నిర్వచనం-విపర్యయం

నీకు తెలియకుండానే నిన్ను నువ్వు ఒక ‘రహస్యం’ చేసుకుంటావు
నీ ఆలోచనలు వేరు, మాట వేరు, చేత వేరు
పెదవులు నవ్వుతూనే ఉంటాయి
మనసు ఒక కుట్రను రూపొందిస్తూంటుంది

చేతులు కరచాలనం చేస్తూండగానే
ఎక్కడో ఒక గడ్డి వాము తగలబడ్తూంటుంది
మంటలు కనబడవు-కళ్ళు అగ్ని పర్వతాలౌతాయి
మనిషివి కాబట్టి మనుషుల్తో స్నేహిస్తున్నట్లు నటిస్తుంటావు
కాని ఒంటరిగా నడచిపోతున్నపుడు
నీలో నువ్వు కాలిపోతూండటం తెలుస్తూంటుంది
నీ భవిష్యత్తును నువ్వు ఒక ‘మర్మం’ చేస్తున్నపుడు
నీ దుష్ట ఖడ్గప్రహారంలో
కొందరి జీవితాలు ధ్వంసించబడ్తూండం,
కొందరి వీపులపైనుండి నువ్వు నడచిపోతూండడం
కొందరి శిరస్సులపై
నువ్వొక వామనపాదమౌతూండడం
అంతా…ఒక వికృత సౌందర్యంగా తెలుసు నీకు
నువ్వు నాకు చెబుతున్నదంతా నిజమేననుకుంటాను
కొన్ని సమీకరణాలను కూర్చుకుంటాను

రిక్తనేత్రాల్లోకి కొన్ని స్వప్నాలను ఒలుపుకుని
వీధి మలుపుపై ఎదురుచూస్తుంటాను
విశ్వాసమే ‘మనిషి’ అని నమ్మేవాడిని గదా…
కాని నువ్వు రావు
నిరీక్షణకు ఫలితంగా ఒక అపజయం ఎదురౌతుంది
పరిచయం వేరనీ, స్నేహితం వేరనీ, ఆత్మీయత వేరనీ
నిర్వచనాలు, విపర్యయాలు ఉల్లేఖనలుగా నీనుండి వెలువడ్తాయి
ఏ ఇద్దరు మనుషులైనా కలుసుకున్నపుడు
ద్రవీభవించి కలిసి ప్రవహించవలసిన పాయలు గదా
అని నేనంటే
నువ్వు శూన్యహాసం చేసి నిష్క్రమిస్తావు
మెట్లు అవే
నేను కిందికి దిగుతూ మూలాలను అన్వేషిస్తూంటే
నువ్వు వాటినే ఎక్కి పైకి వెళ్తూంటావు…మన గమ్యాలు వేరు
ఔనూ
మనిషి ఎదుటివారెవరికీ అర్థం కాక
ఎరిగిన ఎవ్వరికీ అర్థం కాక
కనీసం నీకు నువ్వే అర్థం కాక
ఎవరికి వారు ఒక ‘రహస్య’మై అంతరించడం ఎంత విషాదమో-

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “నిర్వచనం-విపర్యయం”

  1. 1
    Rohiniprasad Says:

    నాకు తెలిసిన ఒకాయన ఒక పెద్ద ఇన్ ఫ్రా స్ట్రక్చర్్ కంపెనీలో పెద్ద ఉద్యోగస్థుడని తెలిసింది. పెళ్ళాం, పిల్లలతో చక్కగా జీవిస్తున్న ఈ పెద్దమనిషి పరోక్షంగా ఎందరు నిరుపేదల జీవితాలని నాశనం చేస్తున్నాడో కదా అనిపించింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమంతా ‘కుట్ర’లో భాగస్వాములమేనేమో.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో