నగరదేహం

అదో అందని అందలం
ఎవరెవరో, ఏవరో వస్తూపోతుంటారు
అది విరజాజి పాన్పు
సుగంధాల్ని విరజిమ్మే హంసతూలికాతల్పం

మా ఊహాసుందరి
దరి చేరని అత్తరు చెఱువు
మల్లెలు ముడిచి
మైమరిచే మా వీధికి
దానికి మధ్య యోజనాల దూరం

అథోస్థాయి భావసంతర్పణ
నాటికి, నేటికీ వున్న వ్యత్యాసం
తాగి, తూగి
హంసతూలికాతల్పం పై వాల్తాడు
కామాటిపుర బురదమడుగు అంచున
నా మురికి దేహం
ఇద్దరం మత్తులోనే

నగరం దేహం వేరుకాదు
పొగధూళీ మేం కలిసేవుంటాం
ప్రతి హృదయ స్పందన
రోడ్లపై నర్తిస్తున్నప్పుడు
ఇదో జనసునామి

నగరం నగ నగిషీ
చిందిన మా స్వేదఫలితమే
బలిసిన మా కండల వీరత్వమే
మా ‘ఐష్‌’ని చూడు
మా వన్నెలాడులెంతందమో తెలుస్తుంది
నగరం మా హృదయసుందరి
కలల రేరాణి
వుమ్మలేక మేం  గుటకలు వేస్తుటాం

ఎవడ్రా నువ్వు
నల్లిలా మా స్వప్నాన్ని చెదరగొట్ట చూస్తావు
వ్యత్యాసం మా స్తితిగతుల్లోనే
మా మనస్సాకాశంలో కాదు
మా సముద్రం మీద
మా స్వేచ్చా, సామరస్య నిశ్వాసధార మీద
దాడి చేయచూస్తావు
మా సమైక్య ముష్ఠిఘాతం
బిడ్డా!
అణుస్పోటనం కంటే వేయిరెట్లెక్కువ
జాగ్రత్త!!

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో