యుద్దం

సతత హరితానికి
మూలమూలల్లో
విస్తరించే గ్రీష్మం
ఎంత జడివానైనా
ఇట్టె పీల్చేయగల
ఇసుక పర్ర
ఎటువైపు ఎగురుతున్న
శ్వేత కపోతాన్నయినా
కూల్చేయగల
కరుకు ముక్కుల రాబందు
ఏ బంధాను బంధాలనైనా
తెగ నరికే రాక్షస ఖడ్గం
కురిసే విరిసే వెన్నెల్నిండా
చీకటి బెడగొండలు నింపే
పెను ఉత్పాతం
తాగే తాగే నీళ్లనిండా
కటిక విషాన్ని చిమ్మే
రాకాసి బల్లి
ఒక ఉన్మాదానికి
పూసిన
పిచ్చి జిల్లేడు పువ్వు
వెన్నెల మెడలపై
విషపు కత్తులు దించిన
రాతి గుండెల చప్పుడు
ఆయుధాగారాలను
ఆకలి కేకల సోమాలియాలకు
అరువిచ్చే విఫణి వీధి
ఏ సస్యశ్యామలాన్నయినా
మట్టి కరిపించే
ఎడారి
దేదీప్యమానమైన
వెలుగును చిదిమి
చీకటి కమ్మే అమావాస్య
సూర్యోదయాల కంట్లో
శుక్లాలు పూయించగల
గాడాంధకారం
వేల కలల్ని
భగ్గున మండించి
బూడిద చేసే నెరజాణ
ఏ రాత్రినీ
కలవరింతలు లేకుండా
తెల్లారనీయని పీడకల
పసి చిగురు టాకుల్నీ
టపటపా రాల్చేయగల
ఉన్మాది
నిలువెత్తు సంపదల్నీ
ఏట్లో విసిరేయగల
పిచ్చెక్కిన ఆధునిక శాస్త్రవేత్త
ఒకే పుర్రెను నింపిన
వేల దుష్టాలోచనల
చవిటి పర్ర
గుండెలనిండా
ఉక్కునాడాలు నింపుకుతిరిగే
జవనాశ్వం
పగ్గాలు తెంచుకుని
దూసుకుపోయే
రేసు గుర్రం
ఏ అపరాత్రో
నిదుర మబ్బులతో
పట్టిన దావాద్రి
తీరని కాంక్షల
కాలూ చెయ్యూడనీయని
హిట్లర్‌
ఒక వియత్నాం
ఒక ఆప్ఘనిస్తాన్‌
ఓ ఇరాక్‌
ఓ ఇజ్రాయిల్‌
ఒక అమెరికా
ఏ సమూహ గానాన్నయినా
తుంపులు తుంపులు చేసే
సుడిగాలి వడగాలి
ఆకాశాన్నీ పాతాళాన్నీ
చిటికెలో మాయం జేసే
మాయల పకీరు
భేతాళ మాంత్రికుడు
పచ్చగా సువాసన్లతో
విరగ్గాసే
మామిడి ప్రపంచాన్నిండా
సొనలు నింపే విష పాత్రిక
గాయాలు గాయాలుగా
నెత్తురు  వరదలై పారించే
వరద ఉరవడి
పావురాల్నీ రామచిలకల్నీ
జెముడు కాకులుగా మార్చేసే
కాటిపాపడు
రూపాయి బిళ్ళపై
బొమ్మ బొరుసూ
రహస్యం విప్పి చెప్పే
రంగు రంగుల మాయావి
కొలిమిలో బెట్టి
మనిషిని సాగ్గొట్టే
ఎర్రగా మండే నెగడు
ఈ యుద్ధం
ఓ తీతువు కూసిన నేల
ఓ గుడ్లగూబ చూపు
ఓ కాష్ఠాల గడ్డ
ఓ చీకటి గుయ్యారం
ఓ తోడేళ్ళ స్థావరం
ఓ పులి గుహ
ఒక రాక్షస చూపు

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “యుద్దం”

  1. 1
    Rohiniprasad Says:

    ‘మొదటి’ ప్రపంచపు విన్యాసాలకి టాయిలెట్ వంటిది మూడో (నాలుగోది ఉంటే అది కూడా) ప్రపంచపు కొన్ని దేశాల పరిస్థితి. ప్రపంచపౌరులందరూ మేల్కునేదాకా ఈ భయంకర స్థితి కొనసాగుతుంది.

  2. 2
    bandla madhavarao Says:

    అంతర్జాతీయ పరిస్థితులను అద్దం పట్టిన కవిత

  3. 3
    ethakota subbarao Says:

    బాగున్న ది.

  4. 4
    ramnarsimha Says:

    “ఒక అంతర్జాతీయ యుద్ధ కవిత”
    చాలా బాగుంది.
    అభినందనలు.

    ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
    (nlg)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో