సందర్భం

ఔను
‘నేను’ ఒక అస్తిత్వం
నన్ను ‘మనం’లో కలిపి
నన్ను నామరూపాల్లేకుండా చేసిన
నయవంచనల మర్యాదలకింక చెల్లు
ఇంత కాలం
కళ్ళకి గంతలుకట్టి
కదలించుకొచ్చిన కాలం
చేర్చిన మజిలీలేవి
నావి కావని తేలిపోయింది
కాటగల్పుకున్న చూపుల జాడకోసం
మాటల తోడుకోసం
మనుషుల సాహచర్యం కోసం
మళ్ళీ వెనక్కి వెనక్కి
ఇంకా లోలోకి
ప్రయాణం కట్టాల్సిందే
దార్లో రాలిపడ్డ
నాభాష ఆనవాళ్ళని అపురూపంగా
గుండెకు హత్తుకుంటూ, ఎత్తుకుంటూ
పుట్టుకనిచ్చిన పునాదుల్లోకి
మనాదుల్లోకి, పాదుల్లోకి
ప్రయాణం కట్టాల్సిందే
అక్కడికెలాగైనా సరే
చేరుకోనన్న భయంలేదు
ఒంటరికాని నా వెంటనేనూ
నేనుబతికున్న గుర్తుగా
నా అంగీ కీసాలో మిగిలిఉన్న
ఆ నాల్గు మాటలూ చాలు
ఎదురుపడుతున్న గుండెల్ని కలుపుకుంటూ
ఈ ప్రాణధారల మూలాల్లోకి
నా ప్రణవ భాష ఆవిర్భావంలోకి
వికాసంలోకి
ఈ ప్రయాణం
చేజారిపోయినవీ
జారవిడుచుకున్నవీ
నేమి,నేమి పట్టుకుంటూ
పొర్లేసుకుంటూ
మర్లేసుకుంటూ
నా వేర్లకు ఊతమిచ్చిన
నా మట్టి పొరల్లోకి ఈ ప్రయాణం
నా గుండెకు గొంతుక నిచ్చే
నా గొంతుకకు ఉనికినిచ్చే
నా తల్లి భాష మూలాల్లోకి ఈ ప్రయాణం
కొండాపురంనించి
కోటిలింగాలదాక
బృహత్కథల్ని కథాసరిత్సాగరాల్ని
మధించుకుంటూ, శోధించుకుంటూ
నా చరిత్ర చీకటికోణాల్లోకి ఈ ప్రయాణం
ఇది నన్ను నేను వెతుక్కుంటున్న సందర్భం
కూడాదీసుకుంటున్న క్రమం
ఆరాటాల్ని సమీకరించుకుంటున్న క్రమం
మరుగునపడ్డ
మహామానవేతిహాసంలోని
వైభవ ప్రాభవాల్ని
ఆవిష్కరించుకుంటున్న సందర్భం

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “సందర్భం”

  1. 1
    ప్రాణహిత » ఎప్రిల్ 2009 సూచిక Says:

    [...] సందర్భం : వఝల శివకుమార్ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో