Mar2009
రాజేందర్ జింబో “మా వేములవాడ కథలు” అవిష్కరణ సభ
ప్రముఖ కవి రచయిత ‘జింబో’ రాజేందర్ రాసినటువంటి “మా వేములవాడ కథలు” ఆవిష్కరణ సభ 2-02-2009 రోజున హైద్రాబాద్‌లో జరిగింది. ఈ సంకలనాన్ని హైకోర్ట్ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన మునిపల్లె రాజుగారు మాట్లాడుతూ “ ఈ సమాజంలో మనం అనేక స్లోగన్‌ల మధ్య గొప్పదనాన్ని కోల్పోయి బతుకుతున్నాం. కొండ చివర్లో ఉన్న మనలాంటి వారిని ఇటువంటి మంచి సాహిత్యం కాపాడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి వచ్చిన ప్రముఖకవి సిద్ధారెడ్డి మాట్లాడుతూ ‘నా ఊరికున్న గొప్పదనాన్ని గుర్తిస్తూనే నేను వేములవాడలో పుట్టలేదని బాధపడ్డ. ఈ కథల చదివిన తర్వాత తన బాల్యంలో జరిగిన వాటిని, ఇప్పటికి పరిస్థితుల్ని చక్కగా, కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు జింబో. ఇప్పటి బాల్యంలో జీవిస్తున్న పిల్లలకు యవ్వనం ఆలోచనల్ని, చెడు మార్గాల్ని చూపెడుతున్న ఈ సందర్భంలో జింబో వేములవాడ కథల్ని రాశారు. ఈ కథల్ని చదువుతున్నప్పుడు జింబో ఇంట్ల కూర్చోని వేములవాడ గత కాలపు జీవితాన్ని అనుభవిస్తున్నట్టు ఉంటుంది. ఇందులోని కథల్లో నాకు చాలా బాగా నచ్చిన కథలు మోహన్ సర్కస్, తమ్మళిసొన్నాయి నాంపల్లి గుట్ట మొదలైనవి చాలా గొప్పకథలని నా అభిప్రాయం నాంపల్లి గుట్ట కథలో “నాకు డార్జిలింగ్ కొండమీద నుంచి కిందికి చూసిన దృశ్యంకన్నా నాంపల్లి గుట్టమీదినుంచి కిందికి చూస్తే కనపడ్డ దృశ్యాలే అద్భుతంగా కనపడ్తయి” అన్న మాటల్లో జింబో తన ప్రాంతంపై ఎంత మమకారం పెంచుకున్నారో తెలుస్తుందని ‘ తెలుపుతూ ఈ కథల్ని ప్రతి ఒక్కరు చదివి వేములవాడ హృదయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ సిద్దారెడ్డి గారు ముగించారు. ఈ సమావేశానికి రెండో సమీక్షకులగావచ్చిన ప్రముఖ కవి వఝల శివకుమార్ మాట్లాడుతూ “ఈ కథల్ని వేములవాడతో పెనవేసుకున్న అనుభవాల కథలు. కొన్ని సందర్భాలలో వేములవాడ సంస్కారం చాల సమస్యల్ని పరిష్కరించింది. సుబ్రహ్మణ్యం దవాఖానా కథలోని సుబ్రహ్మణ్యం తాతది ఒక మానవీయ కోణం, మానవునిలోనే దేవుణ్ణి చూస్తూ వైద్యం చేయడం. ఇలాంటి కథలు ఇందులో చాలా ఉన్నాయి అన్ని మతాల అనుబంధాలు వేములవాడలో ఉన్నాయి. అవన్నీ ఈ కథాసంకలనంలో కనపడ్తయి” అని వివరిస్తూ ముగించారు. వఝల శివకుమార్ గారు. ఈ కథలను రాసిన రచయిత జింబోగారు మాట్లాడుతూ “రచయితలు ఆత్మకథలు చెప్పే అవకాశం చాలా ఉన్నది. ఆ విధంగా రాసిన కథలు ఇవి అనుకోవచ్చు. మా ఊర్లో నా అడుగుజాడ కూడా ఉండాలి అనుకొని ఈ కథల రాసాను అని ముగించారు. చివరగా ఈ పుస్తకాన్ని ముద్రించిన ఎమెస్కో విజయకుమార్‌గారు మాట్లాడారు.
‘మా వేములవాడ కథలు’
రచయిత : రాజేందర్ జింబో,
వెల 60/-
ప్రతులకు ఎమెస్కో బుక్స్,
29-13-53, కాళేశ్వరరావు రోడ్డు,
సూర్యారావుపేట, విజయవాడ -2
5 అభిప్రాయాలు »సాహిత్య వార్తలు
March 3rd, 2009 at 11:15 am
చాల ఆహ్లదంగ ఉంది
March 5th, 2009 at 10:25 pm
మా ఊరు వేములవాడకు 20 కి.మీ. దూరంలో.మా వేములవాడ కథలు చదివాక నాకు వెంటనే
మా ఊరు కథలు వ్రాయాలనిపించింది.అంతగా ప్రభావితం చేసింది నన్నా పుస్తకం.
నగర యాంత్రిక జీవనంలో పడి కొట్టుకు పోతున్నమనకు తిరిగి మన స్వంత ఊరికి మనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెస్తుంది ఈ పుస్తకం.
September 12th, 2009 at 3:32 am
చేనేత సాహిత్య కథలు, కవితలు, నవలలు, పాటలు,నాటకాలుపై సమాచారం ఇవ్వండి.కెకె.9848362803.
January 2nd, 2010 at 12:58 am
Chalabagundi
February 13th, 2010 at 4:44 am
‘శ్రీశ్రీ కవిత్వంపై ప్రాచ్చ పాశ్చాత్య ప్రభావాలు` అనే పుస్తకం ఇటీవల ప్రచురించాలను కావున మీ ప్రాణహితలో సమీక్ష కోసం నేనే ఎవరిని సంప్రదించాలని తెలుపగలనరు.
కోడం కుమారస్వామి..తెలుగు పరిశోధకులు
9848362803