Apr2009
ప్రాణహిత
ప్రాణహిత ఏప్రిల్ 2009 సంచికకు స్వాగతం. ప్రాణహిత పాఠకులందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ విరోధినామ సంవత్సరం ప్రజాకంటకులకు విరోధియై, వైరుధ్యాలని పరిష్కరించి వైవిధ్యాలని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సాహిత్యం ప్రజల వైపు నిలవాలా ప్రజాకంటకుల వైపు నిలవాలా అంటే ప్రజల వైపే నిలవాలని, రాజ్యం పక్షం వహించాలా, రాజ్యంచే అణచివేతకు గురవుతున్న వారి పక్షం వహించాలా అంటే నిస్సందేహంగా పీడక రాజ్యాన్ని ప్రతిఘటించాల్సిందేనని ప్రజాస్వామిక దృక్పథంగల వాళ్ళందరూ దాదాపుగా అంగీకరిస్తారు. అయితే ప్రజల మధ్య వైరుధ్యాలని, విభిన్న సమూహాల ప్రజాస్వామిక ఆకాంక్షల మధ్య వైరుధ్యాలను సాహిత్యం ప్రతిఫలించినప్పుడు అనేక సున్నితమైన సమస్యలు ముందుకొస్తాయి. అప్పుడు అన్నీ నలుపు తెలుపుల్లా స్పష్టంగా ఉండకపోవచ్చు. ఒకరికి ప్రజాస్వామికంగా అనిపించింది మరొకరికి అప్రజాస్వామికమనిపించవచ్చు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే సంయమనమూ, సాహిత్య విమర్శా ఎంతో ఉపయోగపడతాయి.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Apr2009
వైదేహి శశిధర్
ఆమె మొన్న ట్రెయిన్ స్టేషన్ లో
నా ప్రక్కనే కూర్చుంది.
ఆర్థ్రిటిస్ తో వంకర తిరిగిన వేళ్ళని
బలహీనతతో వణికే చేతుల్ని
వళ్ళో మడిచి పెట్టుకుని
వంగిన శరీరాన్ని కుర్చీ అంచుకి ఆనించి
మూర్తీభవించిన నైరాశ్యం లా
ఆమె మౌనంగా కూర్చుంది. మొత్తం చదవండి »
కవితలు
Apr2009
డా. కె. గీత
ప్రతీ రోజూ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను
ఏ మార్పూ లేదు-
డిపెండెంట్ ముఖానికి మార్పులేం వుంటాయి? మొత్తం చదవండి »
కవితలు
Apr2009
రామా చంద్రమౌళి
నీకు తెలియకుండానే నిన్ను నువ్వు ఒక ‘రహస్యం’ చేసుకుంటావు
నీ ఆలోచనలు వేరు, మాట వేరు, చేత వేరు
పెదవులు నవ్వుతూనే ఉంటాయి
మనసు ఒక కుట్రను రూపొందిస్తూంటుంది
మొత్తం చదవండి »
కవితలు
Apr2009
కందుకూరి శ్రీరాములు
కచ్చురానికి పయ్యలు తయారైతే
తీర్థం పోయినట్టే
బత్తీసపేర్లు కొని
కొరుక్కుంట తింటుంటే
నోరంతా తీయతీయగైనట్టే మొత్తం చదవండి »
కవితలు
Apr2009
కె.వరలక్ష్మి
ఎక్కడ ప్రారంభమై
ఎక్కడ ముగుస్తుందో జీవితం
హరిత వనాలకావల
ఎడారులుంటాయి మొత్తం చదవండి »
కవితలు
Apr2009
వఝల శివకుమార్
ఔను
‘నేను’ ఒక అస్తిత్వం
నన్ను ‘మనం’లో కలిపి
నన్ను నామరూపాల్లేకుండా చేసిన
నయవంచనల మర్యాదలకింక చెల్లు మొత్తం చదవండి »
కవితలు
Apr2009
డా. నలిమెల భాస్కర్
- మలయాళ మూలం: తంబీఆంటొని (అనువాదం: డా. నలిమెల భాస్కర్)
పది మాసాలు మోసి
ప్రసవ వేదన పడిందంతా
వృథా అయిపోయిందని
అమ్మ అదేపనిగా అనుకోవడమూ
మొత్తం చదవండి »
కవితలు
Apr2009
మంచికంటి
సతత హరితానికి
మూలమూలల్లో
విస్తరించే గ్రీష్మం
ఎంత జడివానైనా
ఇట్టె పీల్చేయగల
ఇసుక పర్ర మొత్తం చదవండి »
కవితలు
Apr2009
హనీఫ్
అదో అందని అందలం
ఎవరెవరో, ఏవరో వస్తూపోతుంటారు
అది విరజాజి పాన్పు
సుగంధాల్ని విరజిమ్మే హంసతూలికాతల్పం మొత్తం చదవండి »
కవితలు
Apr2009
పెద్దింటి అశోక్ కుమార్
దేవిక బస్సు ఎక్కింది.
వెంట రవిఉన్నడు. బస్సుఎక్కి కూసున్నడు.
ఇద్దరికీ ఆగమాగముంది. సీట్లో కూసుండి చేతి సంచిని చూసుకుంది దేవిక. పాత జాకెట్ ముక్క రెండు ఎండిన కుడుకలు, కజ్జరపండ్లు, పోకవక్కలు. వాటిని ముట్టుకోవాలంటే మనుసొప్పలేదు. మొత్తం చదవండి »
కథలు
Apr2009
రేణుక అయెలా
భోజనాలు చేసి తేలిగ్గా టి.విలో తొమ్మిదిగంట న్యూస్ పెట్టగానే, ఒకటే ‘రొద ‘ఎన్నికల ముందు సాగుతున్న నాటకం, అసభ్యపదజాలాలతో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ”ఎవరు రాష్ట్రానికి, దేశానికి ఏం మేలు చేస్తారో చెప్పడం కష్టం. అందరూ ఎదుటివాళ్ళ తప్పులు వెదకడంలో నిమగ్నమై, ఎన్ని తిట్లు తిడితే అన్ని చప్పట్లు, కొట్టించుకుంటున్నారు. కొట్టిన ప్రతీసారి పొంగి పోతున్నారు… మొత్తం చదవండి »
కథలు
Apr2009
ఓదెల వెంకటేశ్వర్లు
అదో పల్లెటూరు. గ్రామ పంచాయితీ ఆఫీసులో జనం నిండిపోయి వున్నారు. ఎంతగా వున్నారంటే దాదాపు ఊరు మొత్తం అక్కడే వున్నారు. లోపల స్థలం సరిపోక గోడలపైన, దాని పక్కన పెరిగిన చెట్లపైన జనం ఎక్కి కూర్చున్నారు. పంచాయితీ ఆఫీసు గద్దెమీద నాలుగైదు కుర్చీలు వేసివున్నాయి. ఆ ఊరికి పెద్దలుగా పిలువబడేవాళ్ళు కూర్చుని ఉన్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, కాపులు, రెడ్లు, బీసిలు, ఎస్సీలు అందరూ అక్కడ పోగై ఉన్నారు. గోలగోలగా వుంది. కక్కిరిబిక్కిరి అరుస్తున్నారు. రోడ్డుమీద వెళ్ళేవారు జనాన్ని చూసి ఏం జరిగిందో తెలుసు కోవడానికి ఆగిపోతున్నారు. సంకలో పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. విసుగుతో రెండు దెబ్బలు వేసి పాలరొమ్ము నోటికి అందిస్తున్నారు తల్లులు. దెబ్బలను మరిచి ఆబగా పాలను తాగుతున్నారు చంటిపిల్లలు. మొత్తం చదవండి »
కథలు
Apr2009
చిత్ర రామారావు
అతిశయోక్తులు లేకుండా, అలంకారాలు లేకుండా, ఆర్భాటాలు లేకుండా, మరీ ముఖ్యంగా నిర్మొహమాటంగా మనం కొడవటిగంటి కుటుంబరావుగారి గురించి మాట్లాడుకోవలసే వుంది.
రాశిపొయ్యడం కుటుంబరావుగారి విశిష్టతకాదు. గురజాడ గురించి మాట్లాడుతూ చా.సో. నన్నయ నుంచి అంటే తొమ్మిది వందల సంవత్సరాల నుంచీ వున్న భాషని ఆయన మార్చి వేశాడు అన్నారు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
Apr2009
కె. అంజనేయ కుమార్
“ఏ తోబుట్టువు లేని ఏకాకి మా అమ్మ…” అంటారు ‘అమ్మకవి’ రాం (సి. హెచ్ . రాం ). నిజమే ఈ చరాచర ప్రపంచంలో చలనంలేని వస్తువులు సైతం మనల్ని ఆదరిస్తాయి అక్కున చేర్చుకుంటాయి. కన్నీళ్ళు తుడుస్తాయి. కవిత్వం కూడా అంతే. కవిత్వం చదివే వాళ్ళకీ, రాసేవాళ్ళకీ ఏకాకితనం వుండదు ఎలాంటి బాంధవ్యాల లేమి వుండదు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
Apr2009
యాకూబ్
పరిచయం
అరుణ రాసిన ‘ఎల్లి నవల 1992లో నవంబరులో తొలిసారి అచ్చయ్యింది. ‘నీలి’తో కలిపి 1996 ఆగస్టున తిరిగి ముద్రించారు. ‘విరసం’ వారు ప్రచురించిన ఈ నవల దళిత జన జీవన సంస్కృతిని ప్రతిబింబించింది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు