మార్చ్ 2009 సంపాదకీయం

పత్రికను క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లో (వీలయినంతగా మొదటి తారీకు నాడే) తీసుకురావాలనే మా ప్రయత్నాలు సఫలీకృతమౌతున్నాయి. వీలయినన్ని ఎక్కువ రచనలతో మీముందుకు తీసుకు రావాలని, తెలుగు నేల నుంచి సమకాలీన తెలుగు ప్రజా, సామాజిక జీవన వైరుధ్యాలని ప్రతిబింబించే సాహిత్యాన్ని, మీకు అందజేయాలని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం – ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాము. మా ప్రయత్నంలో లోపాలని దయచేసి మాకు నిర్మొహమాటంగా ఎత్తి చూపండి. బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మక సలహాలు, సూచనలూ ఇవ్వండి, పబ్లిక్ గానైనా సరే ప్రైవేట్ గా నైనా సరే! మేము ఆనందంగా స్వీకరిస్తాము. వీలయినంత వరకూ పాటించే ప్రయత్నం చేస్తాము. విమర్శ, సూచనలు ఎక్కడ్నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు అని ఉద్దేశ్యాలు వెదకడం కన్నా, వాటిల్లో ఉపయోగపడేవి ఏమయినా ఉన్నయా అని నిష్పాక్షికంగానూ, ఆబ్జెక్టివ్ గానూ స్వీకరించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది అని నమ్ముతాము.

అట్లే పత్రికలో ప్రచురించే ప్రతి రచన అభిప్రాయాలతో మేము పూర్తిగా ఏకీభవించక పోవచ్చు. అన్ని రకాల భిన్నాభిప్రాయాలకు వేదిక కావాలన్నది మా ప్రదానోద్దేశ్యం. అయితే రచనల స్థాయి, సాహిత్య విలువల విషయమై పాఠకులుగా ఎవరి అంచనాలు వారికుండొచ్చు. పాఠకులుగా మీ అభిప్రాయాలు రచయితలకు చేరాల్సిన అవసరమెంతో ఉన్నది. వారి వారి రచనలగురించి పాఠకుల నిర్మొహమాట అభిప్రాయాలను రచయితలకు అందజేసే అవకాశం ప్రాణహితలాంటి వెబ్ పత్రికల్లోనే ఉన్నది. ప్రింట్ మీడియా లో రచయితకూ పాఠకునికీ సంభాషణ జరిగే అవకాశము లేదు. కానీ ఇక్కడ రచన చదవగానే దాని గురించి ఏమనుకుంటున్నారు - అది బాగుందనుకుంటున్నారా, అయితే ఎందుకు? లేదా చెత్తగా ఉంది అనుకుంటున్నారా, అయితే కారణాలేమిటి – అవి సాధారణమైనవైనా (general reasons) లేదా నిర్దిష్టమైనవైనా (specific) రచయితలకు చెప్ప గలిగితే ఉపయోగకరంగా ఉంటుందని మా అభిప్రాయం. ఒక కవితో, లేక కథో, లేదా వ్యాసమో చదివి ఇది ఫలానా కారణాల వల్ల బాగుంది, లేదా బాగాలేదు – అంతర్జాతీయంగా ఇతర భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యంతో పోలిస్తే ఈ రచనలు ఫలానా కారణాల వల్ల ఏ రకంగానూ సరితూగవు లేదూ, సరితూగుతాయి అని చెప్పడం వల్ల రచయితకూ పాఠకునికీ ఒక సజీవ సంబంధం ఏర్పడుతుంది. వాదోపవాదాలు కానీ, చర్చలు కానీ దురుద్దేశ్యపూర్వకంగా లేనంత వరకూ (ఒక వేళ ఉన్నా ఆ విమర్శలో మంచి ఏమైనా ఉంటే స్వీకరించే సహృదయత రచయితలేర్పర్చుకుంటే మరీ మంచిది), సాహిత్యేతర విషయాలని గురించి సాగదీయనంత వరకూ (పాలెమిక్స్) సమాజానికీ సాహిత్యానికీ సంబంధం అనివార్యంగా ఉంటుంది గనక సాహిత్య విమర్శ సాహిత్యాన్ని సమాజం నుండి విడదీసి చూడనంతవరకూ రచయితలకూ, పాఠకులకూ, మొత్తంగా సాహిత్య, సమాజాలకూ ఈ సంభాషణ, దానికి మనం కల్పించే జాగా ఉపయోగపడతాయనే మా గట్టి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి, బలపర్చే దిశగా ప్రాణహిత ప్రవహిస్తోంది.

1970 దశకంలోని చివరా, 1980 దశకంలోనూ తెలుగులో కవిత్వం రాయడం మొదలు పెట్టిన ప్రతి కవీ, కవిత్వాన్ని ఇష్టపడ్డ ప్రతి పాఠకుడూ అమితంగా ప్రభావితమైన కవితా సంకలనమొకటున్నది. విప్లవ రాజకీయాల్ని ప్రేమించినా, ప్రేమించకపోయినా, కవిత్వంలో రాజకీయాలుండాలి, లేదా ఉండొద్దని తీవ్రంగా వాదులాడుకున్నా అందరూ దాదాపు సమానంగా ఇష్ట పడి ప్రేమించి హృదయానికి హత్తుకున్న కవిత్వమది. ‘ ఆహా ఎంత బాగా చెప్పాడూ, రోజూ మనం చూస్తున్న దృశ్యమైనా ఎంత అద్భుతంగా కవిత్వీకరించాడూ‘ అనిపించిన ఆ కవితా సంకలనం ‘వెలుతురు పిట్టలు’. జీవితానుభవాలని అందంగా, హృద్యంగా, మరపురాని విధంగా చిత్రిక పట్టిన ‘వెలుతురు పిట్టలు’ కవి కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. కవిత్వం రాస్తే ఇలా రాయాలి అన్నంతగా యువకవుల్నెంత మందినో ప్రభావితం చేసిన కవిత్వం ‘వెలుతురు పిట్టలు’. శ్రీమన్నారాయణ చదువు రీత్యా, వృత్తి రీత్యా ఎలెక్ట్రికల్ ఇంజనీరయినా ప్రవృత్తి రీత్యా అత్యంత సున్నిత మనస్కుడయిన భావుకుడు. కవిత్వంలో సమాజాన్ని, జీవితాన్ని అంతర్లీనంగా ధ్వనించిన శ్రీమన్నారాయణ భావజాల రీత్యా మార్పును కోరుకున్న ఉన్నతమైన వ్యక్తిత్వం. ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తిత్వం. చాలా మంది దరిదాపులకు రావడానిక్కూడా సాహసించని అత్యంత క్రూర నిర్బంధకాలంలో రాజమండ్రిలో జరిగిన విరసం సభల ఆహ్వానసంఘం అధ్యక్షుడిగా సభా నిర్వహణ బుజాలమీద వేసుకున్న సాహసి. శ్రీమన్నారాయణ తన 60వ పుట్టిన రోజయిన డిసంబర్ 31 , 2008 నాడు తన ‘వెలుతురు పిట్టల’ పునర్ముద్రణ ఆవిష్కరణ సభ విజయవంతంగా జరిగేక అందర్నీ సాగనంపి తాను శాశ్వతంగా మనల్ని వీడి ప్రయాణమై పోయారు. తెలుగు నేలపై అనేక మంది కవిత్వాభిమానులని కళ్ళనీళ్ళ పర్యంతం చేసి వెళ్ళి పోయారు. శ్రీమన్నారాయణ కవిత్వం గురించీ ఆయన అరుదైన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!

కవిత్వం లో చిక్కని అనుభూతి, సున్నితమైన బావోద్వేగమూ, జీవితానుభవ గాఢత లతో పాటు తాను నమ్మిన అభిప్రాయాల కోసం, తాను ఉన్నతమైనవని భావించిన విలువల కోసం కష్ట కాలంలో నిలబడగలిగే దృఢత్వమూ శ్రీమన్నారాయణ ను ఒక గొప్ప కవిగా వ్యక్తిగా నిలబెడతాయి. శ్రీమన్నారాయణ కు ప్రాణహిత నివాళులర్పిస్తున్నది. ఆయన స్మృతిలో కోడూరి శ్రీరామ్మూర్తి రాసిన నివాళిని మీకందిస్తున్నాము.

ఈ సంచికలోని రచనలని చదివి మీ  ఫీడ్ బాక్ తో ప్రాణహిత మెరుగుపర్చడానికి తోడ్పతారని ఆశిస్తున్నాము.

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో