Apr2009
ఎప్రిల్ 2009 సూచిక
- వృద్ధ : వైదేహి శశిధర్
- డిపెండెంట్ స్వర్గం : డా. కె. గీత
- నిర్వచనం-విపర్యయం :రామా చంద్రమౌళి
- తీర్థం : కందుకూరి శ్రీరాములు
- అంతా ద్వైతమే : కె.వరలక్ష్మి
- సందర్భం : వఝల శివకుమార్
- పచ్చి అబద్దాలకోరులు : తంబీ ఆంటొని (మలయాళ మూలం), అనువాదం: డా. నలిమెల భాస్కర్
- యుద్దం : మంచికంటి
- నగరదేహం : హనీఫ్
- కుటుంబరావు సమాజ సాహిత్యం : చిత్ర రామారావు
- కోస్తా కవిత్వం – మహాసంగమమూ మహా సంగ్రామము : కె. అంజనేయ కుమార్
- ఎల్లి-నవల – గిరిజన జీవన సంస్కృతి : యాకూబ్
- వస్తువులో స్పష్టత, శిల్పంలో పదును వెరశి కొ.కు. గల్పిక : విహారి
- జీవితంలో వ్యంగ్యమే రచనల్లో చూపాను : కె. ఎన్ . వై. పతంజలితో పగడాల నాగేంద్ర సంభాషణ
- ద పోస్ట్ మాన్ : (ఏడవ భాగం) : ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్. వేణుగోపాల్)
* * *
ప్రాణహిత ఏప్రిల్ 2009 సంచికకు స్వాగతం!
ప్రాణహిత పాఠకులందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు!!
ఈ విరోధినామ సంవత్సరం ప్రజాకంటకులకు విరోధియై, వైరుధ్యాలని పరిష్కరించి, వైవిధ్యాలని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాం!!!
మార్చి 11, 2009 నాడు విశాఖపట్నం సింహాద్రి ఆసుపత్రిలో అకాలమృత్యువు వాతబడ్డ ప్రముఖ రచయిత పతంజలికి ప్రాణహిత అశృనివాళులర్పిస్తున్నది!

కె. యెన్ . వై. పతంజలి
కె. యెన్ . వై. పతంజలి, (painting by Akbar)
జీవితాంతం తన రచనల్లో ప్రజల పక్షం వహించి, రాజ్యాన్ని, రాజ్యహింసను, రాచరికాన్ని, ఫ్యూడల్ విలువలను, పాలకుల దౌష్ట్యాలని తీవ్రంగా వ్యతిరేకించి తన పదునైన వ్యంగ్యాస్త్రాలతో దునుమాడిన పతంజలి తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు!!!