు కథగా కొంత మంది గుర్తిస్తున్నారు. మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

కొండాపూర్‌లో తెలంగాణ కైత్వ సభ

- గుర్రం సీతారాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

ప్రపంచ తొలి కథకు అడుగులు పడ్డనేల. గుణాఢ్యుని ఘంటంనుండి జాలువారిన బృహత్కథ అడుగుపెట్టిన శాతవాహనుల టంకశాల. హైదరాబాద్‌కు కొద్ది దూరంలో, మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి కేంద్రానికి 15 కి.మీ. పరిధిలో కొండాపూర్‌ ప్రాంతం ఉన్నది. అది గొప్ప నాగరికతకు ఆనవాలైన ప్రదేశం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వార్తలు

రాజేందర్‌ జింబో “మా వేములవాడ కథలు” అవిష్కరణ సభ

ప్రముఖ కవి రచయిత ‘జింబో’ రాజేందర్‌ రాసినటువంటి “మా వేములవాడ కథలు” ఆవిష్కరణ సభ 2-02-2009 రోజున హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సంకలనాన్ని హైకోర్ట్‌ న్యాయమూర్తి సుభాష్‌ రెడ్డి గారు ఆవిష్కరించారు.
మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »సాహిత్య వార్తలు

తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్‌స్వామి 48వ వర్థంతి సభ

తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్‌ స్వామి వర్ధంతి సభ 5-02-2009న హైద్రాబాద్‌లోని ప్రోగ్రేసివ్‌ మీడియా సెంటర్లో జరిగింది. తెలంగాణ హిస్టరీ సోసైటీ మరియు తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశానికి తెలంగాణ హిస్టరీ సోసైటి సభ్యుడు వివేక్‌ గారు అధ్యక్షత వహించారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వార్తలు

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు

ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు

ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు

Next »