పచ్చి అబద్దాలకోరులు

- మలయాళ మూలం: తంబీఆంటొని (అనువాదం: డా. నలిమెల భాస్కర్‌)

 పది మాసాలు మోసి
ప్రసవ వేదన పడిందంతా
వృథా అయిపోయిందని
అమ్మ అదేపనిగా అనుకోవడమూ
ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి
మిగిలిన వాళ్ళకు నగానట్రా చేయించి మొత్తంగా
నాశనమై పోయానని
నాన్న పదేపదే చెప్పడమూ
తండ్రి అంత్యక్రియలకు
లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయని
విదేశాల్లో ఉంటున్న
కుమార శేఖరులూ అనడమూ
ఈ మెదడులేని మొద్దులకు
పాఠాలు చెప్పి చెప్పి
ఏం సంపాదించినట్లో అని
ప్రైమరీ స్కూలు శర్మ సార్‌ ప్రశ్నించడమూ
రహస్యంగా
ఎవరికి తెలియకుండా
గోడదూకి తన్నులపాలు కావడమే
బహుశ ప్రేమ కావచ్చునని
ప్రియుడు భావించడమూ
ప్రేమ మైకంలో సెల్లుకొని
బిల్లులతో జీవితానికి ఇలా చిల్లులు పడడం
వృథా వృథా అని
ప్రియురాలు అనుకోవడమూ
అమ్మ బాబోయ్‌
వీళ్ళందరూ
ఉత్త పచ్చి అబద్దాలకోరులని
మన కవి అనుకోవడం

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో