అందుబాటులోకి వచ్చిన కథా రచయితలు

పరిశోధనాంశాల్లో, రచయితలు, వాళ్ళ రచనలు కూడా ఒక కీలకాంశం, కవితా నిర్మాణ వ్యూహాలు, శిల్పం, కావ్యాత్మ, రసం ధ్వని అనుభూతి లాంటి వివిధాంశాల గురించిన పరిశోధన వివేచన తెలుగు సాహిత్యంలో పుష్కలంగానే జరిగింది. తెలుగు సాహితీవేత్త ఈస్తటిక్స్‌ ప్రపంచ సాహిత్యంలో మరెవరికీ తీసిపోని విధంగా నిలబడింది. దానితోపాట తెలుగు సాహిత్యంలో సాహిత నిరామతల గురించి పట్టించుకోవడం జరగవలసినంత స్థాయిలో కాకాపోయినా ఏదో మేరకు జరగుతూనేవుంది. ఆరుద్ర మలయశ్రీలాంటి చేయి తిరిగిన పరిశోధకులు ఈదిశలో చేసిన కృషి చిరస్మరణీయం.

ఇదే పరిశోధనా సాంప్రదాయానికి చెందిన డా.బి.వి.యన్‌ స్వామి “అందుబాటు” పేరుతో ఉత్తర తెలంగాణా కథారచయితలను పరిచయం చేసి మంచి ప్రయత్నం చేశారు. సుప్రసిద్దులు, వర్తమానులతో పాటు అసలు వెలుగు చూడని రచయితలను కూడా ఈ పుస్తకంలో స్థానం కల్పించడం ముదావహం.
వివిధ ప్రాంతాలలో, గ్రామాలలో నివసించే రచయితల చిరునామాలు రచలను స్వీకరించడం అంత సాధారణమైన అంశం కాదు. ఆయా రచయితల కుండే విభిన్న కోణాలు, సిద్దాంత ప్రాతిప్రాధికల వల్ల సమన్వయకులు చాలా ఇబ్బంది నెదుర్కొనవలస్సి వుంటుంది. బి.వి.ఎన్‌.స్వామి ఇలాంటి ఆటంకాల్ని అధిగమించి తన మార్గంలో చక్కగా ప్రయాణం చేశారు.

తన పరిమితిని మించకుండ రచయిత దృక్పధానికి ఆటంకం కలగకండా తన రచనను కొనసాగించారు. అనవసరమైన ప్రశంసలు, విమర్శలు, రచయితల కథనం మీద, వస్తువు మీద తనకు లేని సాధికారత చూపించడం ఈ పుస్తకంలో ఎక్కడా కనిపించదు. ఆయా రచయితలన్ని ఒకే వేదికమీద పాఠకలోకానికి పరిచయం చేసి తెలంగాణ సాహిత్య అస్తిత్వం మరోసారి ప్రకటించడమే రచన లక్ష్యం అని తెలిసిపోయింది.

ఒక వైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే స్వామిగారు ఇలాంటి నిర్మాణాత్మక సాహితి సృజనతో తన ఉత్తమాభిరుచి చాటుకున్నారు.
జింబో, జూకంటి జగన్నాథం జయధీర్‌ తిరుమల రావు, చొప్పకట్ల చంద్రమౌళి, టంకశాల అశోక్‌ లాంటి ప్రసిద్ద రచయితలను ఔచిత్యవంతంగా పరిచయం చేశారు. దాశరధి కృష్ణమాచార్య, పి.వి.నరసింహారావు లాంటి జగత్ప్రసిద్దులు, కథకులుకూడా అని తెలిస్తే ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది 1970-2000 వకు ఉన్న రచయితల్ని పరిచయం చేయాలనే పరిమితిని ఏర్పరచుకున్న స్వామి కథకులను కూడా ఒక ప్రామాణిక స్థాయిని నిర్దేశించుకుంటే మరింత బాగుండేది. సమాచారం దొరకక పోవడమా లేక మరే కారణమో కాని ఇదే కాలంలో వికసించిన కొందరు రచయితలకు చోట లేకపోవడం విచారించ దగిన అంశం.

ఏమైనా తెలంగాణా రచయితల గురించిన పరిచయం రావడం స్వాగతించ దగ్గ పరిణామం. రెండు వందల ఇరువై నాలుగుమంది కథరచయితల పరిచయంతో నూటనలభై ఆరు పేజీలుగా సాగిన ఈ పుస్తకం ప్రతి తెలంగాణా సాహితీ ప్రియుడు చదువదగినది.

ప్రతులకు : డా. బి.వి.ఎన్‌.స్వామి
ఇం.నెం. 9-6-161, రాంనగర్‌,
కరీంనగర్‌ 505 002

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో