అంతా ద్వైతమే

ఎక్కడ ప్రారంభమై
ఎక్కడ ముగుస్తుందో జీవితం
హరిత వనాలకావల
ఎడారులుంటాయి
తీయని నదీప్రవాహం
సముద్రంలో కలిసి
ఉప్పునీటిగా మారుతుంది
పల్లె రంగు వెలిసిపోయిందని
పట్నానికి వలసవస్తే
కాంక్రీటు అరణ్యంలో
ఉనికి మాయమౌతుంది
ఎన్నికల ముందు నాయకులు
చిరునవ్వుల మాస్కులు ధరించి
మభ్య పెడుతూ
కరవాలాలు ఝళిపించి
భయపెడుతుంటారు
ఆరిపోయిందనుకుని
ఆదమరిచి నడిస్తే
నివురు కప్పిన గుండంలో
నిప్పులు ఎగసిపడతాయి
చేతులన్నీ ఒక్కటికావాలని
మానవహారంగా నిలబడితే
మతాల కులాల స్టిక్కర్లు అంటించుకొని
ఎవరికెవరమో అయి విడిపోతాం
చల్లని నీటి మడుగులో
మొసళ్ళు దాగి ఉంటాయి
భవిష్య స్వప్నాలు
అసంతృప్తి శూన్యంలో
ఆవిరైపోతాయి
ఉదయాన్నే గుప్పెడు గింజలకోసం
పిచ్చుకలన్నీ గోడపై చేరినట్టు
మనసు మారుమూల ప్రకంపనలు
వీణ తీగలై శృతి నింపుకొంటాయి
పుష్ప గుచ్ఛంలోంచి
గులాబీ విడివడినట్టు
జీవితంలోంచి
ఆనందం విడిపోతుంది
రంగుల హరివిల్లై విరిసే
బోగన్‌విల్లాల ముందు
వెన్నెల పరిమళాలు విరబూసిన
రేరాణి పూలు కన్పించవు
జీవితం ఎక్కడ ప్రారంభమై
ఎక్కడ ముగిసినా
బతుకు మాత్రం
శృతి తప్పని మధురగీతం కావాలి
మానవత్వం పొంగిపొరలే
సంగీత ఝరి కావాలి-

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “అంతా ద్వైతమే”

  1. 1
    Rajeev Kerala Says:

    It is wonderful…………………………….Your scope of work in all areas is unlimited and beyond expectation. Thanks…………………………I am late to read this…but still sweet this poem.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో