తిరగబెట్టిన కాగితం

- వడ్లకొండ రమేష్‌

బీళ్ళలో నడుస్తున్న పాదాలు మొద్దుబారినై
బుర్రలో పాతప్పుల ఘర్షణా
కరుణించిన కర్రె మబ్బు
మొగులును జల్లెడవట్టింది
ఎక్కడికక్కడ పిల్ల కాల్వలు పుట్టి
‘జీ బొంద వాగు’కు జీవమచ్చింది
ఒడ్డు మీంచెల్లి బొర్లుతున్న నీల్ళను జూత్తంటే
ఇగ ఒడ్డెక్కినట్లనిపిత్తంది
ఒర్రెనీళ్ళను
కడుపారా జుర్రుతున్న నెర్రెలు
తనువారా తానమాడుతున్న
చెరువారా తుమ్మలు
ఎత్తి పోతల మత్తడి దగ్గర
చాప పిల్లల చిత్తడి
సూరెమ్మటి లిగిన ధార
ఎక్కడా నిల్వనిత్తలేదు
సేటింటి కాడ ఇప్పిన బెల్లం మూటా
సేతిల అయిసతు లేక
ఈగలైర్రు రైతులు
గంపెత్తిన పల్లె పడుచుల కళ్ళల్లో
పచ్చని పంటపైర్ల ఊయల
జర్ర పదనారంగనే
ముల్లుగర్ర చేతపట్టి -నాగటియాటగట్టి
ఎద్దుకు మువ్వగట్టి నుదుట నూనెరాసి బొట్టుపెడితే
పొద్దంతా ఎద్దు నుదుట్లనే ఉంది
పాలె చేతబట్టి సాగిపోతున్న నాగటి సాల్లల్ల
నిచ్చెనేసుకొని దిగుతున్న సూర్యుడు
చెలు రెండద్దులూ
మా ఆడోళ్ళ కడియాలైనయి
అచ్చుగట్టిన చెలుకల ప్రతిగడిలో
అక్కపాదముద్రలె
అవి అక్కానేను ఆడిన హైమారెస్సు
గట్టుమీద చెట్టుకొమ్మకు కట్టినచీర
పిల్లవాని నవ్వుల్లో చెట్లు పూలు పూస్తన్నై
మనకు వట్టది గని
చెట్టెప్పుడూ మనిషికి దగ్గరి చుట్టమే
నడినెత్తిమీద పడ్డ సూర్యున్ని
చెట్టు నీడకు దించి
చెలుక కడుపారా ఆరగించి కన్నార్పింది
గుప్పెడు మందెయ్యంగనే
చేను గప్పున పెరిగింది
చెప్పడానికి మాటలు రావుగాని
చెనుకాడ గూసుంటే చెప్పలేని అనుభూతి
తెల్లబంగారం…
మా అవ్వ ఒళ్ళో పాలపొంగైంది
మార్కెటుకు పోతే
గుండె ఆగినంత పనయ్యింది
పరిగె పత్తిలెక్క
పంటమ్మిన పైసలు
పచ్చని ఆకుమీద
ముండ్ల సార్క
తిరగపెట్టిన కాయితం
రైతు జీవితం..

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “తిరగబెట్టిన కాగితం”

  1. 1
    pravallika Says:

    మంచి పద చిత్రాల కవిత్వము రాసిన కవి కి అభినందనలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో